daari

దారి

దారి అందుకోలేని ఆకాశంలా ఆనందం ఊరిస్తుంటుంది ఆలోచనల వంతెనపై మనసు పచార్లు చేస్తుంటుంది దరిచేరిన తాయిలాలేవీ కోరికల దాహం తీర్చలేక చతికిలబడుతుంటాయి దారి మూసుకుపోతుంది ఆశకు ప్రాణంపోసి చీకటిలో నడుస్తుంటావు కీచురాళ్ళ ధ్వనుల సంగీతంతో మేల్కొన్న మనసు దారి కనుగొంటుంది - సి.యస్.రాంబాబు
Read More

దారి

దారి కొత్త దారి అవకాశాల కోసం ఎదురుచూసే వాడికి సమయం సరి కొత్త దారి... ఆశ కోసం ఎదురుచూసేవాడికి దొరికే క్రొత్తదారి... మధ్య తరగతి బ్రతుకులకు మనస్సే మంచిదారి... చదువుల కోసం ఆరాటపడే వారికి అందెను శిఖరపు అంచు దారి... మనసు లేని మూర్ఖులను ముంచు దారి ఎడారి.... ఆలోచన తోడైతే ఆనందమే మనకు మంచిదారి... సీత అన్వేషనలో అంజనేయుడు చూపిన క్రొత్తదారి... నరకాన్ని నరికి నరకచతుర్థిగా మారిన దారి... పండగ పరవళ్ల దారి.... పేదవాడి పస్తులకు ఏది దారి?.. వారి కథ ఏ తీరం చేరిది?... కిషాన్ కి నాగాళి దారి... జవాన్ కు ఫిరంగి దారి... వైద్యుడకు స్టెతస్కోపు దారి.. ఇంజనీరికి ఇటుక దారి..... ఇలా పలు రంగాల ప్రయాణాన మానవుడి కదలికలే కొత్త దారి... రేపటి తరాలకు సరికొత్త పునాది... - తోగారపు దేవి
Read More