కల
కల అమ్మోయ్.... నాకు ఉద్యోగం వచ్చిందంటూ అమ్మాయి అరుపు తో వంటింట్లో ఉన్న నేను బయటకు వచ్చాను. అబ్బా ఎన్ని రోజులకు మంచి శుభవార్త తెచ్చావు అంది అమ్మ మేటికలు విరుస్తూ. ఇక మనం ఈ చిన్న ఇంట్లో ఉండొద్దు. పెద్ద ఇంటికి మారాల్సింది అంటూ తనతో వచ్చిన మనుషులతో ఇంట్లో విలువైన సామాను తో పాటు కొత్త ఇంటికి మారిపోయారు సరితా వారి కుటుంబం. ఎందుకమ్మా ఈ ఇల్లు బాగుంది కదా అని అంటున్న నారాయణ గారితో నాన్న మీరు మాట్లాడకండి ఇన్ని రోజులూ ఇరుకుగా ఉన్న ఇంట్లో ఉన్నాం. ఇప్పుడైనా కనీసం పెద్ద ఇంట్లోకి మరదాం అంటూ తండ్రి నోరు ముయించి పెద్ద ఇంట్లోకి మారిన వెంటనే పెద్ద టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్ లాంటివి అన్ని తెచ్చేసింది సరిత. తల్లి సంతోషించినా, తండ్రి వారించాడు. అయినా సరిత వినకుండా నేను కడతాను కదా అంటూ దబాయించింది. ఒకప్పుడు…