c s rambabu

ఆశల పల్లవి – గేయం

ఆశల పల్లవి - గేయం పల్లవి స్త్రీ అంటే మమతని స్త్రీ అంటే కరుణని  తెలుసుకో మనిషీ  తెలిసి మసలుకో మనిషీ చరణం చైతన్యమూర్తియై కాపాడును తాను తనులేని జగతిని ఊహించలేము  చీకటిలో నీవుంటే నీవెలుగే తాను కదా నీ కంటిపాపయై లాలించు దేవతగా చరణం ఆడపిల్ల ఉన్నచోట ఆశదెంత సంబరము నింగిలో సగమైనా ఇంటికో పూర్ణత్వం విడనాడి మూర్ఖత్వం ముందడుగే  వేయిద్దాం  సమానతను సాధించే అవకాశం తనకిద్దాం చరణం తనపట్ల హింసనే గర్హించుదామండీ తల్లడిల్లు హృదయానికి నీడనిచ్చుదాము జగతిలోన స్త్రీ శక్తి లేకుంటే అధోగతే  తప్పునే దిద్దుకుంటే సుఖశాంతులు మనఇంట మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో - సి.యస్.రాంబాబు
Read More

ఘోష

ఘోష ఆకలి చావుల ప్రపంచంలో  ఇప్పుడు మరో మరణమృదంగం తాండవమాడుతోంది  మనిషికి మతం ఉన్మాదమిస్తే  దేశాలది విస్తరణ కాంక్ష  శకలాలు శకలాలుగా రాలిపోతూ భవనాలు, కుటుంబాలు ! ప్రపంచం కుగ్రామమయిందంటాం కానీ ప్రపంచం మళ్ళీ కుంగిపోతోంది ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ! విశ్వ రహస్యాలను ఛేదించే మనిషి  విస్తరణ కాంక్ష అనే అయస్కాంతానికి దేశాలతుక్కుపోతుంటే నివారించలేని అచేతనుడయ్యాడు ! రణం మొదలవటానికి కారణమక్కర్లేదు  సాకు మాత్రమే చాలని చరిత్ర చెబుతూనే ఉంటుంది ! కాలం కరుకైనదంటాం  కాదు  దేశాలమధ్య రగిలే కాంక్షలు కరాళనృత్యమై  ఉషోదయాల ఉసురుతీసి  అనిశ్చితి ఊబిలో నెట్టేస్తాయి ! నిట్టూర్చే గొంతులనూ నొక్కేసే నెగళ్ళు రాజుకుంటుంటే రెక్కలు తెగిన శాంతికపోతాల రుథిరం నిస్సహాయతకు సంకేతమై  జాలిగా ఘోషిస్తుంటుంది ! - సి.యస్.రాంబాబు
Read More

అరుదైన స్మృతులు

అరుదైన స్మృతులు   రమణమహర్షి గురించి వినటం.. ఒకటీ రెండూ పుస్తకాలు చదివినా  ఆయనొక ఎంజిమాటిక్ పర్సనాలిటి (enigmatic personality) లా అగుపించారు. కానీ ఆయన పట్ల ఆకర్షణ తగ్గలేదు. అట్లాంటి సమయంలో 'భగవాన్ స్మృతులు' పేరిట చలం తన అనుభవాలతోపాటు భగవాన్ దగ్గరున్న అనేకమంది అనుభవాలను, సాక్షాత్కారాలను తనదైన శైలిలో తనదైన వచనంతో ఎప్పుడో అందించిన పుస్తకం చదివే అవకాశం కలిగింది. ఇంతకీ రమణులు ఎవరు? దైవస్వరూపమా? సాధారణ వ్యక్తిగా ఉన్న అసాధారణ వ్యక్తా? ఇవన్నీ వెంటనే మనకు వ్యక్తం కావు. కానీ ఆయన దగ్గరున్న వారు, ఆయనను దర్శించుకున్నారు తమ అనుభవాలను స్మరించుకున్నప్పుడు, గుర్తుచేసుకున్నప్పుడు ఆయనలోని ముక్కుసూటితనం, చమత్కారం చురకలు,ఆధ్యాత్మికత మనకు గోచరిస్తాయి. కొన్ని సందర్భాలలో ఆయన తన భక్తులు, సన్నిహితులకు అలవోకగా చెప్పిన సత్యాలు మనలను ఆశ్చర్యపరుస్తాయి.  ఆత్మ సాక్షాత్కరం అంటే ఏమిటంటే ఆయన ఎంత సులభంగా చెబుతారో..  "ఇప్పుడు ప్రపంచంలో నీవు ఉన్నావు అప్పుడు ప్రపంచం నీలో ఉంటుంది" ఇంతకుమించిన వివరణ ఏముంటుంది. రమణాశ్రమంలో స్పర్థలు,…
Read More

పలుకుతేనెల వ్యాసార్ధం

పలుకుతేనెల వ్యాసార్ధం   కొన్ని పుస్తకాలు ఒక భావపరిమళాన్ని మనలో వ్యాపింపచేస్తాయి. ఎంచుకున్న అంశాలు... ఆ అంశాలను ఆవిష్కరించిన తీరు మనలను ముగ్ధుల్నిచేస్తాయి. మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. కథో, నవలో అయితే కొంత కాల్పనికత బరువును మోస్తాయి. అయితే పుస్తకమో వ్యాససంకలనమయినప్పుడు అది వ్యాసార్ధమై రచయిత హృదయ వైశాల్యాన్ని ఆవిష్కరించే వెన్నెల జాబిలి కావొచ్చు. అసలు వ్యాసమంటే వచనం కదా. వచనం రాసి మెప్పించటం అంత సులువు కాదు. వ్యాసం అందంగా ఆకట్టుకోవాలంటే పదాల కూర్పు, పొహళింపు వ్యాసానికి మరింత అవసరం అని గుర్తించాలి. అందుకే చాలా వ్యాసాలు భారంగా సాగుతూ చదువరిని ఆకట్టుకోవు.... అందుకు భిన్నం వోలేటి పార్వతీశంగారి వ్యాస సంకలనం "వ్యాసార్థం". ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రయోక్తగా నాలుగు దశాబ్దాల అనుభవం, స్వరమాంత్రికుడిగా అనేక సభలలో ఆశువుగా మాటలను అల్లేనేర్పు, రచనా వారసత్వం ఇవన్నీ కలిసి ఈ పుస్తకాన్ని అక్షర పరిమళంతో నింపేశాయి. సౌకుమర్యాన్ని పరవశంతో పరిచాయి. అందుకే ఈ…
Read More