Month: January 2022

సంక్రాంతి అంటే….

సంక్రాంతి అంటే.... సంక్రాంతి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ముగ్గులేగా. ఎప్పుడైనా ఎక్కడైనా పెద్ద పెద్ద ముగ్గులు కనిపిస్తే మనసుకు తోచేది కూడా సంక్రాంతే కదా. అబ్బా! ఒక్క ముగ్గులేనా… అలా ఎలా! సందెగొబ్బెమ్మలు, పూలు, భోగిమంటలు, గంగిరెద్దులు, గాలిపటాలు, హరిదాసులు, బొమ్మలకొలువులు, భోగిపళ్ళు, పిల్లలు, పిండివంటలు, పేరంటాలు, అమ్మ చేతి ముద్దలు, అమ్మమ్మ పెట్టే ముద్దులు, కొత్త పంటలు, కొత్త బట్టలు, కోలాహలం, సంబరాలు, నవ్వులు. అలవిమాలిన సంతోషం. సంక్రాంతంటేనే పెద్ద పండగ! సంక్రాంతంటే మనసు నిండుగా, కన్నుల పండుగ! సంక్రాంతంటే అందుకే మరందరికీ, మనందరికీ మరీ మరీ స్పెషల్. అక్కావాళ్ళూ, వాళ్ళ నేస్తురాళ్ళూ. ఇంకా యింటోవున్న బొట్టికాయ చెళ్ళెళ్ళూ, డిప్పకాయ వెధవలూ, అక్కా మేమూనే అంటూ తయారు. చలికే వణుకు పుట్టే చలిలో, బద్ధకం మరికాసేపు బబ్బోమని కావిలించుకు వదలనన్నా విదిలించుకు, పొద్దున్నే ఏ నాలుగింటికో ఇంకాస్త ముందేనో లేచి ఎక్కడెక్కడి పేడకళ్ళ కోసం ఆవులు గేదెల్ని వెతుక్కుంటూ ఊరంతా…
Read More

పండగ సిత్రాలు

పండగ సిత్రాలు ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, అమ్మాయిలు పండగ బాగా జరుపుకున్నారు కదా, అంటూ సమూహం లో అడుగుపెట్టాను వారం తర్వాత, కానీ ఎవరి ఉలుకు పలుకు లేదు. దాంతో చిరాకు వచ్చి బాగా కక్క ముక్కలు తిని,  అరగకుండా హాయిగా పడుకున్నారా, అంటూ ఇంకో సందేశం పెట్టాను. దాంతో చిర్రెత్తిన ఒక తుంటరి అబ్బో మీ ఆడవాళ్లు అలంకరణకే సగం సమయం కేటాయిస్తారు. మీకే పండుగలన్నీ, మేమేం తినలేదు అంటూ వచ్చాడు. ఆడవాళ్ళు ,అలంకరణ అనగానే నాకు చిర్రెత్తు కొచ్చింది. ఎందుకంటే అసలు అలంకరణ ఎక్కడ చేసుకుంటాం,  పండగ అంటే పనులతో సరిపోతుంది. ఇంకా ఆ తుంటరి అలా అనగానే నాకు కోపం ముంచుకు వచ్చింది. దాంతో నాయనా అసలు నీకు మేము చేసే పనులు తెలుసునా అంటూ అడిగాను. దానికా అల్లరి వాడు ఏముంది కాస్త ఉడకేసి, అలంకరణ చేసుకుంటూ కూర్చుంటారు. అంతేగా అన్నాడు. దానితో నాకు అర్దం అయింది. వీడు…
Read More

సంక్రాంతి జ్ఞాపకాలు

సంక్రాంతి జ్ఞాపకాలు నాన్నగారు సెంట్రల్ గవర్నమెంటులో యువకులకు ప్రత్యేకంగా హ్యుమానిటీస్ విభాగంలో పని చెయ్యటం వల్ల జనవరి 12న స్వామి వివేకానంద వారి పుట్టినరోజు వేడుకలు జిల్లాలో కొన్నిప్రాంతాల్లో పాల్గొని భోగి రేపనగా సాయంత్రానికి అమ్మమ్మ ఇంటికి చేరేవాళ్ళం. కబుర్లతో అర్ధరాత్రి దాటి పోయేది. తెల్లారితే భోగి, తెల్లారుజాము నాలుగు అవుతుంటేనే, అందరినీ నిద్ర లేపేసేవారు. వేడినీళ్ళు, కుంకుడికాయలతో తలస్నానం. స్నానానలు అయ్యాక పొయ్యలో బూడిద, విభూదిలాగ బొట్టు పెట్టుకునే వాళ్ళం. అప్పటికే పెద్దమ్మవాళ్ళ అమ్మాయిలు (అక్కలు) మాకోసం భోగి పిడకలు చేసి వుంచేవారు. ఇంటికి, నాలుగిళ్ళలవతల వినాయకుడి గుడి ముందు భోగి మంట వేసేవారు. అక్కడికి వెళ్ళి వేసేవాళ్ళం. అమ్మమ్మ సున్నుండలు, పాకుండలు, అరిసెలు జాడిల్లో సర్ది వుంచేది. స్నానం, బొట్టు పెట్టుకున్నాక పిండివంటలు తినేవాళ్ళం. పెసరపప్పు వేసి పులగం చేసేవారు. బెల్లం, నెయ్యి, పచ్చి పులుసుతో తినేవాళ్ళం ముగ్గులు అక్కలు వేస్తే, చూసే వాళ్ళం. సంక్రాంతి రెండో రోజు పెద్ద పండగ. ఆరోజు…
Read More

సంక్రాంతి సంబరం

సంక్రాంతి సంబరం సంకురుడు వచ్చెను, సంక్రాంతిని తెచ్చెను. మగువలు ముగ్గులతో ముంగిళ్ళను నింపెను. ముచ్చటగా గొబ్బెమ్మలను పేర్చేను. కూడలిలో భోగి మంటలు వెలిగించెను, ఇంటిలోని పిల్లలు అవుపిడకల హరం ధరింపచేసెను. ఆనాడు నెయ్యి, బెల్లం, పచ్చి పులుసులతో పులగన్నం ఆరగించేను. పెద్దపండగనాడే, పెద్దలు వచ్చెను, అమ్మలు, పెద్దమ్మలు పేరంటము పెట్టును. పప్పు, గారెలు వడ్డించేను. కనుమ రోజున కోడి నైవేద్యమయ్యేను. బూరెలతో బుట్ట నిండిపోవును. అయినవారితో ఇళ్ళు కళకళలాడేను. కొత్త అల్లుళ్లతో, దేవుని ఉరేగింపులతో, పిల్లల ఆటపాటలతో, హరిదాసుల రాగాలతో, గంగిరెద్దుల మేళాలతో ఊరంతా సంబరమయ్యేను. సంక్రాంతి పండగ అందరికి ఆనందాన్ని, అందాన్ని తెచ్చెను. అందరి మనసులు మురిసేను. -బి. రాధిక
Read More

పంచాంగము 28.01.2022

పంచాంగము 28.01.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: ఏకాదశి రా.08:53 వరకు తదుపరి ద్వాదశి వారం: శుక్రవారం-భృగువాసరే నక్షత్రం: జ్యేష్ఠ రా.03:09 వరకు తదుపరి మూల యోగం: ధృవ రా.09:12 వరకు తదుపరి వ్యాఘత కరణం: బవ ఉ‌.09:19 వరకు తదుపరి బాలవ‌ రా.08:10 వరకు తదుపరి కౌలువ వర్జ్యం: ఉ‌.10:00 - 11:30 వరకు దుర్ముహూర్తం: ఉ.09:04 - 09:50 మరియు ప.12:51 - 01:37 రాహు కాలం: ఉ.11:03 - 12:29 గుళిక కాలం: ఉ.08:13 - 09:39 యమ గండం: ప‌.03:19 - 04:44 అభిజిత్: 12:06 - 12:50 సూర్యోదయం: 06:48 సూర్యాస్తమయం: 06:09 చంద్రోదయం: రా.02:42 చంద్రాస్తమయం: ప‌.02:07 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: వృశ్చికం దిశ శూల: పశ్చిమం…
Read More

పంచాంగము 27.01.2022

పంచాంగము 27.01.2022 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: దశమి రా.11:22 వరకు తదుపరి ఏకాదశి వారం: గురువారం-బృహస్పతివాసరే నక్షత్రం: అనూరాధ రా.తె.04:47 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం: వృధ్ధి రా.11:48 వరకు తదుపరి ధృవ కరణం: వణిజ ప‌.01:03 వరకు తదుపరి భధ్ర రా.11:58 వరకు తదుపరి బవ వర్జ్యం: ఉ‌.10:06 - 11:35 వరకు దుర్ముహూర్తం: ఉ.10:35 - 11:21 మరియు ప‌. 03:07 - 03:53 రాహు కాలం: ప‌.01:53 - 03:19 గుళిక కాలం: ఉ.09:38 - 11:04 యమగండం: ఉ.06:48 - 08:14 అభిజిత్: 12:06 - 12:50 సూర్యోదయం: 06:49 సూర్యాస్తమయం: 06:08 చంద్రోదయం: రా.01:39 చంద్రాస్తమయం: ప‌.01:14 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: వృశ్చికం దిశ శూల: దక్షిణం చంద్ర…
Read More

ఎగురుతుంది ఎగురుతుంది

ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది మువ్వెన్నెల జెండా దాస్య శృంఖలాలు తెంచుకున్న విహంగ జెండా ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమీ జెండా తెల్లదొరల దోపిడిని అరికట్టే మువ్వన్నెల జెండా ఎగురుతుంది ఎగురుతుంది స్వేచ్ఛా స్వాతంత్రాల జెండా... -భవ్య చారు
Read More

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే ఒకప్పుడు పిల్లల ఆటలు,పాటలు, దేశభక్తి గీతాలు మా అందరి సంబరాలు, బడిలో ఆటల పోటీలు, గెలిచినా ఓడినా అదో ఆనందం జెండా పండుగ కోసం ఎదిరి చూపులు.. స్వేచ్చ వాయువులు పీలుస్తూ, ఆడుకునే అందమైన రోజులు, అందరి రోజులు కానీ... గత రెండేళ్లుగా జెండా పండుగ అంటే దూరం అయ్యి సంబరాలను, సంతోషాలను దూరం చేసిన కరోనా మంహమ్మరి కేకలు... సంబరాలు లేని జెండా రెపరెపలు చూడని కన్నులు దేశభక్తి గీతాలు లేని పాఠశాలలు.. పిల్లలు లేని సంబరాలు.. మూసేసిన గేటు ముందు అయిందనిపించిన ఉపాధ్యాయులు... మళ్ళీ మంచిరోజులు వస్తాయని ఎదురు చూస్తూ సంబరంగా జరుపుకునే గణతంత్ర వేడుకల కోసం మా పిల్లల ఎదిరి చూపులు.. వస్తాయని రావాలని కోరుకుందాం... -ప్రణవ్ 
Read More

అందరూ ఒక్కటవ్వాలి

అందరూ ఒక్కటవ్వాలి ఎంత తరచి చూద్దామనుకున్నా ఈ పొద్దు నిన్నటిలాగే అనిపించింది సూర్యోదయం కాలేదింకా... గతాన్ని తవ్వితే గడపలో పడి ఉన్న వార్త పత్రిక గణతంత్ర దినమని పలికింది *గతం* ఎన్నేండ్ల పోరాటం ఎందరి త్యాగం ఎంతటి కృషి స్వపరిపాలన కోసం రాసుకున్న రాజ్యాంగం హక్కులు విధులు ప్రతి ప్రాణికున్నాయని పొందేందుకు పోరాటమైనా తప్పదని ప్రతీ జీవి కుల వర్గ మత జాతి లింగ ప్రాంతీయ భేదాల్లేకుండా ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక పరమైన సమానతతో జీవించాలని శపధాలు చేసుకున్నాం కథలు కథలుగా చెప్పుకున్నాం పాటలెన్నో పాడుకున్నాం *వర్తమానం* ఎంత వద్దనుకున్నా మదిని తొలిచే ప్రశ్న 73 ఏండ్లలో దేశం సాధించిన ఘనతేముంది? మనిషిని ఓటర్ జేసీ మతోన్మాదులు భూస్వాములు నియంతలు గూండాలు దళారులు పాలకులయ్యారు ప్రకృతి సంపదంతా మూటల గట్టి వాటాలు పెట్టి దేశ దేశాలు దాటిస్తూ బహుళ జాతి కంపెనీల్లో పోస్తున్నారు ప్రజా ఆస్తులు ప్రయివేటోనికిచ్చి వ్యాపారం చేస్తున్నారు…
Read More