ఆత్మ
ఆత్మ అమ్మా రెడీ నా అంటూ వచ్చాడు ప్రణవ్. హా రెఢీ రా అన్నాను, సరే పద పద అసలే నువ్వు మొదటి నుండి సినిమా చూడాలి అంటావు, ఆలస్యం అయితే మళ్లీ నన్నే తిడతావు అన్నాడు. అబ్బో సర్లేరా ఆటో వచ్చిందా అన్నాను. అంత లేదు. బైక్ ఉండగా ఆటో ఎందుకే, అంటూ ముందుకు కదిలాడు. ఇద్దరం కలిసి బైక్ పైన సినిమా హల్ కు వెళ్ళాము. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాం. కాబట్టి అవి ఫోన్ లో చూపించి లోపలికి వెళ్ళాము. సీట్లలో కూర్చున్న తర్వాత నాకు అందులో ఎవరో ఉన్నట్టు అనిపించింది. లేచి చూసాను, కానీ ఎవరు లేరు. మళ్ళీ కూర్చున్నా... ఒకరి పై మనం కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు, మళ్లీ లేచి చూసాను. ఎవరు కనిపించలేదు. నేను అలా రెండు సార్లు లేవడం చూస్తున్న ప్రణవ్, ఏంటమ్మా, ఏమైంది నల్లులా అన్నాడు.…