Family Stories

కానుక

కానుక అందరి అమ్మాయిల లాగానే నాకు కూడా మంచి భర్త, నన్ను ప్రేమించే భర్త రావాలని కోరుకునే దాన్ని నేను కూడా. నేను కాలేజీకి వెళ్లే రోజుల్లో రోజు సరిగ్గా నేను కాలేజీ కి వెళ్లే సమయానికి తన బైక్ మీద మా ఇంటి ముందు నుండి మెల్లిగా వెళ్తూ మూడు సార్లు హార్న్ శబ్దం చేసేవాడు అతను... ఆలా మూడు సార్లు హార్న్ శబ్దం చెయ్యడం అతను నాకు ఇస్తున్న సిగ్నల్... ఆ శబ్దం విన్న ఒక అయిదు నిమిషాలకి నేను బయలుదేరేదాన్ని... మా వీధి చివర ఉన్న చాట్ బండి దగ్గర అతను బైక్ తో ఆగి నాకోసం ఎదురుచూస్తుండేవాడు... నేను అతని దగ్గరికి వెళ్ళగానే దగ్గేవాడు చిన్నగా... దానర్థం నేను అతనిని చూడాలని. నేను అతన్ని కాస్త దాటి ముందుకు వెళ్ళగానే బైక్ మీద నెమ్మదిగా నా వెనకాలే కాలేజీ వరకు వచ్చేవాడు... ఏమి మాట్లాడేవాడు కాదు, నన్ను…
Read More

అసహన జీవనం

అసహన జీవనం ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వేట ప్రారంభించి రెండేళ్లు గడిచిన తర్వాత ఒక MNC కంపెనీ లో ఉద్యోగం సంపాదించి బుద్దిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు శ్రీరామ్.   తాను రిటైర్డ్ అయ్యేలోపు తన కొడుకుని ఉద్యోగిగా చూడాలనుకున్నాడు శ్రీరామ్ తండ్రి గోపాల్ రావు. అనుకున్నట్టుగానే తన రిటైర్మెంట్ కి రెండేళ్ల ముందే శ్రీరామ్ కి ఉద్యోగం రావడం తో శ్రీరామ్ అడగకముందే తనకి బైక్ ని బహుమతిగా ఇచ్చాడు గోపాల్ రావు. తన తండ్రి కొనిచ్చిన బైక్ మీదే ఆఫీస్ కి బయల్దేరాడు మన కథానాయకుడు. అది చాలా పెద్ద కంపెనీ.. దక్షిణ భారతదేశం లోని వాళ్ళు, ఉత్త్తర భారతం వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాల యువతీ యువకులు పనిచేస్తారు ఆ కంపెనీ లో. ఇంజనీరింగ్ పూర్తి అవ్వగానే ఉద్యోగ వేటలో పడి అమ్మాయిల ఊసే మర్చిపోయిన శ్రీరామ్ ఉద్యోగం దొరికాక అమ్మాయిల గురించి ఆలోచించడం…
Read More

మా ఊరి సంక్రాంతి

మా ఊరి సంక్రాంతి మాది ఆంధ్ర ప్రతి సంవత్సరం మేము ఊరు వెళ్ళాతాము.. భోగి ముందు రోజు రాత్రి అందరూ మగవాళ్ళు భోగిమంటలు కోసం ఏర్పాట్లు చేశారు.. తెల్లవారుజామున భోగిమంటలు వేస్తారు. అందరూ కుటుంబంతో భోగిమంటలు దగ్గరకు వెళ్తాము. తర్వాత గుడికి వెళ్లి వస్తాను రేపటి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము. ఇంట్లో ఉన్న అందరికీ కొత్తబట్టలు  తీసుకుంటాము. తరువాత రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరం తెల్లవరుజామున లేచి సాన్నం చేయడానికి చెరువుకి వెళ్లి వస్తాము. దారిలో ఒక పక్కకి తులసి మొక్క ఉంటుంది. ఒక బిందేతో నీళ్లు తీసుకొని వచ్చి ఆ తులసి మొక్కకు పోస్తాము. ఇంటికి వచ్చి పూజకి అన్నీ ఏర్పాట్లు చేసి పూజ చేస్తాము. దేవుడు దగ్గర కింద మా పెద్ద వాళ్ళ ఫోటోలు (పెద్ద వాళ్ళు అంటే మా నాయనమ్మ, తాతయ్య వాళ్ళ ఫోటోలు) పెట్టి దీపం పెడతాము.  ముందు ఆకులు పెట్టి బెల్లం అన్నం,…
Read More

సంక్రాంతి కానుక

సంక్రాంతి కానుక అతగాడి నులివెచ్చని కౌగిలి లోంచి ఆ తలుపుల కమ్మని నిదురలోంచి గభాల్న మెలకువ వచ్చి చూద్దునా!!! "మన ఇనపకొట్టు రమేష్ కి సంక్రాంతి పండక్కి వాళ్ళ మామగారు  బైకు కొనిచ్చారట" అత్తగారి కంఠం వినబడుతోంది.. మామగారు కుర్చీలో కూర్చుని టీ తాగుతూ ఇంకో రెండు అలాంటి కుటుంబాల సంగతే మాట్లాడుకుంటున్నారు. అక్కడే కూర్చుని మొబైల్ చూస్తూ టీ తాగుతున్న తనకి వినబడేలా. గుండె గుభేలుమంది. నాన్నకి ఇంకా పెళ్ళికి చేసిన అప్పులే తీరి ఉండవు. తమ్ముడు కాలేజీ కి ఫీజు సమకూరిందో లేదో!!! మొన్న దసరాకి కూడా ఇలాగే ఆ పక్క వాళ్ళవి ఈ పక్క వాళ్ళవి చెబుతూ 40,000 ఇప్పించుకున్నారు అత్తగారు. ఏదోలా సర్ది నాన్నకు డబ్బులు చేరవేద్దాం అన్నా కూతురు సొమ్ము తినకూడదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తారు నాన్న మరి ఎలా? స్కూలు ముగించుకుని వడివడిగా అడుగులు వేస్తున్న నా మనసు నిండా ఒకటే ఆలోచనలు,…
Read More

పండగ సిత్రాలు

పండగ సిత్రాలు ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, అమ్మాయిలు పండగ బాగా జరుపుకున్నారు కదా, అంటూ సమూహం లో అడుగుపెట్టాను వారం తర్వాత, కానీ ఎవరి ఉలుకు పలుకు లేదు. దాంతో చిరాకు వచ్చి బాగా కక్క ముక్కలు తిని,  అరగకుండా హాయిగా పడుకున్నారా, అంటూ ఇంకో సందేశం పెట్టాను. దాంతో చిర్రెత్తిన ఒక తుంటరి అబ్బో మీ ఆడవాళ్లు అలంకరణకే సగం సమయం కేటాయిస్తారు. మీకే పండుగలన్నీ, మేమేం తినలేదు అంటూ వచ్చాడు. ఆడవాళ్ళు ,అలంకరణ అనగానే నాకు చిర్రెత్తు కొచ్చింది. ఎందుకంటే అసలు అలంకరణ ఎక్కడ చేసుకుంటాం,  పండగ అంటే పనులతో సరిపోతుంది. ఇంకా ఆ తుంటరి అలా అనగానే నాకు కోపం ముంచుకు వచ్చింది. దాంతో నాయనా అసలు నీకు మేము చేసే పనులు తెలుసునా అంటూ అడిగాను. దానికా అల్లరి వాడు ఏముంది కాస్త ఉడకేసి, అలంకరణ చేసుకుంటూ కూర్చుంటారు. అంతేగా అన్నాడు. దానితో నాకు అర్దం అయింది. వీడు…
Read More

సంక్రాంతి జ్ఞాపకాలు

సంక్రాంతి జ్ఞాపకాలు నాన్నగారు సెంట్రల్ గవర్నమెంటులో యువకులకు ప్రత్యేకంగా హ్యుమానిటీస్ విభాగంలో పని చెయ్యటం వల్ల జనవరి 12న స్వామి వివేకానంద వారి పుట్టినరోజు వేడుకలు జిల్లాలో కొన్నిప్రాంతాల్లో పాల్గొని భోగి రేపనగా సాయంత్రానికి అమ్మమ్మ ఇంటికి చేరేవాళ్ళం. కబుర్లతో అర్ధరాత్రి దాటి పోయేది. తెల్లారితే భోగి, తెల్లారుజాము నాలుగు అవుతుంటేనే, అందరినీ నిద్ర లేపేసేవారు. వేడినీళ్ళు, కుంకుడికాయలతో తలస్నానం. స్నానానలు అయ్యాక పొయ్యలో బూడిద, విభూదిలాగ బొట్టు పెట్టుకునే వాళ్ళం. అప్పటికే పెద్దమ్మవాళ్ళ అమ్మాయిలు (అక్కలు) మాకోసం భోగి పిడకలు చేసి వుంచేవారు. ఇంటికి, నాలుగిళ్ళలవతల వినాయకుడి గుడి ముందు భోగి మంట వేసేవారు. అక్కడికి వెళ్ళి వేసేవాళ్ళం. అమ్మమ్మ సున్నుండలు, పాకుండలు, అరిసెలు జాడిల్లో సర్ది వుంచేది. స్నానం, బొట్టు పెట్టుకున్నాక పిండివంటలు తినేవాళ్ళం. పెసరపప్పు వేసి పులగం చేసేవారు. బెల్లం, నెయ్యి, పచ్చి పులుసుతో తినేవాళ్ళం ముగ్గులు అక్కలు వేస్తే, చూసే వాళ్ళం. సంక్రాంతి రెండో రోజు పెద్ద పండగ. ఆరోజు…
Read More

జగమంత కుటుంబం

జగమంత కుటుంబం ఏం రా ఏడికి బోతున్నవ్ అంటూ అడిగాడు శీనయ్య రాజు ను, కాక బాయి కాడికి పోయేస్త అన్నాడు రాజు. గిప్పుడు బాయి కాడికి ఎందుకు రా అన్నాడు శీనయ్య. గాదె నే అడ్లు అడనే ఉన్నాయి మిల్లు కు తోల్క పోలే ఆయన్ని కల్లం కాడ నే ఉన్నాయి. ఈ దాపా దొంగలు మోపయ్యిర్రి అడ్లు ఎత్తుక పొనికి గందుకే అడ్నే కావలి ఉండని కి వోతున్న అన్నాడు రాజు. అరే అవును తమ్మి నా పొలం లో సూత అడ్లు పడి ఉన్నాయి. నువ్వు జర సస్కుంట ఉండు నేను బువ్వ తిని అస్త, అవు నువ్వు బువ్వ తిన్నావా లేవా అడిగాడు శీనయ్య. తినలేదు అన్నా, తినే అవసరం లేదు ఇగ అన్నాడు రాజు. అరే గట్ల అంటావ్ ఎంది అన్నాడు శీనయ్య. ఏంలేదన్న కడుపుల అంతా యెట్లనో ఉన్నదే అందుకే గట్ల అంటున్నా…
Read More

నేతన్న జీవితం

నేతన్న జీవితం పొద్దుగాళ్ల నుంచి పొరగాండ్లు బుక్కెడు బువ్వ తినలే, గీయన సందేవేళ పోయే మగ్గానికి, గా అయ్యా ఈ ఏలా పైసలు ఇత్తాడు లచ్చి గవి ఇయ్యగానే నూకలు పట్టుకొస్తా అని పాయే ఇంకా రాకాపాయే, నడి జాము ఆయే నేనేమి సేత్తురా దేవుడా అని చిరుగుల సీర గప్పుకొని ఏడుస్తుంది లచ్చవ్వ, జారిపోతున్న లాగు పైకి లాక్కుంటూ చీమిడిని భుజానికి రుద్దుకుంటూ అవ్వ నాకు దారేంట 10 రూపాయలు బిళ్ళ దొరికిందే ఇంకా 1రూపాయి బిళ్లలు దొరికినయె అవ్వ అని ఇగో అని గా పైసల్ లచ్చవ్వ చేతిలో పోసిండు 6 స. ల రవిగాడు, గాన్ని అందరు గట్లనే పిలుత్తరు మరి, వాడేమన్న బలిసినోని కొడుకు కాదు కదా! రవి అని పిలువడానికి, చేతిలో పడ్డ గా పైసలు సూడగానే దిగ్గున లేసి సావుకారి సావిట్లో నూకలు పట్టుకొచ్చి గంజి కాసి రవిగాని కి ఇంతపోసి, వాడు…
Read More

పెళ్ళవుతుందా

పెళ్ళవుతుందా కీర్తన ఒక మామూలు అమ్మాయి. తానేంటో తన పనే ఏంటో చేసుకుని వెళ్తుంది. ఎవరితో ఎక్కువ చనువుగా ఉండదు. తనలోని భావాలను అప్పుడప్పుడు పత్రికలకు పంపుతూ ఉండేది. అలాంటి సమయం లో మీ భావాలు చాలా బాగున్నాయి అంటూ ఒక అభిమాని తనకు ఉత్తరాలు రాసేవాడు. అవి చూసిన కీర్తన చాలా సంతోష పడేది. కాలం గడుస్తున్నది. అతను ఉత్తరాలు రాసేవాడు. తిరిగి కీర్తన కూడా జవాబులు రాస్తూ ఉండేది. అలా పరిచయం పెరుగుతూ వచ్చింది. మరో వైపు కీర్తన ఇంట్లో సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కానీ కాలం కలిసి రాక ఏ ఒక్క సంబంధం కుదరడం లేదు. సంబంధాలు కుదరక పోవడం వల్ల కీర్తన చాలా ఆత్మన్యూనతకు గురైంది. తనకు పెళ్లి కావడం లేదనే బెంగ పట్టుకుంది. ఎలాగైనా పెళ్లి కావాలనే తన ఆలోచన తనను నిలవనీయలేదు. నిజానికి కీర్తన నల్లగా ఉన్నా కళ గల మొహం,…
Read More

జయలలిత గారు దీపావళి పండగను ఎందుకు జరుపుకోలేదో మీకు తెలుసా

జయలలిత గారు దీపావళి పండగను ఎందుకు జరుపుకోలేదో మీకు తెలుసా టిప్పుసుల్తాన్ 1790 నరకచతుర్దశి రోజు రాత్రి మేల్‌కోటే ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా...?? 1790లో నరకచతుర్దశి రోజు అర్థరాత్రి సమయంలో టిప్పుసుల్తాన్, తనకు అత్యంత నమ్మకస్తులు, అత్యంత క్రూరులైన సహచరులు, సైన్యంతో కలిసి మెల్కోట్ ఆలయానికి చేరుకున్నాడు.. అప్పటికి ఆ ఆలయంలో సుమారు 1000 మంది భక్తులు నరక చతుర్దశి పండుగ ఊరేగింపును జరుపుకుని ఆనందంగా ప్రసాదాలు భుజించి విశ్రమించడానికి సిధ్దమౌతున్నారు.. టిప్పు ఆలయానికి చేరుకుని ఆలయ తలుపులు, ద్వారాలు మూసివేసి, 1000 లో 800 మందిని ఊచకోత కోశాడు, పసిపిల్లలు అనికూడా దయ లేదు.. 200 మంది సుందర స్త్రీలను బంధించాడు, మరుసటి రోజు ఉదయం అంటే, దీపావళి. అప్పుడు ఈ నర హంతకుడు, మెల్కోట్ ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180…
Read More