bhavya

బహుమతి

బహుమతి అమ్మా నీ ఋణాన్ని తీర్చకపోతే ఈ జన్మకు సార్థకత లేదు. నీ ఆశయం నీ కోరిక తప్పక నెరవేరుస్తామని నీ కల మా కలగా నీ కళ్ళు మా కళ్లుగా చేసుకుని ఈ లోకానికి మెమెంటో చూపించి తీరుతాం దాని కోసం మా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధ పడతాం. అమ్మ తొందర్లోనే నీ కలను నీకు బహుమతిగా ఇస్తానని హామీ ఇస్తూ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు... - భవ్య
Read More

మనుషులమేనా

మనుషులమేనా ఆమె నడుస్తోంది పైన ఎర్రగా మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా పిల్లాడితో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఎటు వెళ్తున్నాను తెలియని స్థితిలో నడుస్తూ ఉంది రోడ్డుమీద. ఆమె భర్త మొన్ననే చనిపోయాడు ఉన్న అత్తగారు మాత్రం మా కొడుకే చనిపోయిన తర్వాత ఇక నీతో మాకు అవసరం లేదు అంటూ ఇంటి నుంచి గెంటి వేశారు. ఇప్పుడు ఆమెకు నిలువ నీడ లేకుండా పోయింది తను ఎక్కడికి వెళుతున్నాను తెలియని స్థితిలో పిల్లాడితో పాటు ముందుకు కదులుతోంది. మొన్నటి వరకు భర్త కొడుకుతో సంతోషంగా గడిపిన జీవితం కాకపోతే మొగుడు మందుకు బానిస అనుకోకుండా చనిపోయాడు అంతటితో ఆమె జీవితం అగాధంలోకి జారిపోయింది. తాగి చనిపోయిన వాడి భార్య అంటూ చుట్టుపక్కల వాళ్ళు భరించలేక అత్తగారి ఆశ్రయం కోరింది అయినా అత్తగారు మామగారు ఆమెను పట్టించుకోకుండా నా కొడుకును నువ్వే చంపేసావు అంటూ నింద వేసి మరీ వెళ్లగొట్టారు.…
Read More

తేనెలొలుకు తెలుగు

తేనెలొలుకు తెలుగు తెలుగంటే అవకాయ తెలుగంటే అమ్మ ప్రేమ తెలుగంటే నాన్న బాధ్యత తెలుగంటే సోదరుల ఆప్యాయత తెలుగంటే అనురాగం తెలుగంటే ఆత్మీయత తెలుగంటే ప్రేమలో కం తెలుగంటే తోబుట్టువు తెలుగంటే అందమయిన లోకం తెలుగంటే తీయని కోయిల పలుకు తెలుగంటే పంచదార పాకం తెలుగంటే జానపదం తెలుగంటే వేమన పద్యం తెలుగంటే భారతం తెలుగంటే తేజం తెలుగంటే కమ్మని పాట తెలుగంటే సప్త వర్ణాలు తెలుగంటే సప్తపదులు తెలుగంటే శంఖరాభరణం తెలుగంటే స్వర్ణ కమలం తెలుగంటే రామాయణం తెలుగంటే వేద వేదాంగాలు తెలుగంటే అష్టపదులు తెలుగంటే అష్ట దిక్పాలకులు తెలుగంటే అష్ట కవులు తెలుగంటే కమ్మని కావ్యాలు తెలుగంటే దేశదేశాలు తెలుగంటే ప్రగతి తెలుగంటే వెన్నెలలో గోదారి తెలుగంటే వెన్నెల రాత్రి తెలుగంటే మానసికోల్లాసం  తెలుగంటే సంప్రదాయం తెలుగంటే శాస్త్రీయత తెలుగంటే భారతం తెలుగంటే బంగారం తెలుగంటే జాతర తెలుగంటే గౌరవం తెలుగంటే ప్రకృతి తెలుగంటే దారి చూపే వెలుగు…
Read More