aksharaipi

ఈరోజు అంశం:- పొగడ్త

ఈరోజు అంశం:- పొగడ్త పొగడ్త ఈ పదం చాలా మంది ఇష్టపడతారు. పొగడటం అనేది ఒక కళ, దాన్ని వంట బట్టించుకున్న వాళ్ళు ఎదుటి వారిని పొగుడుతూ తమ పనులు చేయించుకుంటారు. పొగడ్త అనేది చిన్న పిల్లాడి నుండి మొదలు అవుతుంది. మా బంగారమే మా కన్నయ్యనే అనే తల్లి మాటల నుండి పిల్లాడి మనసు పొగడటం అనే ఒక ట్యూన్ కి మారిపోతుంది. తెల్లవారి తల్లి అలాంటి మాటలు మాట్లాడకుండా మామూలుగా అన్నం పెడితే తినకుండా మోరాయిస్తాడు పిల్లాడు. మళ్ళీ తల్లి మా మంచి కన్నయ్య కదు అంటూ పొగడటం స్టార్ట్ చేస్తుంది. ఇలా ప్రతి రోజూ పిల్లాడి మనసులో ఆ మాటలు అనేవి నాటుకుంటాయి. అలా వారి మనసు ట్యూన్ అవుతుంది. పాపం తల్లి పిల్లాడు తినాలని అలా అంటుంది కానీ భవిష్యత్తు గురించి ఆలోచించదు. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక పొగడటం అనే మత్తుకు బానిస లాగా…
Read More

ఈరోజు అంశం:- ఒంటరి బతుకు

ఈరోజు అంశం:- ఒంటరి బతుకు పది మందిలో బతికినా కూడా చాలా మంది ఒంటరి తనంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవడం లో వాళ్ళు కోల్పోతున్న దాన్ని గుర్తించలేరు. అలాగే వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారో కూడా వాళ్లకు ఒక స్పష్టత ఉండదు. అలా పది మందిలో ఉన్నా ఒంటరి జీవితాన్ని ఆస్వాదించ లేని అశక్తులు వాళ్ళు , వారికి ఒక లక్ష్యం , ఆశయం లాంటివి ఉండవు. యెప్పుడూ నిర్లిప్తత గా ఉంటూ ఉంటారు. ఎవరితో కలవకుండా మాట్లాడకుండా మనసు విప్పకుండా ఉంటారు. వారిని చూస్తున్న ఎదుటి వారికి కూడా విరక్తి భావం వస్తుంటుంది.. కానీ అంత మంది లో ఉండి కూడా ఒంటరి జీవితాన్ని అనుభవించకుండా ఉన్న వారికంటే, ఎవరూ లేని వారి జీవితం. ఏలా ఉంటుందో అని గమనించాలి. ఒంటరి జీవితం అంటే ఎవరూ లేని వాళ్ళు కాదు. అందరిలో ఉన్నా కూడా ఒంటరిగా…
Read More

ఈరోజు అంశం:- పేద కుటుంబం

ఈరోజు అంశం:- పేద కుటుంబం పేద కుటుంబం అనగానే కటిక దరిద్రంతో ఉన్న వాళ్ళు గుర్తుకు వస్తారు చాలా మందికి. కానీ కటిక దరిద్రంతో ఉన్నా కలిసి మెలిసి ఉంటూ, కలతలు లేకుండా, ఉన్న రోజు తింటూ, లేని రోజు పస్తులు ఉంటూ అందులోనే ఆనందం వెతుకుతూ, ఉన్నన్ని రోజులూ నవ్వుతూ బతుకుతూ కష్టపడి పని చేసుకుంటూ, ఎలాంటి స్వార్థం లేకుండా, ఒకరి కోసం ఒకరు బతుకుతూ, డబ్బంటే వ్యామోహం లేకుండా, పొద్దంతా కష్టం చేసి, రాత్రి కాగానే నాలుగు మెతుకులు తిని, ఆద మరచి, ఎలాంటి చికూ చింత లేకుండా కంటి నిండా నిదుర పోయే వాళ్ళు ఎంతో ధనవంతులు... ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఇంకా కావాలని ఆత్ర పడుతూ, స్వార్ధ చింతనతో, ఒకే ఇంట్లో ఉన్నా ఒకరి పై ఒకరు కుట్రలు చేస్తూ, ఒకరిని మోసం చేస్తూ, పది మందిలో గొప్ప అనిపించుకోవాలి అని డబ్బులు ఖర్చు…
Read More

ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద

ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద చిన్నప్పుడు అమ్మ చేతి ముద్దను తినేవాళ్ళం. ఆ తర్వాత కూడా బడికో కాలేజీకి ఆలస్యంగా వెళ్తున్నప్పుడు అమ్మ మన హడావుడి చూసి అన్నం కలిపి ముద్దలుగా తినిపించేది. అమ్మ ఏం చేసినా ఎంతో బాగుండేది. అమ్మ చేతిలో ఏదో మాయ ఉండేది. అమ్మ అలా ఎంత పెట్టినా కూడా తింటూనే ఉండేవాళ్ళం. అది అమ్మ చేతి ముద్ద గొప్పతనం. అమ్మ అన్నం పెడుతూ ఎన్నెన్నో కథలు, కబుర్లు చెప్పేది. బూచాడు వస్తాడని భయపెట్టినా, ఇంకెన్ని కథలు చెప్పినా అదంతా కేవలం బిడ్డ కడుపు నింపడం కోసమే చేసేది. బొజ్జ నిండిన తర్వాత చివరి ముద్దను మన చుట్టూ తిప్పి బయట పారేసేది. దిష్టి కొట్టకుండా.. ఎవరన్నా మీ బాబు, పాప ముద్దుగా ఉన్నారని అంటే వాళ్ళు వెళ్ళాక బాగా తిట్టుకునేది.. అమ్మ చేతి ముద్ద అమృతం. అమ్మ చిరునవ్వు ఒక శక్తిని ఇస్తుంది. ఎంతో…
Read More

సంఘర్షణ పార్ట్ 1

సంఘర్షణ పార్ట్ 1 మనసుకు నచ్చిన పని చేయడం వల్ల మనం చాలా సంతోషంగా ఉండొచ్చు, అయితే కొన్ని కారణాల వలన మనం మన మనసుకు నచ్చిన పనులు కాకుండా, నచ్చని పనులు ఎన్నో చేస్తుంటాం, అలాంటి ఒక పని వల్ల రెండు జీవితాలు ఎంత మానసిక సంఘర్షణలో కొట్టుకుపోయాయి. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ******** అమ్మ నాకు ఈ పెళ్లి వద్దమ్మ అన్నాడు అరుణ్. తల్లి దగ్గరికి వెళ్లి బతిమాలుతూ , ఏంట్రా ఇది అన్ని రెడి అయ్యాక ఆ మాటలేంటి ? నాన్నగారు విన్నారంటే చంపేస్తారు . నోరు మూసుకుని చేసుకో, ఇన్ని రోజులు మౌనంగా ఉండి , ఇప్పుడు వద్దు అని అంటే ఎలా ? అయినా నాన్నగారు మూర్తి అంకుల్ కు మాట ఇచ్చారు అంట . నువ్వు కాదంటే బాగుండదు . వారం రోజుల లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇలా అంటే…
Read More