aasha

ఆశ

ఆశ నిశీధిని చీల్చుకొంటూ ఆటంకాలను ఎదుర్కొంటూ జనం కోరిన వెలుగవ్వర ఎరుపెక్కిన ఉదయమల్లే నీ రాక కొరకు ఎదురుచూసే పూలల్లే ఈ జగమంతా కిరణాలను ప్రసరించర ఎరుపెక్కిన ఉదయమల్లే ముందే పసిగట్టేనుగా గువ్వలు, కాకులు ఎరుపెక్కిన ఉదయం కోసమే తమ తపనంతా అని నిద్దురపోయిన జీవితాలకు మరో వెలుగవ్వాలి నీ గమ్యం ఇంకొంత భలం కూర్చర ఎరుపెక్కిన ఉధయమల్లే ఓడిపోయిన బతుకులకు మరొక్క అవకాశం అంటూ గెలిచే దారి చూపరా ఎరుపెక్కిన ఉధయమల్లె విప్లవ జ్యోతిలా క్రీడా కాగడలా దేవుని దీపంలా ఎరుపెక్కే ఉదయం - హనుమంత
Read More

ఆశ

ఆశ ఆశ కు అంతులేదు అగాధానికి లోతు తెలియదు అంటారు ఆశ నిరాశల సయ్యాట జీవిత పయనం ఆశే ప్రాణం ఆశే నిజం ఆశే వెలుగు ఆశే చీకటి ఆశే మిత్రుడు ఆశే శత్రువు ఆశే ఆవేదన ఆశే సంతోషం ఆశే అడుగు ఆశే పిడుగు ఆశే గమ్యం ఆశే విజయం ఆశే ఆలోచన ఆశే శ్రమ ఆశే అవసరం ఆశే నమ్మకం ఆశే పొదుపు ఆశే మదుపు ఆశే అదృష్టం ఆశే దూరం ఆశే ఆశయం ఆశే ఇష్టం ఆశే అజ్ఞానం ఆశే విజ్ఞానం ఆశే విలువ ఆశే శిలువ ఆశే కల ఆశే తోడు ఆశే అపూర్వం ఆశే జీవిత పోరాటం ఆశే ఆ జన్మాంతం వెంటాడే వేటగాడు . అది అదుపులో వుంటే అంతకన్నా గొప్ప ఇంకేముంది. - జి జయ
Read More

ఆశ

ఆశ ఈ రెండు అక్షరాల వరమే దేవుడిచ్చిన బలం ఆశే జీవన రాగం శ్వాస నే బ్రతుకు ఆశ ఆశను ఆశ్రయిస్తే అంతులేని ఆనందం ఆశే మిత్రుడు ఆశే వెంటాడే శత్రువు ప్రతిరోజూ ఆశే బ్రతకడానికి చిగురాశ కోరుకున్నది జరగాలని ఆశ ఆలోచనల మీమాంస ఆశకు అదుపు వుంటే గతి తప్పని గమ్యం అది ఆశయాల ఒడ్డుకు ఆశతో దాటాలి తీరని ఆశ కాకుండా తీరాల వరకు పరుగెత్తా లి కనిపించని దూరాన్ని నడిపించే నీ దారే ఆశ మితిమీరిన ఆశే అన్నీ దూరం చేస్తుంది సుమా తస్మాత్ జాగ్రత్త ...... - జి జయ
Read More

ఆశ

ఆశ మధ్యతరగతి వారి జీవితమే ఓ ఆశ... జీవన పోరాటాల మధ్య ఎడతెగని మెలిమి ఓ ఆశ... నిన్నటిని వదిలి రేపటికై ప్రయాణంలో నేటి భౌతికస్థితియే ఓ ఆశ... ఆలోచనల సంగమాల యుద్ధంలో తనే గెలుస్తూ నిరాశల ఉత్సాహాన్ని మరిపిస్తు ముందుకు నడిపించేది ఓ ఆశ... జీవితాన్ని నిలబెట్టేది ఆశే జీవితాన్ని కడవరకు కొనసాగించేది ఆశే నిన్నటిని గెలిచేది కూడాను ఆశ - గోగుల నారాయణ
Read More

ఆశ

ఆశ రేపటి స్వప్నం... నిన్నటి గతం... గతించిన కాలానికి ఆయువు... రాబోవు కాలానికి ఆయుధం... నిరాశ నిస్పృహలకు చెరమగీతం పాడేది... ధైర్యానికి పట్టుకొమ్మ... ఎన్నాళ్ళో వేచిన సమయానికి ముగింపు... జీవుని జీవాన్ని నిలబెట్టేది... మానసిక సంఘర్షణలకు నెలవు... మనిషికీ ఊతం... నిరాశలను తరిమికొడుతుంది... జీవితాన్ని నిలబెడుతుంది... - గోగుల నారాయణ
Read More