కాలం నేర్పిన పాఠం
కాలం నేర్పిన పాఠం పిల్లాడు బాగున్నాడు ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఎనిమిదో తరగతిలోనే పెళ్లి చేశారు. అప్పుడు నా వయసు ఎంతో కూడా నాకు గుర్తులేదు. పెళ్లయ్యాక మామూలే అత్తారింట్లో అత్త, నలుగురు ఆడపడుచులు, నలుగురు మరుదులు ఇదే మామూలే. వండడం, వార్చడం, పెట్టడం, మళ్ళీ కడగడం, వండడం, వార్చడం, ఇదే జరిగింది. దాంతో పాటు ముగ్గురు పిల్లలు కూడా పుట్టుకొచ్చారు. ఉద్యోగరీత్యాచాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. మా అత్తగారు మిగిలిన వారు ఎవరు ఒప్పుకోలేదు ఎందుకంటే ఉన్న పనిమనిషి పోతుంది అనే బాధ తప్ప వాళ్ళకి నా మీద ప్రేమ, అభిమానాలు ఏమీ లేవు కాబట్టి.. అయినా పిల్లల చదువులు కాబట్టి 20 ఏళ్ల తర్వాత ఆ ఇంటి బయట అడుగుపెట్టాను. పెట్టింది మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. ప్రతి పండక్కి వచ్చిన ఆ పండగ అయిపోయేంతవరకు ఉండడం ఆ తర్వాత వెళ్లిపోవడం జరిగేది పండగ ముందు పది రోజులు వచ్చి…