Book and Movie Reviews

తెగింపు సినిమా సమీక్ష

తెగింపు సినిమా సమీక్ష అజిత్, మంజు వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మిగతా వాళ్ల గురించి తప్ప ముగ్గురు గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను వాళ్లు హీరో హీరోయిన్స్ అలాగే సముద్ర ఖని. సినిమా మొత్తం ఒక గ్యాంగ్ స్టర్ గురించి అయినా సమాజంలో జరిగే లోటు పాటలను అలాగే ప్రజల అమాయకత్వం గురించి దేన్నైనా నమ్మి బలి పశువుల్లా చూపిస్తూ అలాగే కొందరు తప్పని పరిస్థితులలో పై అధికారులకు లొంగిపోవడం లాంటివి ఈ సినిమాలో చూపించారు. హీరో గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది చూపించలేదు కానీ హీరో ఒక గ్యాంగ్ స్టర్ అని సినిమా మొదట్లోనే చూపిస్తారు. అలాంటి హీరో దగ్గరికి ఒక డీల్ వస్తుంది. కానీ దానికి హీరో ఒప్పుకోడు దాంతో వాళ్ళు వేరే వాళ్ళకి అప్పగిస్తారు. వాళ్లు ఒక పదిమంది గ్యాంగ్ కలిసి ఒక బ్యాంకు దోచుకోవాలి అందులో 500 కోట్లు…
Read More

అనుకోని ప్రయాణం సమీక్ష

అనుకోని ప్రయాణం సమీక్ష అనుకోని ప్రయాణం అంటే ఏదో మామూలు సినిమా నేమో అని అనుకున్నాను కానీ ఇది మనసుకు హత్తుకునే సినిమా అని మొదలైన కాసేపట్లోనే అర్థమైంది. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ఊర్లో నుంచి భువనేశ్వర్ కి వలస కార్మికులుగా వచ్చిన కొందరి జీవిత కథనే అనుకోని ప్రయాణం. ఈ అనుకోని ప్రయాణంలో మొదటగా మనకి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు, ధన్ రాజులను చూపిస్తూ వారి జీవితంలో ఉన్న ఎత్తుపల్లాలను మనసుకు కదిలించేటట్లు చూపించారు. నరసింహారాజు, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ స్నేహితులు. ఒకే గదిలో ఉంటూ భువన కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు వాళ్లంతా ఒక కాలనీలోని వివిధ గదుల్లో నివాసం ఉంటారు అయితే రాజేంద్రప్రసాద్ కి పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఉండదు కానీ నరసింహ రాజుకు మాత్రం కుటుంబం ఉంటుంది ఒక కూతురు ఉంటుంది ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్లుగా చూపిస్తారు.  ఆమె…
Read More

వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ

వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ మూవీ వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దగ్గుబాటి వెంకటేష్ మరియు నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన వెంకీ మామ పండుగ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రవితేజ ఇప్పటికే సక్సెస్ మూడ్‌లో ఉన్నాడని, ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించాడని మనకు తెలుసు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూడాలి. విశ్లేషణ: ఒక అభిమాని తన దేవుడిని స్క్రీన్ పై ఎలా చూపిస్తాడో చూడటం ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. బాబీ చిరంజీవిని అన్ని షేడ్స్‌లో చూపించగల సబ్జెక్ట్‌తో ముందుకు వస్తాడు అలాగే వింటేజ్ చిరుని తిరిగి తీసుకురావడంలో అతను ప్రధానంగా విజయం సాధించాడు. వాల్తేరు వీరయ్యగా, మెగాస్టార్ యాస, వేషధారణ మరియు మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మనోహరంగా…
Read More

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ అఖండ అద్భుతమైన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన వీరసింహారెడ్డి సినిమా వచ్చేసింది... మరి ఈ సినిమా కూడా సక్సెస్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం... కథ: జై మరియు అతని తల్లి (మీనాక్షి) టర్కీలో నివసిస్తున్నారు. మీనాక్షి ఒక రెస్టారెంట్‌ను నడుపుతుండగా, జై కార్ డీలర్‌షిప్‌ను నడుపుతున్నాడు. ఇస్తాంబుల్‌లో నివసించే సంధ్య (శృతి హాసన్) తో ప్రేమలో పడతాడు జై. పెళ్లి పూర్తి చేయడానికి సంధ్య జై తల్లిదండ్రులను కలవాలని పట్టుబట్టడంతో, జై తన తండ్రిని మొదటిసారి కలిసినప్పుడు వీరసింహారెడ్డి (జై తండ్రి) టర్కీకి వస్తాడు. వీరసింహా రెడ్డి టర్కీకి వచ్చినప్పుడు విషయాలు తీవ్ర మలుపు తిరుగుతాయి, అక్కడ అతని గతం అతన్ని వెంటాడుతుంది. ఈ గతం ఏమిటి అలాగే తర్వాత ఏమి జరుగుతుంది అనేది మిగిలిన కథ. విశ్లేషణ: మలినేని గోపీచంద్‌కి లభించిన సువర్ణావకాశాన్ని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. అఖండ…
Read More

అక్షర నీరాజనం

అక్షర నీరాజనం తేనెలా మా మనసుల్లో చేరావు కన్నే మనసుతో కన్నెల హృదయాలను కొల్లగొట్టి గూడచారిలా గుండెల్లో నిలిచావు ఇద్దరు మొనగాళ్లు అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచావు మీకు సాక్షి నేనేనంటూ అలరించావు మరపురాని కథలెన్నో చెప్పావు స్త్రీ జన్మ గొప్పదని చాటావు ఉపాయంతో అపాయాన్ని దటవచ్చని తెలిపారు ప్రైవేట్ మాస్టారుగా పాఠాలే నేర్పావు అవే కళ్ళతో లోకాన్ని చూడమంటూ చెప్పావు అసాధ్యము కాదేది అంటూ మార్గం చూపావు నిలువు దోపిడి కి దేవుడైన కరగాల్సిందే అన్నావు మంచి కుటుంబాన్ని మించిన సంపద లేదన్నావు సర్కారు ఎక్స్ప్రెస్ లో అమాయకుడిలా ప్రయనించావు అత్త గారు కొత్త కోడళ్ళు ఎలా ఉండాలో చూపావు అల్లూరి ని నేనే అంటూ గుండె ధైర్యం చూపావు ఈనాడుతో సమాజంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని చూపావు లక్ష్మి నివాసం లో లక్ష్మి కొలువై ఉందన్నావు నేనంటే నేనే నాకెవరూ సాటి లేరు అన్నావు ఉందమ్మా బొట్టు పెడతా…
Read More

కాంతార లో “భూతకోలం” వెనుక ఉన్న అసలు కథ ఏంటి?

కాంతార లో "భూతకోలం" వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కాంతార దేశాన్ని అంతా తన వైపు చూసేలా చేసింది. ఈ సినిమాని 16 కోట్లతో నిర్మించారు. ఇప్పుడు ఆ సినిమా 250 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను మీరు అందరూ చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి ధియేటర్ కి వెళ్లి చూడండి ఈ సినిమాతో చరిత్రను సృష్టించారు అని చెప్పవచ్చు. ఇందులో ప్రతీ సన్నివేశం ప్రతీ మలుపు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా కోలం వేసే సీన్లు, అప్పుడు వచ్చే హంటింగ్ బీజీయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో చూపించిన సాంప్రదాయ పద్ధతులు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాయి. అందుకే ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో చెప్పుకోదగ్గది భూత కోలం ఈ భూత కోలం అంటే ఏమిటి? ఇది ఎందుకు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూత…
Read More

పోన్నియన్ సెల్వన్

పోన్నియన్ సెల్వన్ పోన్నియన్ సెల్వన్ అనే మణిరత్నం సినిమా తమిళంలో వచ్చింది దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అయితే ఈ సినిమా మన తెలుగు వాళ్లకి అస్సలు నచ్చలేదు. మరి ఈ సినిమా మన తెలుగు వాళ్లకి ఎందుకు నచ్చలేదు అసలు వసూళ్లు ఎందుకు రాలేదు మణిరత్నం సినిమా అంటే చాలా ఎక్స్పేక్టేషన్స్ పెట్టుకొని ఖచ్చితంగా హిట్ చేసే మనవాళ్లు ఎందుకు ఈ సినిమాని ఆదరించలేకపోయారు? అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం.. ఇక్కడ నేను కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. ఎవరిని కించపరచడానికి ఎవరిని తక్కువ చేయడానికి చేయడం లేదు. ఇక కథ విషయానికొస్తే, రాజుల మధ్య జరిగే అంతర్యుద్ధ కథనమే ఈ సినిమా.. చోళుల రాజు కి ఇద్దరు కొడుకులు వారిలో పోన్నియన్ సెల్వన్ అనే అతను చిన్నప్పుడే నదిలో పడిపోతే వనదేవత కాపాడిందని అక్కడి వారంతా నమ్ముతారు అందుకే అతన్ని కాపాడుకోవడానికి దేశమంతా తమ వంతు ప్రయత్నం…
Read More

రాజరాజచోళుడి కథే పొన్నియన్ సెల్వన్

రాజరాజచోళుడి కథే పొన్నియన్ సెల్వన్ పొన్నియన్ సెల్వన్ సినిమాని బాహుబలి తో పోల్చి తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందారు కానీ అదే పేరుతో వచ్చిన (ఐదు భాగాల) నవలకు చక్కని దృశ్య రూపం సినిమా పియస్1 చోళ, పాండ్య రాజుల వైరం ఒకపక్క ఇంకోపక్క సుందరచోళుడు సామ్రాజ్యంలో అంతఃకలహాలు, కుయుక్తులు, కుట్రలు ఈ మొదటి భాగంలో కనిపిస్తాయి. తమిళ రచయిత కల్కి రచించిన ఐదుభాగాల నవలను తెరకెక్కించాలన్న మణిరత్నం రెండు దశాబ్దాల కల ఈ సినిమా. నవల రెండు భాగాలతో మొదటి భాగం సినిమా వచ్చింది తెలుగు, తమిళ సినిమా అభిమానుల మధ్య ట్విట్టర్ లో మాటల యుద్ధమే నడిచింది. మన సమీక్షకులు కూడా సినిమాను ఏకేశారు. Elevation moments లేవని వీళ్ల ఫిర్యాదు. ఈ సినిమాను నవలకు అనుగుణంగా తీశాడు దర్శకుడు. పాత్రల చిత్రణలో గందరగోళమేమీలేదు. పాత్రధారుల నటనకు వంకపెట్టలేము. గ్రాఫిక్స్, రంగాలంకరణ topnotch గా చెప్పుకోవచ్చు. కాస్త రెహమాన్…
Read More

అలజడుల స్మృతి గీతాలు

అలజడుల స్మృతి గీతాలు గజల్ గాయనిగా జ్యోతిర్మయి మళ్ల మనకు సుపరిచితులు. కవితాత్మక కథనంతో బాల్య స్మృతులుగా కొద్ది కాలం కితం ఆవిష్కరించిన వారు ఇటీవలే కథల పుస్తకాన్ని వెలువరించారు. మొత్తం పదిహేను కథలుంటే వాటిలో ఎనిమిది కథలు రోజుకూలీల జీవితాల కష్టాలను, కడగండ్లను చూపుతాయి. భావం, శైలిలకు సమన్వయం కుదిరితే ఆ కథ మంచి కథవుతుందంటారు విమర్శకులు. ఆ సమన్వయం చాలా కథలలో కనిపిస్తుంది. చెమటచుక్కలను సిరా చేసి రాసినట్టనిపించే కథలివి. ఎక్కువ కథల్లో వృద్ధుల వెతలు కనిపిస్తాయి. అందుకు కారణం నిరాశ్రయులయిన ఎందరో పెద్దవారిని తమ తల్లి ఆశ్రయమిచ్చిందని, వారి వెతలే కథలుగా ప్రాణం పోసుకున్నాయంటారు రచయిత్రి. శ్రీకాకుళం యాస తీయగా పలకరిస్తుందీ కథలలో. మోతాదుకు మించిన నాటకీయత, సినిమాటిక్ మలుపులు లేకుండా సహజంగా కథలివి.కథల్లోని పాత్రలతో మనమూ ట్రావెల్ చేస్తాం. మొక్కజొన్న పొత్తులు కొంటామేమోనని ఎదురు చూసే మనుషులు రైల్వే క్రాసింగ్ ల వద్ద, బస్టాండ్ల్లోను తారసపడుతుంటారు.…
Read More

ఆచారాల కట్టుబాట్లను దాటమనే అంటే సుందరానికి

ఆచారాల కట్టుబాట్లను దాటమనే అంటే సుందరానికి కొన్ని సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాయి. కొన్ని సినిమాలకు కాంబినేషన్లు సెట్ అవుతాయి. నవ్వులు పంచటం ఖాయమని భరోసా ఇచ్చిన సినిమాల్లో చాలావరకు మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేసిన సినిమా అంటే సుందరానికి. రెండు మతాల పిల్లలు ప్రేమలో పడినప్పుడు, ఆ ప్రేమని పెద్దలు అంగీకరించరని తెలిసినప్పుడు అబద్దాల పునాదిపై తమ ప్రేమను గెలిపించాలనుకుని, అందుకు ఆడిన డ్రామాలు ఎటువంటి పరిస్థితుల్లోకి ఆ జంటను నెట్టాయన్న కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ అంటే సుందరానికి. అటు బ్రాహ్మణ కులాన్ని కించపరచకూడదు, ఇటు క్రిస్టియన్ కమ్యూనిటీని హర్ట్ చేయకూడదు. దర్శకుడికి ఇది కత్తిమీదసాము లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే కాంప్లెక్స్ గానే ఉంటుంది రైటింగ్. మధ్య మధ్యలో మీదో గంట సమయం కావాలంటాడు హీరో తన బాస్ ని.  అలా మనతో తన కథను కష్టాలను చెప్పుకుంటుంటాడు. ఫస్టాఫ్ కథేమీ సాగదు కానీ, కేరక్టర్లను ఎస్టాబ్లిష్ చేయటంతో…
Read More