స్నేహం ఏవో ఊసులాడి ఎన్నో పంచుకొని ఏదో హాయినిచ్చే స్నేహాన్ని తెలుపగలమా అప్రయత్నంగా. అనుకోని దారిన కలిసి నిస్వార్థంగా. ఆపదలో సాయం చేసే స్నేహాన్ని తెలుపగలమా అపార్థ భావనలకు ఈర్ష, ద్వేషాలకు చోటివ్వని దారిలోని స్నేహాన్ని తెలుపగలమా సంతోషం. భరువనిపించే భాదలో అడగకుండానే జత కట్టే అడుగుల్లోని స్నేహాన్ని తెలుపగలమా ధనిక, పేద కులము, మతము భాషా, వేషాలనే గతుకుల్లేని వంతెన స్నేహం. - హనుమంత
ఇల్లాలు
ఇల్లాలు ఆలిగా మొదలై అంతం వరకూ తన సర్వస్వాన్ని పంచేది ఇల్లే తన సర్వస్వం అనుకునేది భర్తలో భాగమే ఇల్లాలు అమ్మ తనానికై ఆర్భాటం ఇదోతనానికి అంకితం నెమలి పించమల్లే విచ్చుకొన్న ఆశలు ఇల్లాలు అలసిన హృదయానికి అల్లరి చేష్టలకు చుట్టాల అనురాగానికి ఒదార్పు ఇల్లాలు ప్రేమను పంచుతూ అవసరం తీర్చుతూ భాద్యతను మరువదు ఆదిశక్తి గా ఇల్లాలు. - హనుమంత
ప్రకృతి
ప్రకృతి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తే సంబరాలు గాయపరిస్తే ప్రమాదాలు భూమికి పెట్టని ఆభరణాలు జీవజాతికి మూలాలు కొలవని దైవాలు మురిపించే అందాలు నడిపించే ఇంధనాలు వింతైన విశ్వంలో అరుదైన చిత్రాలు ఖరీదైన గనులు అమూల్యమైన వనరులు క్రియాశీల చర్యలు క్రమానుగత కక్షలు మొలకెత్తి పెద్దదై నేలకొరిగి గనులై మానవాళి అవసరాలకై అంకితమైనవి... భావితరాలకు అవసరం మనతరానికి ఆసరాగా వెనుకటికి ఆరాధించేదిగా ప్రకృతి. - హనుమంత
నిలకడ లేని మనసు
నిలకడ లేని మనసు గాల్లో ఎగిరే పతంగిలా కొమ్మ మీద గెంతే కోతిలా చంగున ఎగిరే దూడలా నిలకడ లేని మనసు... ఉన్నది మరచి లేనిది తలచి ఆర్బాటమనే ఆశల వలలో ఉలిక్కిపడిరి ఊహను తలచి నిలకడ లేని మనసుతో..... మండే సూర్యుడు అస్తమించిన ఆశల మనసు ఆగనంటూ అటు ఇటు తూగుతూ నిలకడ లేని మనసు.... ఆశలే ఇంధనంగా సాదనే సాహసంగా పడిలేచె వయస్సు లాగా నిలకడ లేని మనసు..... - హనుమంత
సైనికుడు
సైనికుడు సైనికుడా!... మండే ఎండకు కరిగే మంచుకు చీల్చే తూటాకు ఎదురేనా నీ పయనం... అడుగడుగునా సుడిగుండం అవనికై సాగు పోరాటం అమ్మేగా ఈ భారతం ఆప్తులే ఈ జనమంతా.... ఏ పొగడ్త సాటి నీకు ఏ గౌరవం సరి తూగదు నీకు ఎగిరే పతాకమే నీ పొగరు పొంగే లావా నీ నెత్తురు..... ఆకలితో అలమటించినా గాయాలతో బరువనిపించినా శ్వాసే అలసిపోయినా వెనుదిరగని బాణం నువ్వు.... - హనుమంత
పేరులేని బంధం
పేరులేని బంధం అమ్మానాన్నలను వదిలి ఉండటం అదే మొదటిసారి. నన్ను హాస్టల్ లో చేర్పించి వారం అవుతూవుంది, కానీ నేను మాత్రం ఇంటిని తలచుకుంటూ ఒక్కడినే దిగాలుగా ఉండేవాడిని. రోజూలాగానే స్కూల్ కి వెళ్లి, అక్కడ చెప్పే పాఠాలు అర్థంకాక, ఆడుకోవడానికి స్నేహితులు లేక చాలా విచారంగా చెట్టు కింద కూర్చొన్నాను. చెట్టు పై నుండి “భూమ్” అంటూ ఉలిక్కిపడేలా క్రిందకు దుమికాడు. భయంతో నివ్వెరపోయి, గట్టిగా అరిచాను. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు, ఉపాధ్యాయులు ఏమిటా అని పరుగున వచ్చారు. కానీ వాడు అక్కడ లేడు, నాకు ఏమి చెప్పాలో అర్థంకాలేదు, అంతమంది చుట్టుచేరగానే నోట్లోనుంచి మాటరాలేదు. కానీ అంతమంది నాతో మాట్లాడటం మొదటిసారి. మరుసటి రోజు సాయంత్రం వాడు హాస్టల్ లో కనిపించాడు, చూడగానే నాకు భయమేసింది. పిల్లలతో గొడవ పడుతూ, స్కూల్ కి రాక, అల్లరిగా తిరిగేవాడు. రానురాను నా గదిలోని వస్తువులను వాడుకునేవాడు, అక్కడే పడుకునేవాడు. కానీ…
రైతు
రైతు విత్తుట మొదలు కోయుట వరకు... సమయానికి వర్షం పడక నేల దున్నక అయినా విత్తనం కొని వేచిచూసేనుగా.... నకిలీ విత్తనాల దళారుల మోసాల ప్రభుత్వ రాయితీల స్వార్థ ప్రభుత్వాలతో అడుగడుగునా ఇబ్బందులతో..... ఇల్లంతా పంటపై ఆధారపడుతు అకాల వర్షాలకు విపరీత కరువుకు దగ్గరి చుట్టమై పంట కోతతో మార్కెట్ ధరతో అప్పుల బిగువుతో బందాల కొలిమిలో పిదితుడై... హృదయమంతా బండగా కాయమంతా కటువుగా జీవితమే వృధాగా రగతమంతా ఇంకి కన్నీరే మిగిలేనుగా.. - హనుమంత
అలక
అలక అలిగినవ అమ్మాయి.... వెచ్చనైన సూర్యుడి మీద చల్లనైన చంద్రుడి మీద... చీకటైన అమాసపై వెన్నెలమ్మ అలిగినదా.... ఝువ్వు మనే తుమ్మెద పూలపై వాలినందుకా.... పైనున్న నింగిని నేల తాకనందుకా... పెంచుకున్న ఆశలు నేల రాలినందుకా.... మెత్తని మనసును గాయపరిచి నందుకా.... వరుడు నచ్చనందుకా..... అలక తీరనందుకా.... ఇరుచేతులు ఒకదానిపై ఒకటి అలిగే వీలుందా!.... ఒకరినొకరు చూడక పోయినా ఇరుకన్నులు ఆలిగే వీలుందా!..... - హనుమంత
అక్షరలిపి
అక్షరలిపి అక్షరమునే వలలా అల్లి పదములకే పంతము నేర్పి రచయితలను జల్లెడ పట్టి అక్షరలిపి అనే మాలను అల్లి పూలలా కథలను అల్లి కవితల సుగందాలను జల్లి పాఠకులను తేనీగలా ఆకర్షించి తేనెల తీపిని చిమ్మెను అక్షరలిపి అంతర్గమున, బహిర్గమున శిల్పాలు ఉలి దెబ్బను ఓర్చునట్టుగ ఆశల అలలు తీరము చేరక అలుపెరుగని ఆరాటమే అక్షరలిపి ఏకాంతము ఏకాకి చేసిన ఆశ్రువుల ఊట ఇంకిపోయిన కదలిక లేకుండ కూలబడిన అలక్ష్యం చేయదు అక్షరలిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్షరలిపి సంఘానికి - హనుమంత
పెళ్ళి చూపులు
పెళ్ళి చూపులు "ఏమే సుజాత టి తీసుకునిరా" "ఆ తెస్తున్నానండి. ఏమిటి ఈ రోజు తొందరగా వచ్చారు?" "ఆ బ్యాగు ఇటు ఇయ్యి టైమ్ కి వస్తా" "వద్దులెండి" "ఏమిటి లోపల గుసగుసలు." "పక్కింటి సుబ్బారావు గారికి పెళ్ళి చూపులపుడు జరిగిన సంఘటనలు అండి". మొదటి పెళ్ళి చూపులపుడు పెళ్ళి కూతురు తన గదిలోకి తీసుకెళ్ళి బాయ్ ప్రెండ్ తో దిగిన ఫోటోలు చూపించిందట. రెండో పెళ్లి చూపులపుడు పాటలు పాడటం వచ్చా అని అడిగితే "ఉ" అన్నదట, తన పేరు అడిగినపుడు కూడా "ఉ" అన్నదట, నీకు మాటలు రావా అని అడిగినపుడు "ఉ, ఊ" అన్నదట. మూడో పెళ్ళి చూపులపుడు వంట చేయడం వచ్చా అని అడిగితే నవ్వుతూ వాళ్ళ అమ్మ వైపు చూస్తే ఆమె బాగా చేస్తుంది అన్నది, ఎంత వరకూ చదువు కున్నావు అని అడిగినపుడు కూడా వాళ్ళ అమ్మ వైపు చూసింది, ఆమె డిగ్రీ…