చిగురాశ
చిగురాశ అబ్బా ఎంత బాగుందో కదా అంటూ షాప్ ముందే ఆగిపోయింది లత. నీకు ఏది చూసినా అలాగే ఉంటుంది కానీ పద ముందు అంటూ తన చేయి పట్టుకుని ముందుకు నడిపించింది శారద. అబ్బా అక్కా నాకు అది కనుక్కోవాలని ఉందే అంది లత. దాని ధర చూసావా ఎంత ఉందో ఆ డబ్బుతో మనం మన ఇంట్లోకి వారం రోజులు కూరగాయలు తెచ్చుకోవచ్చు పద నీకేం పని లేదు అంటూ లాక్కు వెళ్లసాగింది శారద. అబ్బా అక్కా ఎప్పుడు కొనియమన్నా కొనియ్యవు అంటూ ఏడవ సాగింది లత. ఊరుకో లతా నీకు ఎప్పటికైనా అది కొనిస్తాలే. ఇదిగో ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను తింటూ వెళ్దాం అంటూ ఐదు రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనిచ్చింది లతా ఏడుపు ఆపడానికి. ఆరోజు రాత్రి శారద కళ్ళ ముందు ఆ షాప్ లో ఉన్న నీలం రంగు గౌను…