ఓం నమో వేంకటేశాయ... ఆపదమొక్కుల వాడా.. అనాదరక్షక... అని అందరూ నిన్ను పిలుస్తారు.. ఆపద ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు అండగా ఉంటావనా.. అనాదలకు రక్షగా ఉంటావనా... నువ్వు ఎక్కడున్నవో తెలీదు ఎలా ఉంటావో తెలీదు... ఒక బొమ్మకు రూపానిచ్చి.. దానికి నీ నామాన్ని చేర్చి నిన్ను కోలుస్తున్నాము.. కానీ మా బాధలు నీకు కనపడటం లేదా.. కాపాడడానికి రావడం లేదు... అనాదల గోడు నీకు వినపడటం లేదా.. రక్షణ ఇవ్వటం లేదు... ఈ భూమ్మీద పాపాలు పెరిగాయి.. కానీ అందరూ పాపాత్ములు కాదుగా... పాపం అనే వారికన్నా చేసేవారే ఎక్కువయ్యారు... కన్నీళ్లు తుడిచేవరికన్న ... పెట్టేవారు ఎక్కువయ్యారు... రక్షణ ఇచ్చేవరికన్నా ...ఆపదలో తీసేవారు ఎక్కువయ్యారు... నువ్వు కూడా స్వామి🙏🙏 మమ్మల్ని కాపాడడం మానేసి మా పాపాల్ని లెక్కపెట్టడం లో మునిగిపోయారు .... మనుషులు ఎలాగో మారరు.. మీరు అయిన పాప పుణ్యాలను... మంచి చెడులను చూసి.. కాస్త దయచుపండి స్వామి..🙏🙏…