Month: November 2022

శ్రీదేవి.. రైలు.!

శ్రీదేవి.. రైలు.! ఒక‌ ఊరిలో ఓ ఆసామి ఉన్నాడు..అతనికి హీరోయిన్ శ్రీదేవి అంటే పిచ్చి‌ అభిమానం..ఒక‌ రోజు ఆమె సినిమా చూడ్డానికి పట్నానికి వెళ్లాడు..ఒక‌ సీన్ లో శ్రీదేవి స్నానం చేయడానికి వెళుతుంటుంది..రైలు పట్టాలకు ఆవల తడికలతో కట్టిన స్నానాల‌గది ఉంది.. ఆ చిల్లుల నుంచి ఆమె అందాలు కనిపిస్తాయేమోనని కళ్లు బాగా పెద్దవి వేసుకుని‌ బల్లమీద కొంచెం ముందుకు జరిగి ఆత్రంగా చూస్తున్నాడు..సరిగ్గా శ్రీదేవి చీర విప్పే సమయానికి పట్టాల మీద రైలు వచ్చేసింది..వీడేమో రైలు పట్టాలకు ఇవతల.. శ్రేదేవి అవతల ఉండిపోయారు..రైలు వెళ్లే సరికి శ్రీదేవి స్నానం కూడా అయిపోయింది.. "ఛా వెధవ రైలు సరిగ్గా ఇప్పుడే రావాలా..బంగారం లాంటి ఛాన్స్ ను మిస్ చేసేసింది"..అని తిట్టుకుంటూ ఇంటికెళ్లిపోయాడు. మర్నాడు మళ్లీ అదే సినిమాకు వచ్చాడు..ఇప్పుడూ అదే ఆత్రం..పక్కవాడు పలకరిస్తే వాడిపై అరుపులు కేకలు.."మూసుకుని సినిమా చూడరా" అని..ఈ రోజు ఎలాగైనా శ్రీదేవిని అలా చూసేయాల్సిందేనని‌ గట్టి పట్టుదలతో…
Read More

పగబూనకే….!

పగబూనకే....! ఎంతజాణవే నెరజాణవే... ఎంతని చెప్పను ఆగడాలను... ఎవరికి చెప్పను నీ బండారాన్ని... మనుషుల్లో మృగాలైన‌ మగాళ్ళైతే.... ఆడా పెచ్చుమీరిపోతున్నారు హవ్వ... ఎంత శుభ్రం చేసినా ఏమూలన దాగుంటావే వగలాడి... కంటికి కానక ఒళ్ళంతా తూట్లు పొడుస్తావు... కుట్టి‌కుట్టి‌ కందిపోయేలా వేసి దురదపుట్టిస్తావు... నీవొకచోటుంటూ దురదింకోచోట పుట్టిస్తూ... దోబూచులాటలేమిటే నంగనాచీ... కమ్మని కలలో నేనుంటే గుయ్యని నీ సంగీతాలేమిటే... చెవిలో నసపెట్టి కలలన్నీ కల్లలు చేస్తావు... నీకోసమని కాయిల్ వెలిగిస్తే అత్తరువాసనలా ఎంజాయ్ చేస్తావు... మాకేమో దగ్గులని బహుమానాలిస్తావా.... బుద్ధిలేదటే నీకు కుయుక్తుల కుంకా... ఎంతని‌ వేచి చూడను నీ ఆగడాలను... ఆకతాయిగా అల్లరులు చేస్తుంటే... నావల్లకాక టప్పున కొట్టానంతేనే... చటుక్కునచచ్చావు నాపై పగతీర్చుకోబోకు.... నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తానే‌.... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ప్రేయసీ కో లేక

ప్రేయసీ కో లేక నా అందమైన ప్రియా అందుకో నా ఈ లేఖ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకో నాకే తెలియదు నీ ఎత్తు పళ్లను చూసా నీ దొడ్డు ముక్కును చూసా నీ లావైన పెదాలని చూసా నీ గుమ్మడి కాయ లాంటి మొఖాన్ని చూసా, నీ పిలక జుట్టును చూసా ఎటూ చూస్తున్నావా తెలియని నీ కళ్ళను చూసా పిప్పళ్ళ బస్తాలా ఉన్న నీ అందమైన నడుమును చూసా అరటి చెట్టులా ఉన్న నీ కాళ్ళను చూసా రాయిలా ఉన్న నీ పాదాలను చూసా స్తంభం లా ఉన్న నీ చేతులను చూసా ఏమీ చూసానో కానీ, నిన్ను చూసిన క్షణం నుండి నువ్వే నా కలలోకి వస్తున్నావు, అందుకే రాస్తున్నా నా ఈ ప్రేమ లేక ,ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించమని బతిలాడుకుంటూ కాళ్ళు పట్టుకుని వేడుకుంటూ ఈ లేక పంపుతున్న నా ప్రేమ ను అంగీకరిస్తూ…
Read More

అర్చన

అర్చన రెక్కలు తెగిన ఆశ కూలిపోతుంటే మనసు చేష్టలుడిగి కూలబడింది వర్తమానం వేగుచుక్కని వేలమేసింది నిరాశ కలలన్నీ నిస్సహాయంగా చూసే కథలయ్యాయి కల్పతరువనుకున్న కాలం కాలు దువ్వుతోంది కాలు కదలదు..నోరు మెదపదు జీవితం మదుపులో ఉన్నట్టుంది రిక్త హస్తంలా మస్తిష్కం శూన్య దేవతగ మారింది చుట్టూ బంధనాల్లాంటి కందకాలు విరిసే బాట విధ్వంసమయింది వీరుల ప్రమాణాలన్నీ వీథిన పడ్డాయి వెడలిపోయిన వసంతంలా వడలిపోయిన ఆలోచనలు కల్లోల్లాన్ని కానుక చేస్తుంటే మనసు కుదుర్లను బిగించి శూన్యాన్ని ఆత్మవిశ్వాసంతో అర్చిస్తేకానీ అస్థిరతల పొగమంచును దాటేలాలేను - సి. యస్. రాంబాబు
Read More

మేల్కొలుపు

మేల్కొలుపు మాదొక చిన్న కుటుంబం మేము అయిదుగురము అక్క, అన్న, నేనూ, అమ్మ నాన్న కాలం చేశారు. ఆ బాధ లోంచి బయట పడడానికి అక్కే అన్నగా మారింది ఇంటికి పెద్ద దిక్కు అయ్యింది. మాకు ధైర్యం చెప్పింది. పొద్దున్నే లేచేది, ఇంట్లో పనులన్నీ చేసేది, మమల్ని తినమంటూ బ్రతిమాలి తినిపించేది అందరం కలసి ఉండాలని కొట్టుకున్నా, తిట్టుకున్నా మనమే అంటూ ఎన్ని కష్టాలు ఉన్నా బ్రతకాలని మంచి మాటలు చెప్పేది పొద్దున్నే మేల్కొలుపు తన గిన్నెల చప్పుడుతో లేచేవారిమి అసలు అక్క ఎప్పుడు పడుకునేది ఎప్పుడూ లేచేదో తెలిసేది కాదు, మబ్బున్నే లేచి వంటలు చేసి, బాక్స్ లు కట్టి తానూ బాక్స్ కట్టుకుని మమల్ని అందర్నీ పని చేయాలంటూ తరిమేది పొద్దున్నే గిన్నెలు చప్పుడు చేయడంతో తెగ విసుక్కునే వాళ్ళం, పనులు చేయాలంటూ అనేసరికి ఇదెక్కడి గొడవంటూ అనుకునే వాళ్ళం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంటూ బజారు…
Read More

ఓ వ్యక్తి కథ

ఓ వ్యక్తి కథ అనగనగా ఓ వ్యక్తి ఉండేవాడు. ఎలాంటి చీకు చింత లేకుండా చాలా సంతోషంగా వాడి దగర డబ్బు ఉంది అన్నే గర్వం కూడా చాలా ఎక్కువగానే ఉండేది.. అతని తండ్రి ఓ వ్యాపారవేత్త కాబట్టి కనీసం వాడికి బయట ప్రపంచంతో కూడా పని లేదు. స్నేహితులు ఇంటికి వచ్చే వాళ్ళు. అక్కడే పార్టీ చేసుకునే వారు. అక్కడే తాగే వారు అక్కడే పడుకున్నే వారు. అనుకోకుండా అతని తండ్రి చనిపోయాడు తల్లి బాధ్యత అంత అతని మీద పడింది. అయినా ఏం పట్టించుకునే వాడు కాదు కనీసం వ్యాపారం చూసుకునే వాడు కాదు ఇంట్లో ఉన్న డబ్బులు అయిపోయే సరికి వ్యాపారంలో డబ్బులు వాడుకునే వాడు. అలా అతను వాడిన డబ్బు 10000/- అయితే 100000/- అన్ని రాసేవారు... అలా మొత్తానికి వ్యాపారం దివాలా తీసే స్థితికి వచ్చేసింది. జీతాలు ఇవ్వలేకపోయేవారు ఉద్యోగాలు అందరు మానేశారు... వ్యాపారం…
Read More

మేలుకొలుపు

మేలుకొలుపు కాలాలు కదిలిపోతున్నా మాయాప్రపంచ మోహంలో మనిషి కదలికలేనట్టు కూరుకు పోయాడు స్వార్థం సాలెగూడు అల్లికలో సాటి మనిషి ఉనికి ఊపిరాడనివ్వటం లేదతనికి కలలు ఆశయాలు విలువలు ఇప్పుడతనికి ఎండిపోయిన బాల్యపు గుడి కోనేరు సంపద లెక్కల ఎక్కాల బట్టియే అతని గాయత్రీ మంత్రమిప్పుడు తంత్రం కుతంత్రం అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అర్ధరాత్రివేళ అతని వూరు మూగరోదన గుండెపై సమ్మెటపోటవుతుంది ఇప్పుడుతను బాల్యం బోనులో బందీ అతనింట అలంకారప్రాయుడైన తథాగతుడి చిరునవ్వు అతని దుఃఖాన్ని కడిగేస్తుండగా మాగన్నుగా కునుకుపడుతుంటే జీవితానికి అర్థం వెతుక్కుంటాడతను - సి. యస్. రాంబాబు
Read More

బండబారిన గుండె

బండబారిన గుండె బండ బారిన గుండె నిప్పులు చెరిగే చూపు కొండను పిండే దేహం గర్జించే కంఠం.... ఇంటికి కంచైతాను కంటికి కునుకైతాను గుండెకు భారోసానైతాను ఎదిరించే కోడె గిత్తైతాను... నేలను దున్నే నాగలై మొలకెత్తే గింజకు మట్టినై నెచ్చలి ప్రేమకు అంకితమై వ్యసనాలకు బానిసలై.... నావను నడిపే తెడ్డునై యంత్రాన్ని నడిపే ఇందనమై ఆలికి వెచ్చని కావుగిలినై బిడ్డలకు నెత్తిన గొడుగునై... కానరాని భాదను మనసునదాచి చిరునవ్వులు చిందే బొమ్మనై బ్రమ్మరాసే రాతలకు బలై కఠినమైన మాటల వెనక ఖరీదైన వెన్నముద్ద లైన మహానుభావులందరికి అంతర్జాతీయ పురుషుల దినత్సవ శుభాకాంక్షలు - హనుమంత
Read More

నడకగీతం

నడకగీతం పల్లవి అరుణోదయమును చూసేద్దాం అవధుల హద్దును చెరిపేద్దాం వేకువ పూలై వికసిద్దాం వెన్నెల రేయై పయనిద్దాం చరణం అడుగే వేయగ రావోయి దొరవై జగతిని ఏలేయి సుఖమింకెక్కడ లేదోయి అలసత్వాన్నే తీసేయి చరణం పదము పదముతో అర్చిద్దాం పలుకుతేనెలుగ మార్చేద్దాం వేకువ పండగ చేసేద్దాం వేదనలన్నీ తీసేద్దాం చరణం గాలీ, ధూళిని ప్రేమిద్దాం ఆలోచనలను కట్టేద్దాం ఆయాసాన్ని నెట్టేద్దాం అడుగు అడుగు జత చేద్దాం చరణం నడకే తోడని భావిద్దాం నడిచే దైవం నడకందాం నడకే నిత్యం శ్వాసిద్దాం వెలుగు రేఖగా భాసిద్దాం - సి. యస్. రాంబాబు
Read More

ఏ రాయైతేనేం.!

ఏ రాయైతేనేం.! మా తాతకి ఒక నమ్మకం ఉండేది.. నేను మందులు తీసుకెళ్లి ఇవ్వగానే.. ఎంతరా.. అనే వాడు.. ఖరీదు చెప్పగానే.. ఆ మందు పనిచేస్తుందా.. లేదా అనేది తేల్చేసేవాడు.. నేనప్పుడు ఆశ్చర్యంగా చూసేవాడిని.. ఈయనేదో పెద్ద డాక్టర్ అయినట్టు.. అన్నీ తెలిసినట్టు చెప్పేస్తాడేంటో.. నన్ను ఆడుకోనివ్వకుండా.. అని తిట్టుకున్న సందర్బాలు కూడా చాలానే ఉన్నాయి..  డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మా‌ నుంచి దూరమై ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలతో ఏడిపిస్తూనే ఉంటారు. కొద్దిరోజుల క్రితమే మా సోదరి ఆడపడుచుకి అనారోగ్యం అంటే.. రిపోర్టులు తెప్పించుకుని తెలిసిన వైద్యులకు చూపించాను.. నాలుగు పదుల వయసు దాటిన ఆమెకు వచ్చింది ప్రాణాంతక వ్యాధి‌లా ఉందని సందేహపడి వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురమ్మారు.. అక్కడైతే ఆధునిక సామాగ్రి ఉందని, వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేస్తారని.. మనం‌ మాట్లాడి మరింత మెరుగైన వైద్యం అందించేలా చూడవచ్చని వారు చెప్పింది యథాతథంగా మా బావకు, ఆయన…
Read More