bhavya charu

ఆమె

ఆమె

ఆమె ఆమె సహనానికి నిలువుటద్దంఓపికకు మారుపేరు ఆమెఆమె విలువలు నేర్పుతుందిఆమె సంస్కారం నేర్పిస్తుందిఎలా ఉండాలో నేర్పుతుందిఎలా మాట్లాడాలో తెలుపుతుందిఎలా ఉండకూడదో నేర్పిస్తుందిఎక్కడ నవ్వులపాలు కాకూడదో తెలుపుతుందిఎలా ధైర్యం గా ఉండాలో నేర్పుతుందిఎలా బెలగా ఉండకూడదు తెలుపుతుందిఆమె ప్రశ్నించడం నేర్పుతుందిఏమైనా తట్టుకునే శక్తిని ఇస్తుందిఎలా మాట్లాడకూడదో నేర్పుతుందిఎలా పొదుపుగా ఉండాలో తెలుపుతుందిఎలా ఖర్చులు చేయకూడదో నేర్పుతుందిఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుపుతుందిఇంటికి పెద్దగా ఎలా ఉండాలో నేర్పిస్తుందిఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుందిఎలా ఉండకూడదో తెలుపుతుందిఎలా సహాయం చేయాలో, చేయకూడదో నేర్పిస్తుందిఇన్ని నేర్పిన ఆమె….మాత్రం మమకారానికి లొంగిపోతుందిమాటలకు కరిగిపోతుందిప్రేమ, ఆప్యాయతానురాగాలను పంచుతుందిబంధాలను తెగిపోకుండా కాపాడుతుందిచివరికి ఆమె ఆ బంధాల నడుమ చిక్కిపోతుందిఅంతా నావారే అనుకున్న ఆమెబాధ్యతకు లొంగిపోతుందితాను నేర్పిన బాటే ముళ్ల కంపగా మారితననే చిల్చుతూ ఉన్నా…..కరిగిపోతూ, కాలిపోతుందిఆమె అమ్మ… మనందరి తల్లిప్రతి అమ్మ కథే ఇది, ఇంతే ఆమె జీవితంఆమె లేనిదీ నువ్వు లేవు, నేను లేనుసృష్టిలో తియ్యనిది, మాయనిదిమోసం, ద్వేషం, స్వార్థం, కల్లాకపటం…
Read More
చేతులు

చేతులు

చేతులు విప్పారిన ఆ చిట్టి చేతులు నేలను ముద్దాడుతాయిఆ చిన్ని చేతులు చెంబుని మోస్తాయిఆ చిన్ని చేతులు చీపురుతో నేలను ఉడుస్తాయిఆ చిన్ని చేతులు గిన్నెలు కడుగుతాయిఆ చిట్టి చేతులు నొప్పులు ఆపుకుంటాయిఆ చేతులు మరో చిన్నారిని ఆడుముకుంటాయిఆ చేతిలు గోరుముద్దలు తినిపిస్తాయిఆ చిన్ని చేతులు ఓదారస్తాయిఆ చిన్ని చేతులు మగాణ్ణి హృదిలో అలసట తీరుస్తాయిఆ చిట్టి చేతులు బిడ్డలను సాకుతాయిఆ చిన్ని చేతులు ఇంటికి వన్నె తెస్తాయిఅవసరం ఆ చేతులని ఎన్నో చోట్ల తిప్పుతాయిఆ చేతులు వంటల్లో ప్రావిన్యాం సంపాదిస్తాయిఆ చేతులు నలుగురి కడుపు నింపుతాయిఆ చేతులు కంప్యూటర్ పై నాట్యమాడతాయిఆ చేతులు కారు నడుపుతాయిఆ చేతులు విమనాలు నడిపిస్తాయిఆ చిన్నారి చేతులు అంతరిక్ష యానాలు చేస్తుంటాయిఆ చేతులు నృత్య ప్రదర్శనలో అరితేరతాయిఆ చిట్టి చేతులు టెన్నిస్ ఆడతాయిఆ చిన్నారి చేతులు తుపాకీ పట్టుకొనితీవ్రవాదులను అంతం చేయడంలో ముందుంటాయిఆ చిట్టీ చేతులే బ్యాట్ పట్టుకొనిభారతదేశం పేరుని నిలబెడతాయిఅందుకే అందుకే ఆ…
Read More
తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి.

తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి.

తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి. నేటి సమాజంలో పిల్లలపరివర్తనలో చాలా మార్పులు వచ్చాయి.తమ చుట్టూ ఉన్నపరిస్థితుల వల్లనేవారి ప్రవర్తనలోమార్పులు వచ్చాయి.ప్రతీ విషయానికీపంతాలకు పోయితల్లిదండ్రుల మాటవినటం మానేసారు.ఇందులో తల్లిదండ్రులతప్పు కూడా ఉంది.పిల్లలను అతి గారాబంగాపెంచుతున్నారు. పిల్లలుఅడిగితే కొండమీద కోతినికూడా తెచ్చి ఇస్తున్నారు.దీనివలన పిల్లలకు వస్తువులవిలువ తెలియటం లేదు.ఏది అడిగినా సరే తల్లిదండ్రులు తమకుతెచ్చి ఇస్తారు అనిభావిస్తూ ఉంటారు.అలా తెచ్చి ఇవ్వక పోతేఅలుగుతూ ఉంటారు.తల్లిదండ్రులతో గొడవపెట్టుకుంటూ ఉంటారు.పెద్దలను గౌరవించటంమన సాంప్రదాయం. అయితే నేటి పిల్లలు తమ పెద్దలను గౌరవించటం మానేసారు.దీనికి ప్రధాన కారణంతల్లిదండ్రులే. పిల్లల మనసుల్లో పెద్దలకుసరైన గౌరవం ఇవ్వాలిఅనే భావన కలిగించేవిషయంలో వారువిఫలం అవుతున్నారు.ఈ విషయంలో పిల్లలతప్పు కూడా ఏమీ లేదు.సహజంగా పిల్లలు తమతల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. వారు తమ పెద్దలను గౌరవించకపోతేపిల్లలు కూడా పెద్దలనుగౌరవించరు. ఇంకొకముఖ్యమైన విషయంఏమిటంటే పిల్లలు తమఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. గెలుపుఓటములు దైవాధీనాలు.ఓడిపోయామని, పరీక్షల్లోతప్పామని ఆత్మహత్యలకుపాల్పడే పిల్లలు ఎందరో.ఈ విషయంలో తల్లిదండ్రులేతమ పిల్లలకు ధైర్యం చెప్పేప్రయత్నం చెయ్యాలి. ఓటమిని తట్టుకుని…
Read More
ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష ఉపవాస దీక్ష అంటే ఉప అంటే సగం దీక్ష అంటే దీక్షగా చేసేది. అంటే మనం చేసే ఉపవాస దీక్షను దీక్షగా సంకల్పం చెప్పుకుని చేయాలి. సంకల్పం అంటే మనం ఏ దేవతకు చేస్తున్నామో వారికి తల్లి నా కోరిక ఇది అందుకు నేను ఈ దీక్షను చేస్తున్నాను. నా కోరిక నెరవేర్చు అంటూ చేయాలి. ఇక ఇలా దీక్ష చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. లోపల ఉన్న మలినం అంతా చెమట రూపంలో పోయి శరీరం, ఆత్మ శుద్ది అవుతుంది. ఇది మామూలు భక్తులకు ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వారికి. మరి పేదల మాటేమిటి? రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో సగం రోజు లేదా ఒక రోజు అంత కూడా అసలేమీ తినకుండా పస్తులు ఉంటున్న ఆ పేదల కోరికలను భగవంతుడు తీరుస్తాడా? తిర్చడా? తీరిస్తే మరి వారింకా పేదలుగా ఎందుకు ఉన్నారు? ఒక్క పూట…
Read More
మంత్రము

మంత్రము

మంత్రము మాటకు ఎంతో శక్తి ఉంటుంది. మామూలు మాటలుగా మనం అనుకుంటాం కానీ అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మాటలు నోట్లోంచి వచ్చేటప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి మాట్లాడాలి. అయితే కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనం మాట్లాడతాం. ఉదాహరణకి ఒక తెలిసిన వ్యక్తి వయసులో పెద్దవాడు ఉన్నాడు అనుకుందాం. అతని గురించి మనకేవరో చెప్పారు. ఏదో విషయం అతని గురించి మాట్లాడుకున్నాం అనుకుందాం ఆ మాటల్లో. అరె అతను ఇంకా ఉన్నాడా అని అంటాం అంటే ఇది కావాలని అనే మాట కాదు మామూలుగా తెలియకుండా వచ్చే మాట కాబట్టి అలా మనం అనుకున్నా తర్వాత వారం రోజుల కే అతను చనిపోయాడు అనుకోండి. అప్పుడు మనకు ఎలా ఉంటుంది. అయ్యో నేను అనడం వల్లనే చనిపోయాడు ఏమో అనే అనుమానం వస్తుంది. మనం మాట్లాడినప్పుడు ఉన్న వారు కూడా నిదెం నోరు రా ఇలా…
Read More

ప్రాణం ఖరీదు

ప్రాణం ఖరీదు మన తరాలు మారుతున్న కొద్దీ సాంకేతికత మారుతూ వచ్చింది. నాటకాలు, తర్వాత సినిమాలు ఇలా ఎన్నో రకాలుగా మారాయి. ల్యాండ్ ఫోన్స్ మారి కాయిన్ బాక్స్ లు వచ్చాయి తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అలా స్మార్ట్ ఫోన్ లో ఎన్నో రకాల టెక్నాలజీ వాడుతూ మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు అవి కొంత మంచికి అయినా మరి కొంత చెడుకి ఉపయోగిస్తున్నారు అనడం లో సందేహం లేదు. ఆ టెక్నాలజీ వల్ల ఇద్దరు అబ్బాయిల జీవితాలు ఎలా మారాయి అనేదే ఈ కథ... రాము, రాజేష్ ఇద్దరు రూం మేంట్స్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. అయితే రాము ఎక్కువగా ఫోన్ వాడుతూ పాటలు వింటూ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. రాము వారిది మధ్యతరగతి కుటుంబం అయినా తండ్రిని ఇబ్బంది పెట్టి మరీ ఫోన్ కొనిపించాడు. రాజేష్ దగ్గర కూడా ఫోన్ ఉంది కానీ రాజేష్ దాన్ని…
Read More

అందమైన ఆకాశం

అందమైన ఆకాశం అందమైన ఆకాశంలో అందరాని చంద్రుడు అతన్ని అందుకోవాలనుకోవడం అత్యాశ అయినా, అందితే బాగుండు అనే కోరిక దహించి వేస్తుంది. నిన్న అయినా పున్నమి రాత్రిలో ఒంటరిగా నీతో ఊసులాడాలని నా మదిలోని మాటలు ఎన్నో చెప్పాలని, నా హృదయాన్ని అంతా నీ ముందు పరచాలని అనుకుంటాను. కానీ అదేంటో నన్ను చూడగానే నువ్వు మబ్బుల చాటుకు జారుకుంటావు. నా హృదయాన్ని పరిస్తే కరిగిపోయి కిందికి వస్తానేమోనని నీ భయం కాబోలు... అందుకే మెల్లిగా మబ్బుల చాటుకు దాక్కొని నన్ను ఏడిపిస్తావు, అయినా వదులుతానా నా అక్షరాలని కవనాలుగా మారలుగా కూర్చి గుచ్చి, ఇదిగో ఇలా నీ ముందు పరుస్తున్నా... కనీసం అక్షరాలు అయినా చూసి నా మది మాటలు తెలుసుకుంటావని ఆశతో ఇప్పటికి శుభరాత్రి చెప్తూ రేపటికి నిన్ను స్వాగతిస్తున్నా.. - భవ్య చారు
Read More

ఆనందమైన జీవితంలో అపశృతి

ఆనందమైన జీవితంలో అపశృతి ఏమ్మా అంతా రెఢీ నా అంటూ వచ్చారు రామారావు గారు. హా అంత రెఢీ అండి ఇంకా వాళ్ళు రాలేదే అంది అనురాధ. వస్తారు లే సరిగ్గా ముహూర్తానికి వచ్చేస్తారు ఇప్పుడే ఫోన్ చేశాను దగ్గర్లోనే ఉన్నాం అన్నారు అన్నారు రామారావు గారు. ఓహ్ అవునా సరే అయితే దివ్య నువ్వు ఇంకేదైనా ఉంటే సరి చేసుకో నేను వెళ్లి టిఫిన్స్, టీ అయ్యాయా చూస్తాను అంటూ దివ్యకు చెప్పి వెళ్ళింది అనురాధ. హా సరే అమ్మ అంది దివ్య. దివ్య, రామారావు అనురాధ దంపతుల ఒక్కగానొక్క కూతురు, కొడుకు పుట్టి చనిపోయాడు. దాంతో దివ్యనే గారాబంగా పెంచారు. దివ్య కూడా పిచ్చిపిచ్చి పెనులేమీ చేయకుండా తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకుంటూ డిగ్రీ వరకు చదువుకుంది. ఇప్పుడు డిగ్రీ అయిపోగానే నీకు పెళ్లి చేస్తాము అన్నారు అందుకు కూడా దివ్య ఒప్పుకుంది ఆనందంగా. ఇప్పుడు అదే హడావుడి ఇంట్లో…
Read More

నాతిచరామి

నాతిచరామి గతంలో రాసిన ఇంటింటి రామాయణం లో భాగంగా ఇదొక భాగం, ఇది నాతిచరామి అనే శీర్షిక కు సరిపోతుంది అని భావిస్తూ, మీ అభిప్రాయం తెలుపండి. దాని గురించి, దాని భర్త నరయ్య గురించి ఆలోచిస్తూ కూర్చున్న నేను మాలచ్చి తండ్రి భద్రయ్య మా అమ్మగారి ఊర్లో పెద్ద పాలేరు అప్పుడన్ని గోవులు, బర్రెలు, వ్యవసాయనికి చెదోడు వాదోడుగా ఉండేవాడు, మా చిన్నప్పుడు మాకేం కావాలన్నా నిమిషంలో తెచ్చి పెట్టె వాడు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే భద్రయ్య రాత్రి కాగానే మాత్రం బాగా తాగేసి, తన పాక లో ఉన్న తన భార్య పంకజంని బండ బూతులు తిడుతూ ఊగిపోయేవాడు భద్రయ్య ... అంత తిడుతున్నా కూడా పంకజం ఒక్క మాట కూడా బయటకు రాకుండా, వాడి వాగుడు అంతా అయ్యాక నులక మంచం లో పడుకుంటే వాడికి అన్నం కలిపి పెట్టేది ఎంతో ప్రేమగా. మా పెళ్లిళ్లు…
Read More

పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా ప్రియా ఇన్నాళ్లు నీ వెనకాల తిరిగాను... నీతో మాట్లాడాలని ఎంతో తహతహలాడాను.... నీ కళ్ళలో ఒక్కసారి అయినా పడాలని అనుకున్నా... నీ మదిలో చోటు దొరుకుతుంది అని ఆశ పడ్డాను... నీ మనసు కరగక పోతుందా అని ఎదురుచూసాను... నీ హృదయంలో ఈ ధీనుడికి ఛోటిస్తావని కలలు కన్నా.... మా మనసులోని మాటను నీతో చెప్పాలని మన ఇద్దరి జీవితాలని రంగుల మయం చేయాలని అనుకున్నా... మన ఇద్దరి మధ్య దూరం ఉండకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకున్నా... అనుకున్నట్టే నీ మనసు కరిగింది నా ఆశ నెరవేరింది... మన ఇద్దరి జీవితాలు రంగులమయం అయ్యాయి... మన ఇద్దరి మధ్య దూరం తగ్గింది. కానీ మన మనసులోని మాటలు బయటకు వినిపించవు... నీ కళ్ళలో భావం, నా మదిలో తెలుస్తుంది... నా మౌనం నీకు అర్థం అవుతుంది... పెద్దల వల్లనే నా కల నెరవేరింది... కానీ మన పలుకులు…
Read More