Month: February 2022

గాన కోకిలకు అశ్రు నివాళి

గాన కోకిలకు అశ్రు నివాళి.. ఎన్నో పాటలతో తన మృధు మధుర గళం తో ఇన్నాళ్ళు ఉర్రుతలూగించిన గాన కోకిల మన మధ్యనుండి సెలవు తీసుకున్నారు . లత గారు  28-09-1929 జన్మించారు. తన గానం తో ఇన్నాళ్ళు ఎన్నో భాషలలో  తన సత్తా చాటిన లతా మంగేష్కర్ తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కొన్నాళ్లుగా అసుపత్రి లో చికిత్స పొందుతూ 06-02-2022  ఈ రోజున  మనందర్నీ దుఖ సాగరం లో ముంచుతూ  ఈ   లోకాన్ని వదిలి వెళ్ళారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మన అక్షరలిపి అశ్రు నివాళి అర్పిస్తుంది ...💐💐💐💐💐💐💐💐💐💐💐
Read More

ఓ ఆశాచంద్రికా… 

ఓ ఆశాచంద్రికా...  ముసిరిన చిమ్మ చీకట్లని చీల్చుకుంటూ  వేకువను చూపించే రవికిరణం నీవు. కష్టాల కడగండ్ల సాగరాన్ని దాటమంటూ జీవన తీరానికి దారిచూపే తెరచాప నీవు. నిరాశా నిస్పృహల మండుటెడారిలో మది దాహార్తిని తీర్చేటి నీటిచెలమ నీవు. మోడువారిన జీవితాన కొత్త బంధాలు చివురించేలా నింగి నుండి జాలువారే తొలకరి నీవు. జయమ్ము నిశ్చయమ్మురా అని సాగేలా మది గగనంలో వినిపించే ఆకాశవాణివి నీవు. "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి" అని విరచించిన కవివరేణ్యుడు 'సిరివెన్నెల' గళ నిగళం నీవు.     - శివ.KKR
Read More

ఆశా ప్రపంచం

ఆశా ప్రపంచం ఒకరి ఆశతో, ప్రపంచాన్ని చూశావు. కొందరి ఆశలతో, ప్రపంచంలో పెరిగావు. నీ ఆశతో, ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. నీ ఆశలతో, ఒకరి ప్రపంచానికి వెలుగు నివ్వాలి. అందరి ఆశలతో ప్రపంచం నడుస్తుంది. నీ ఆశ నిన్ను నడిపించాలి. ఆశతో బతకాలి. ఆకాశంలో కాదు. ఆశ లేనిదే జీవనం లేదు. అత్యాశ పడితే జీవితమే లేదు. - బి రాధిక
Read More

పంచాంగము 06.02.2022

పంచాంగము 06.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *పంచమి* ఉ7.06వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *రేవతి* రా8.29 వరకు యోగం: *సాధ్యం* రా8.15 వరకు కరణం: *బాలువ* ఉ7.06 & *కౌలువ* రా7.20 వర్జ్యం: *ఉ8.04 - 9.43* దుర్ముహూర్తం : *సా4.22 - 5.07* అమృతకాలం: *సా5.59 - 7.38* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *మీనం* సూర్యోదయం: *6.35*  సూర్యాస్తమయం: *5.53* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

ఫుల్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ లూప్ లపేట!!!!

ఫుల్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ లూప్ లపేట!!!! రేటింగ్ :  ౩/5 బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ మంచి ఊపు మీద ఉంది ఆమె నటించిన సినిమాలు వరస పెట్టి ఓటిటిలలో రిలీజ్ అవుతున్నాయి. ఆమె మాంచి కథా బలం అలాగే తన పాత్రలో కొత్తదనం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకు పోతుంది. రీసెంట్ గా ఆమె నటించిన లూప్ లపేట కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ : ఈ సినిమా 1998లో వచ్చిన జర్మనీ సినిమా అయిన రన్ లోల రన్ అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీయడం జరిగింది. ఇక కథగా చెప్పుకుంటే సావి (తాప్సీ) మీద తండ్రి ఎన్నో కలలు పెట్టుకుని రన్నర్ గా ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు కానీ ఆ పరుగు పందెంలో ఆమె అనుకోకుండా…
Read More

ఆరోగ్యం అంటే….

ఆరోగ్యం అంటే.... అనారోగ్యానికి ఔషదం అవసరం. ఔషదం ఆరోగ్యాన్ని అందించదు. ఆరోగ్యంగా వుంటే, ఔషదం అవసరం రాదు. ఆరగించినవి అరిగించుకుని, ఆదమరిచి నిదురపోతే, అదే ఆరోగ్యం. -బి రాధిక
Read More

శ్రీ సరస్వతీ సాధన స్తోత్రం 

శ్రీ సరస్వతీ సాధన స్తోత్రం  ఓం అస్య శ్రీసరస్వతీ స్తోత్ర మంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః శ్రీసరస్వతీ దేవతా ధర్మార్థ కామ మోక్షార్థే జపే వినియోగః | ఆరూఢా శ్వేతహంసే భ్రమతి చ గగనే దక్షిణే చాక్షసూత్రం వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం జ్ఞానగమ్యా | సా వీణాం వాదయంతీ స్వకరకరజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః క్రీడంతీ దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా 1 శ్వేతపద్మాసనా దేవీ శ్వేతగంధానులేపనా | అర్చితా మునిభిః సర్వైః ఋషిభిః స్తూయతే సదా | ఏవం ధ్యాత్వా సదా దేవీం వాంఛితం లభతే నరః 2 శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్ | హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్ 3 యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా | యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా సా మాం పాతు సరస్వతీ…
Read More

మదన పంచమి విశిష్టత

మదన పంచమి విశిష్టత *మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు* *జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి*. *యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు*. *యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి*. *శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:* *మాఘ శుక్ల పంచమ్యాం* *విద్యారంభే దినేపి చ* *పూర్వేహ్ని…
Read More

వసంత పంచమి శుభాకాంక్షలు

వసంత పంచమి శుభాకాంక్షలు శ్రీ పంచమి సంధర్భంగా శ్రీ సరస్వతీ దేవీ అనుగ్రహముతో అంద‌రమూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో... వర్ధిల్లాలని సరస్వతి మాతని ప్రార్ధించుకుందాము...... వసంత పంచమి శుభాకాంక్షలు.. ఓం శ్రీ సరస్వతైనమః ..
Read More