Thriller Storys

యోధ ఎపిసోడ్ 15

యోధ ఎపిసోడ్ 15 అలా తనలో తానే అనేక ప్రశ్నలు సంధించుకుంటున్న పార్ధు, తేరుకుని "ఛీ.. ఛీ... అయినా నేనిలా ఆలోచిస్తున్నాను ఏంటి..!" అని అనుకుంటూ తన ఫ్రెండ్స్ లో ఒకరైనా అవేశ్ కి కాల్ చేసి "తను ఒకప్పుడు ప్రేమించిన ఆ అమ్మాయి గురించి, వారి లవ్ బ్రేకప్ టాపిక్ తీస్తూ... కాస్త జాగ్రత్తగా ఉండరా? " అంటూ హెచ్చరిస్తాడు పార్ధు... "అసలేమైంది రా నీకు ..? ఎందుకిలా మాట్లాడుతున్నావ్..?" అంటూ అవేష్ అడగగా. రాత్రి తనకొచ్చిన ఆ కల గురించి వివరించి చెప్తాడు పార్ధు..! పార్ధు చెప్పినదానికి పగల బడి నవ్వుతాడు అవేశ్... "నేనింత సీరియస్ గా చెప్తుంటే, నీకు జోక్ గా ఉందా..?" అంటూ కోపంగా కసురుకుంటాడు పార్ధు. "జోక్ కాకపోతే ఏంటి మరి! పద్మను నేను మోసం చేయడం ఏంటి? తను చనిపోవడం ఏంటి? ఆత్మగా మారి నన్ను చంపడమేంటి..? అసలు పద్మతో లవ్ ట్రాక్ గురించి నేను చెప్తేనే కదా! నీకు మా గురించి తెలిసింది.…
Read More

యోధ ఎపిసోడ్ 14

యోధ ఎపిసోడ్ 14 రూం బయట నుండి "పార్ధు... పార్ధు..." అంటూ ఎవరో పిలుస్తున్నట్టు పార్ధుకి వినిపిస్తున్నా, అతనిలో మాత్రం చలనం లేదు. జారుగా గడియ పెట్టి ఉన్న, ఆ రూం డోర్ ని కాస్తా... కొంచెం గట్టిగా తోయడంతో చివరికి అది తెరుచుకుంది. అలా ఆ వ్యక్తి పార్ధు దగ్గరికి వచ్చి, తనని తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. "హెల్ప్... హెల్ప్ ...! ప్లీజ్ కాపాడండి.. ప్లీజ్ నన్ను కాపాడండి..! " అంటూ పార్ధు ఒకటే మూలుగుతున్నాడు. చిర్రేత్తిన ఆ వ్యక్తి, ముసుగులో ఉన్న పార్ధుని ఒక్క తన్ను తన్నడంతో బొక్క బోర్లా కిందపడ్డాడు. "అమ్మా..!" అంటూ గట్టిగా అరుస్తూ ఆ మంచం మీద నుండి కిందపడ్డ పార్ధు, చుట్టూ చూస్తున్నాడు... పక్కనే వాళ్ల నాన్న, పార్ధుని అలా తన్నింది కూడా ఆయనే! "గాడిద... సన్నాసి... పనికిమాలిన వెధవ ... నీకెన్ని సార్లు చెప్పాలి రా..! పడుకునే ముందు ఆ దెయ్యం కథలు, క్రైమ్ వార్తలు చదవొధ్దని..!, నైట్ అంతా అవి చదవడం, నిద్రలో కలలు…
Read More

యోధ ఎపిసోడ్ 13

యోధ ఎపిసోడ్ 13 రాత్రైంది .. ఉరుములు, మెరుపుల శబ్దాల దాటికి ఒకసారిగా ఉలిక్కిపడుతూ స్పృహలోకి వచ్చాడు పార్ధు. చుట్టూ ఎటు చూసిన చీకటే! దానికి తోడు బయట నుండి పెళ్ పెళ్ మంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్న భయంకరమైన పిడుగులు, ఉరుముల కాంతి ఆ గెస్ట్ హౌస్ లోకి చొచ్చుకుని వస్తుంది. కింద తడుముతుంటే, తనకి మెత్తగా ఒక పరుపులాంటిది తగలడంతో, తను మంచం మీద ఉన్నట్టు గ్రహించాడు. "అదేంటి..! కొద్ది సేపటి క్రితం నేను స్పృహ కోల్పోయి పడిపోయింది రూం బయట కదా! ఇక్కడికెలా వచ్చాను?, నన్నసలు ఈ బెడ్ మీదకెవరు తీసుకొచ్చారు? " అంటూ తనలో తానే ప్రశ్నలు సంధించుకుంటున్నాడు. అలా తను అనుకుంటున్నాడో..? లేదో..? అదంతా విని ఎగతాళి చేసినట్టుగా "హా..హాహాహ్హ... హాహ్హహ్హ..." అంటూ ఆడ, మగ కలగలిపిన స్వరంతో కూడిన నవ్వులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, ఆ రూం గోడలకి ప్రతిధ్వనిస్తూ మరింత భయకరంగా పార్ధుకి వినిపిస్తున్నాయి. భయంతో పార్ధుకు మింగుడు పడడం…
Read More

యోధ ఎపిసోడ్ 12

యోధ ఎపిసోడ్ 12 ఆ రోజు ఆదివారం. అప్పటికే తెల్లారడంతో, కిందపడి ఉన్న పార్దుకి మెలుకువ వచ్చింది. తన తల మీద ఎవరో కొట్టినట్లు, అంతా పట్టేసినట్లు దిమ్ముగా ఉంది. తనకి తానుగా అక్కడి నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఎవరి సహయాన్ని ఐనా కోరదాం అంటే, తన నోట్లో నుండి సరిగా మాటలు కూడా రావడం లేదు. చుట్టూ చూస్తున్నాడు, ఎవరూ కనిపించడం లేదు. తనలో తానే శక్తిని కూడగట్టుకుని మెల్లగా బెడ్ మీదకి చేరుకున్నాడు. అక్కడే పక్కనున్న వాటర్ త్రాగి, అసలు ఓపిక లేని పార్ధు, మంచం మీద పడుకుని, అంతకుముందు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ, పదే పదే తన స్నేహితులను తలుచుకుంటూ బిగ్గరగా అరుస్తూ ఏడుస్తున్నాడు. తన స్నేహితులను కోల్పోవడానికి, చివరికి తను అలా అక్కడ అనాధగా మిగిలిపోవడానికి కూడా కారణం తనేనన్న ఆలోచన తనని వేధిస్తుంది, మరింత బాధిస్తుంది. "అవేశ్... ప్రియా... గోపాల్... గౌతమి... విశాల్...…
Read More

యోధ ఎపిసోడ్ 11

యోధ ఎపిసోడ్ 11 శనివారం... అప్పటికే వాళ్ళు ఆ గెస్ట్ హౌజ్ కి వచ్చి అయిదు రోజులు గడిచాయి. యధావిధిగానే ఆ రోజు కూడా తెల్లారింది. సరిగ్గా అప్పుడే కృతికి మెళుకువ వచ్చింది. తన తలంతా కొంచెం బరువుగా, ఏదో పట్టేసినట్లుగా ఉంది. అసలు తను ఎక్కడుందో, ఎలా ఉందో కూడా తనకి తెలియడానికి చాలా సమయమే పట్టింది. అలా కాసేపటికి తేరుకున్న తను, ఆ రూం మెయిన్ డోర్ దగ్గర పార్ధు పడి ఉండడం గమనించింది. తన (పార్ధు) దగ్గరికి వెళ్ళి, పార్ధుని లేపే ప్రయత్నం చేస్తుంది కృతి.. "పార్ధు... పార్ధు... లే పార్ధు... నీకేమైంది పార్ధు!" అంటూ తనని తట్టి లేపుతుంది. అలా కాసేపటికి, కృతి పిలుపుకి మెలుకువ తెచ్చుకున్న పార్ధుకి కూడా స్పృహలోకి రావడానికి టైం పట్టింది. స్పృహలోకి వచ్చినా తన కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. (బహుశా రాత్రి కమ్మిన పొగ వల్ల అనుకుంటా) ఆ మసక కళ్లతోనే పక్కనే…
Read More

యోధ ఎపిసోడ్ 9

యోధ ఎపిసోడ్ 9 ఆ రోజు గురువారం. ఎప్పటిలానే తెల్లారింది. పార్ధుకి మెలుకవ వచ్చింది. చుట్టూ చూసాడు. తను తన రూంలోనే ఉన్నాడు. బయట నుండి గంట శబ్ధం. అంతకుముందు రోజు జరిగిందంతా ఎప్పటిలానే తనకి గుర్తుకు వస్తుంది. అక్కడి నుండి వేగంగా గౌతమి రూం వైపు పరుగు తీశాడు. అందులో గౌతమి లేదు. అంతా చూసాడు కానీ, లాభం లేదు. బయటకు అంతే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ సారి.. ప్రియ, అవేశ్ రూమ్స్ రెండూ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. కృతి, గోపాల్, విశాల్ ల రూం డోర్స్ తడుతూ వాళ్ళని నిద్ర నుండి లేపుతూ బాల్కనీ లోకి పరుగుతీసాడు. ఎప్పటిలానే అక్కడ కూడా కాలుతున్న చితి. అంటే గౌతమి కూడా... అప్పటికే అక్కడికి చేరుకున్న వాళ్ల స్నేహితులతో పాటు పార్ధు దుఃఖానికి కూడా అవధుల్లేవ్... గౌతమి లేదన్న విషయం తెలిసి, గోపాల్ కి అయితే కోపం నాషాలాన్నింటింది. వాళ్ల…
Read More

యోధ ఎపిసోడ్ 8

యోధ ఎపిసోడ్ 8 వాష్ రూమ్లో వాటర్ కారుతున్న శబ్దంతో లేచింది గౌతమి. (అంటే స్పృహ కోల్పోయిన తర్వాత ఇప్పుడే తను స్పృహ లోకి వచ్చిందన్న మాట! ఈ మధ్యలో జరిగిందేది తనకి తెలీదు) అలా లేచిన గౌతమి చుట్టూ చూసింది. అంతా చీకటి వాతావరణం. ఉన్నట్టుండి ఆ వాటర్ కారుతున్న శబ్ధం కూడా ఆగిపోయింది. దీంతో భీతిల్లిన గౌతమి మొహం నిండా చెమటలు పడుతున్నాయి. "పార్ధు... గోపాల్... కృతి..." అంటూ గట్టిగా అరుస్తుంది గౌతమి.కానీ, ఎవరి దగ్గర నుండి రెస్పాన్స్ లేదు. మరింత గట్టిగా అరుస్తూ వాళ్ళని పిలుస్తుంది గౌతమి. అలా అరిచి అరిచి తన నోరు నొప్పెడితుంది తప్ప, ఎవరి దగ్గర నుండి ఉలుకూ పలుకూ లేదు. ఇంతలో ... "నువ్వెంత అరిచి ఘీ పెట్టుకున్నా నీ అరుపులు ఎవరికి వినపడవు. నిన్ను నా నుండి రక్షించడానికి రారు హా.. హాహ్హ... హాహ్హహ్హ..." అంటూ ఒక భయకరమైన పెద్ద శబ్ధం మగ వాయిస్ తో కూడి సరిగా…
Read More

యోధ ఎపిసోడ్ 7

యోధ ఎపిసోడ్ 7 ఆ రోజు బుధవారం. చడీ చప్పుడు లేకుండానే పార్ధుకి మెళుకువ వచ్చింది. అలా మెలుకువ వచ్చిన కాసేపటికే, గడియారం గంట తొమ్మిది గంటలు కొట్టింది. అంటే అప్పటికే తెల్లారి దాదాపు ఉదయం తొమ్మిది గంటలవుతుందన్న మాట! ‌పార్ధుకి అంతకుముందు రోజు జరిగిందంతా ఒక్కొక్కటిగా గుర్తుకువస్తున్నాయి. ‌ ‌"నైట్ స్పృహ కోల్పోయి పడిపోయింది కారిడార్ లో కదా, మరి బెడ్ మీదకి ఎలా వచ్చాను..?" అంటూ తనలో తాను అనుకుంటూ... ‌వెంటనే తన బెడ్ పై నుండి లేచి, రూం డోర్ తీసుకుంటూ పరుగు పరుగున ప్రియ రూం కి వెళ్ళాడు. అప్పటికే ప్రియ రూం డోర్ కూడా తెరిచే ఉంది. దాన్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళిన పార్ధు కి ప్రియ బెడ్ కాళిగా కనిపిస్తుంది. దాంతో ‌ ‌"ప్రియ... ‌‌ప్రియ..." ‌అంటూ ఆ రూం అంతా వెతుకుతాడు పార్ధు. కానీ, ఉపయోగం ఉండదు. ‌ ‌"అదేంటి..! ‌నిన్న…
Read More

యోధ ఎపిసోడ్ 6

యోధ ఎపిసోడ్ 6 రాత్రి ఏడు గంటలవుతున్నా... ప్రియను తన గదికి తీసుకెళ్లిన గౌతమి, కృతి ఇద్దరూ ప్రియ కోలుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బలమైన షాక్ తిన్న ప్రియ మాత్రం దాని నుండి కోలుకోలేకపోయింది. అప్పటికే ఆ ముఖ ద్వారం తెరవడానికి, మరియు ఆ అజ్ఞాత స్వరం కలిగిన వ్యక్తిని పట్టుకోవడంలో విఫలయత్నం చెంది విసిగిపోయిన పార్ధు, గోపాల్, విశాల్ ఓపిక నశించి... వాళ్లు కూడా చేసేదేమీ లేక ప్రియ గదికి వచ్చారు. ఒక పక్క ప్రియ స్పృహలో లేకపోవడం... మరొక పక్క అవేశ్ ఆచూకీ లభించకపోవడం (దాదాపు తను చనిపోయినట్టు భావిస్తున్నారు అంతా), దానికి తోడు అక్కడ జరుగుతున్న అనూహ్య పరిణామాలు... వాళ్ళందరి మొహాల్లో విచారాన్ని తెలుపకనే తెలుపుతున్నాయి. గౌతమికి దుఃఖం పొంగుకొస్తుంది. తన దుఖం ఆపుకోలేక ఏడుస్తుంది. తనతో పాటు అప్పటివరకూ ఎంతో కొంత దైర్యంగానున్న కృతి కూడా గౌతమికి జతవుతుంది. వాళ్ళని ఓదార్చే పనిలో ఉంటారు గోపాల్ మరియు…
Read More

యోధ ఎపిసోడ్ 5

యోధ ఎపిసోడ్ 5 తెల్లారి మంగళవారం. పొద్దుకూగింది, అప్పటికే దాదాపు ఎనిమిది గంటలు అవుతుంది. అప్పుడే నిద్ర లేచిన ప్రియ... మూసిన కళ్ళు తెరవకుండానే, అదే బెడ్ పై నుండి "లక్ష్మి కాఫీ... లక్ష్మి కాఫీ..." అంటూ పెద్దగా అరుస్తుంది. ఆ అరుపులకి లక్ష్మి నుంచి ఏ స్పందనా రాలేదు. కానీ, ఆ అరుపులకి ఉలిక్కి పడి లేచిన పార్ధు, విశాల్ వాళ్ల వాళ్ళ గదుల నుండి తలుపులు తీసుకుంటూ బయటకి వచ్చి చూసారు. ఇంకా ప్రియ "లక్ష్మి కాఫీ... లక్ష్మి కాఫీ..." అంటూ అలా అరుస్తూనే ఉంది. ఆ శబ్ధం వస్తున్న గది వైపు చూసిన వాళ్ళిద్దరూ (పార్ధు, విశాల్) ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆ శబ్ధం వస్తుంది అవేశ్ కి కేటాయించిన గది నుండి.. వాయిస్ మాత్రం ప్రియ ది. తను అంతగా అరుస్తున్నా, లక్ష్మి నుండి అసలు ఉలుకు పలుకు లేదు. పైన ఆ కారిడార్ నుండి కిందనున్న వీరయ్య- లక్ష్మి ల గది…
Read More