Gods and Devotion

దుష్కర్మఫలితం

దుష్కర్మఫలితం *మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!* *ఈరోజు చాలామందిమి, పూజలు చేస్తాము, వ్రతాలు నోస్తాము, దానాలు చేస్తాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?* *కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.* *కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.* *ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.* *”అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు…
Read More

తొందర పాటు

తొందర పాటు మనిషి తన దైనందిన కృత్యాల్లోను, వివిధ కార్యక్రమ ప్రణాళికా రచనలోను రెండు సూత్రాలను ప్రధానంగా గుర్తుకు తెచ్చుకుంటాడు. ‘ఆలస్యం అమృతం విషం’ అని, ‘నిదానమే ప్రధానం’ అని... నిజానికి ఈ రెండు సూత్రాలూ కార్యసాఫల్యానికి అవసరమైనవే. ఆయా సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులను బట్టి ఈ సూత్రాలను ఆచరణలోకి తేవాల్సి ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన బుద్ధితోనే గాక, తన హితం కోరేవారు, ఆత్మీయుల బుద్ధిని కూడా ఉపయోగించుకోవడం పురోగతి కోరుకునేవాడి లక్షణం. తనకు తోచిందే సరైనదని వెనకా ముందూ ఆలోచించకుండా అనుకున్న వెంటనే పని మొదలెట్టడం వైఫల్యానికి, అవమానానికి కారణభూతమవుతుంది. విపరీత ఫలితాలు ఎదుర్కొన్నాక పశ్చాత్తాపం చెందడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. ఈ తొందరపాటు ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది. అదే శోక కారణమవుతుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను విని విశ్లేషించుకుని అహంకరించక, వివేకంతో ముందడుగేసేవాడు కచ్చితంగా కార్యసాధకుడు కాగలడు. తొందరపాటు వల్ల జీవితంలో…
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు అక్షరలిపి  పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అక్షరలిపి యాజమాన్యం తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో విలసిల్లాలని మీ లక్ష్యాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది మీ అక్షరలిపి టీం...
Read More

గోత్రం అంటే ఏమిటి?

గోత్రం అంటే ఏమిటి? సైన్సు ప్రకారము మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?? గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- *జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే! గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ? మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు? వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? తర్కం ఏమిటి? ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! గోత్రమ్ అనే…
Read More

కలి దోషం పోవాలంటే ఒకసారి ఈ కథ చదవండి

కలి దోషం పోవాలంటే ఒకసారి ఈ కథ చదవండి 💐💐నలదమయంతుల కధ..మీ అందరికోసం..!!💐💐 ఓం శని ఈశ్వరాయనమః ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి "మహాత్మా! రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో కష్టాలుపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి" అని అడిగాడు. అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా, నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్యా, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి, పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు", అని చెప్పాడు. అది విని ధర్మరాజు "మహత్మా! నాకు నలుని కథ వివరించండి" అని అడిగాడు. బృహదశుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు. "నిషిధదేశాన్ని వీరసేనుడి…
Read More

ఈరోజు అంశం:- పొగడ్త

ఈరోజు అంశం:- పొగడ్త పొగడ్త ఈ పదం చాలా మంది ఇష్టపడతారు. పొగడటం అనేది ఒక కళ, దాన్ని వంట బట్టించుకున్న వాళ్ళు ఎదుటి వారిని పొగుడుతూ తమ పనులు చేయించుకుంటారు. పొగడ్త అనేది చిన్న పిల్లాడి నుండి మొదలు అవుతుంది. మా బంగారమే మా కన్నయ్యనే అనే తల్లి మాటల నుండి పిల్లాడి మనసు పొగడటం అనే ఒక ట్యూన్ కి మారిపోతుంది. తెల్లవారి తల్లి అలాంటి మాటలు మాట్లాడకుండా మామూలుగా అన్నం పెడితే తినకుండా మోరాయిస్తాడు పిల్లాడు. మళ్ళీ తల్లి మా మంచి కన్నయ్య కదు అంటూ పొగడటం స్టార్ట్ చేస్తుంది. ఇలా ప్రతి రోజూ పిల్లాడి మనసులో ఆ మాటలు అనేవి నాటుకుంటాయి. అలా వారి మనసు ట్యూన్ అవుతుంది. పాపం తల్లి పిల్లాడు తినాలని అలా అంటుంది కానీ భవిష్యత్తు గురించి ఆలోచించదు. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక పొగడటం అనే మత్తుకు బానిస లాగా…
Read More

అక్షరలిపి సంక్రాంత్రి కథల పోటి (గడువు పొడిగించడం జరిగింది)

అక్షరలిపి సంక్రాంత్రి కథల పోటి (గడువు పొడిగించడం జరిగింది)     ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందాలతో ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగ విశేషాలను, మీ ఊర్లోని వింతలను తెలియ చెప్తూ కవితలు, కథలు రాయండి. ప్రతి కవితకి, కథకు ప్రశంసాపత్రం ఇవ్వబడును. మీ కవితలు కథలు పంపవలసిన ఆఖరు తేది 13/ 12/2021 నుండి 13/1/2022 కి మార్చడం జరిగింది. కవిత కానీ, కథ కానీ ఆరువందల పదాలకు మించకుండా అక్షర దోషాలు లేకుండా, సరళ మైన బాషలో ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఒకరు ఎన్ని కథలు, కవితలు అయినా పంపవచ్చు. కవితలు కథలు తిరిగి పంపబడవు, వచ్చిన వాటిని అన్నిటినీ ప్రచురిస్తాం. తిరిగి కోరే వారు పంపవద్దని మనవి. ఇందులో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఎక్కడ ప్రచురించలేదు అని హామీ పత్రం తప్పని సరి. షరతులు వర్తిస్తాయి. దయచేసి కాపీ కంటెంట్ పంపకండి.…
Read More

దేవేంద్రుని అర్థ సింహాసనం గురించి ధర్మరాజు చెప్పిన కారణం

దేవేంద్రుని అర్థ సింహాసనం గురించి ధర్మరాజు చెప్పిన కారణం దేవేంద్రుని అర్థ సింహాసనం పంచుకున్న అర్జునుడికి స్వర్గారోహణ పర్వంలో సశరీరంగా స్వర్గానికి ప్రవేశం జరగకపోవడానికి ధర్మరాజు చెప్పిన కారణం ఎలా స్వీకరించాలి? ఇది చాలా గొప్ప ప్రశ్న. నేను కొంత ప్రయత్నిస్తా. అర్జునుడు అరణ్య వాసములో దేవేంద్రుని దగ్గరకు సశరీరంగా వెళ్ళాడు. అప్పుడే ఊర్వశి కోపానికి శాపానికి గురయ్యాడు. దేవేంద్రుడు కూడా దీన్ని గురించి ఏమీ అనలేదు. అయితే అర్జునుడు, శ్రీకృష్ణుని తో కలిసి స్వర్గం కంటే ఎంతో దుర్లభమైన వైకుంఠానికి సశరీరం గానే వెళ్లి శ్రీమన్నారాయణ మూర్తిని దర్శనం చేసుకుని వచ్చాడు.అంతకు ముందొక సారి అభిమన్యుని మరణించిన రోజు శ్రీకృష్ణుడు, అర్జునుని స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు.   అయితే ఇవన్నీ తాత్కాలికముగా వెళ్లి, మళ్ళీ వెనుకకు వచ్చి తిరిగి మానవ శరీరంతో భూలోకంలో జీవించిన చిన్న ప్రయాణాలు. దివ్య లోకాలకు వెళ్లి అక్కడ శాశ్వత నివాసానికి ఉద్దేశించినది కాదు. ఇక…
Read More

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?   సోషల్ మీడియాలో లేకపోతే జనావాసాలకు దూరంగా ఉన్నట్టా లేనట్టా? నా అభిప్రాయం. అవును చాలా మంది సోషల్ మీడియానే తమ లోకంగా బతుకుతూ లైక్ ల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వాటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు అలాంటి వారిని చూస్తూ మిగిలిన వాళ్ళు మీరు లోకానికి దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేయడం ఎంత వరకు సమంజసం చెప్పండి? లోకం లో సోషల్ మీడియా కన్న చాలా విషయాలు తెలుసుకో దగినవి చాలా ఉన్నాయి అని మిగిలిన వారు తెలుసుకోలేకపోతున్నారు. లైక్ షేర్ ల కోసం కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే ఇవ్వన్నీ వాడకుండా ఉండటమే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.     
Read More

*భగవద్గీత అంటే ఏమిటి?

*భగవద్గీత అంటే ఏమిటి? *అసలు భగవద్గీత ఏం చెబుతుంది?* 👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది. 👉-కర్తవ్యం గురించి చెబుతుంది. 👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. 👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. 👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. 👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. 👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. 👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. 👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. 👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. 👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. 👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. 👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని…
Read More