వ్యసనము – పతనము
వ్యసనము - పతనము *పల్లవి * తాగకురన్నా ….. తాగి ఊగకురన్నా "2 వ" తాగి ఊగినావంటె తాగుబోతువంటారు పని చేయక తాగుతుంటె పనికి రాడంటారు తాగకురన్నా….. తాగి ఊగకురన్నా "2 "చరణం పిల్లలంత నిన్నుజూచి పిచ్చోడని అంటారు పెద్దలెన్ని చెప్పినా లెక్క చేయకుంటావు బ్రతిమిలాడిన భార్యను విదిలించుకుంటావు ఆకలేసి అడిగినా పిల్లల బెదిరించుతావు తాగకురన్నా తాగి ఊగకురన్నాచరణం పనులు చేయకుండానె పైసలెట్ల వస్తాయి ఇంట వంట గిన్నెలమ్మి మందు తాగుతుంటావు పెండ్లామును బెదిరించి కూలిడబ్బు లాక్కుంటవు బారుకెళ్ళి మందుతాగి నేలబడి పొర్లుతావు తాగకురన్నా తాగి ఊగకురన్నాచరణం పనికెళ్ళక పడుకుంటవు పస్తులుంచి ఏడ్పిస్తవు బడికంపక పిల్లలను వీధి బాలలను జేస్తవు ఆలి,పిల్ల లాకలేసి అల్లాడుతు ఉంటారు ఎంగిలిస్తరాకు లన్ని ఏరుకొని తింటారు తాగకురన్నా తాగి తాగి ఊగకురన్నాచరణం ఆకలి భరించలేక దొంగలుగా మారుతారు పోలీసులు పట్టుకొని నేరస్తులుగా కట్టి ఇంటినుండి ఈడ్చుకెళ్ళి జైలునందు వేస్తారు బాధ్యత లేని తండ్రి వల్ల బాధలు…