madhavi kalla

అన్నదమ్ముల అనుబంధం

అన్నదమ్ముల అనుబంధం వాళ్ళు చేసే అల్లరిని చూసి వాళ్ళని బాగా ఏడిపించవచ్చు... ఎన్నో గొడవలు పడుతాము ఒకరు అంటే మరొకరికి ప్రాణం రక్త సంబంధం అంటే ఇదేమోనో ఎవరైనా ఏమైనా అంటే మా అక్క తమ్ముడు, అన్నయ్య, చెల్లి అని ఎదురు తిరుగుతాము... వాళ్ళు బాధ పడితే అసలు చూడలేరు గొడవ జరిగిన అంతసేపు శత్రువులు, తర్వాత కలిసిపోతాము... మాకు ఎలాంటి సమస్య వచ్చినా అమ్మలా ఆదుకుంటావు... అమ్మా నాన్నల తర్వాత నువ్వే అన్నీ అయి నాకు తోడుగా నిలచావు... ఇదేమోనో అన్నదమ్ముల అనుబంధమోనో అని నేను అనుకున్నాను... ⁠- మాధవి కాళ్ల
Read More

బాధ్యత

బాధ్యత నువ్వు బాధ పడితే చూడలేరు నీ మంచి కోసం వాళ్ళు ఎన్ని  త్యాగాలైనా చేస్తారు... నీ ఆకలి తీర్చి వాళ్ళు ఆకలితో గడిపిన రాత్రులు ఎన్నో.. నీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో కష్టపడతారు... నీకంటే వాళ్ళకి ఎవరూ ఎక్కువ కాదు... అమ్మ కడుపులో తొమ్మిది నెలలు మోస్తే నాన్న తన భుజాల మీద మోస్తూ ఉంటాడు... నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుతారో వాళ్లకే తెలీదు.. వాళ్ళకి ఒక వయసులో నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని బాధ్యతగా భావించాలి తప్ప భారంగా మాత్రం చూడకు.. నిన్ను చిన్నతనం నుంచి ఎంతో బాధ్యతగా చూసుకున్నారు.. తల్లిదండ్రుల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే... వాళ్లకి ఒక బాధ్యతగా భావించి వాళ్ళని బాగా చూసుకోవాలి.. ⁠- మాధవి కాళ్ల
Read More

నిలకడ లేని మనసు

నిలకడ లేని మనసు నిన్ను చూసిన మరో క్షణం నుంచి నాలో ఎదో తెలియని అనుభూతి లోనవుతుంది... నా మనసులో ఆలోచనలు ఆగడం లేదు ఏ పని మీద అయిన శ్రద్ధ చూపలేకపోతున్నా... ఎందుకు నీ మీద నా మనసు నిలకడగా ఉండడం లేదు... నీ గురించి ఎన్నో ప్రశ్నలు నా మదిలో మెదులుతున్నాయి... వాటికి జవాబులు తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది... నీ ఆలోచనల్లో నేను నిలకడ లేని మనిషిగా ఉండలేకపోతున్నా... నీ ప్రశ్నలతో నేను నిలకడ లేని మనసుగా మిగిలిపోతున్నాను.. ⁠- మాధవి కాళ్ల
Read More

నిజానికి ఆయుష్షు ఎక్కువ

నిజానికి ఆయుష్షు ఎక్కువ నీ గురించి నాకు తెలిసి నిజాన్ని ఎవరికి చెప్పిన నమ్మరు.. పైగా నన్ను అపార్థం చేసుకుంటారు నాకు తన మీద కోపంతో నేను లేని పోని నిందలు వేస్తున్నాను అని చెప్పకుంటారు... కానీ నేను చెప్పిన దాని గురించి మాత్రం ఒక్కరైనా ఆలోచించడం లేదు... నాకు అదే బాధగా ఉంది... నా దగ్గర కూడా సాక్షాలు లేవు అని వాళ్ళు కూడా తెగ నటిస్తున్నారు... నిజానికి నిందలు ఎక్కువ అని మా బామ్మ చెప్పింది... తన గురించి పూర్తి సాక్షాలు సంపాదించి అందరి ముందు దోషిలా నిలబెట్టాను... నా వాళ్ళు ఇంకెప్పుడు నన్ను అపార్థం చేసుకోరు... మంచితనం అనే ముసుగులో అందరిని సులువుగా మోసం చేయచ్చు అని అనుకోవడం చాలా తప్పు... అందరూ ఒకేలా నమ్మిస్తాను అని అనుకోవడం తప్పు.... మనం చేసిన తప్పులు ఎవరికి తెలియదు అని అనుకోవడం మన ముర్ఖతత్వం... నిజానికి ఆయుష్షు ఎక్కువ...…
Read More

చీకటి ప్రపంచం

చీకటి ప్రపంచం చీకటి అనేది అందరిలో ఉంటుంది కానీ నేను మొదట్లో ఉన్నప్పుడు నేను చాలా బాధ పడ్డాను. రోజులు గడిచే కొద్ది అలవాటు అయిపొయింది... గమ్యం లేని మనిషిగా బ్రతికాను... నాలో మార్పు కోసం ఎదురు చూస్తూ నా గమ్యం ఏంటో తెలుసుకొని చీకటి ఉన్న వెలుగుని చూస్తూ బ్రతుకుతున్నాను... నాకు ఎలాంటి కోరికలు, ఆశలు కానీ లేవు... కొత్త విషయాలను తెలుసుకుంటూ కొత్త స్నేహాలతో ఇప్పుడిప్పుడే పువ్వు పుడుతూ నవ్వడం మొదలు పెట్టుతుంది... గతంలో తాను ఉన్న ప్రపంచం వేరు ఇప్పుడు ఉంటున్న ప్రపంచం వేరు... అసలు అనుకోలేదు తను చీకటి ప్రపంచంలో ఉంటుందని ఇప్పుడు మాత్రం ఆ చీకటి చూసి భయపడక ఒక పేరు లేని బంధం లేకుండా బ్రతుకుతుంది... అప్పుడప్పుడు కన్నీళ్లకు చెప్పలేను కదా... అవి వస్తూనే ఉంటాయి.. ⁠- మాధవి కాళ్ల
Read More

అన్నదాత

అన్నదాత రైతు తను ఎన్ని మాటలు చెప్పినా వినకుండా పంట నష్టం వస్తే తనే బాధ పడి ఆత్మహత్య చేసుకున్నాడు కానీ ఎవరిని నిందించాడు.. పంట పండించి దేశానికే అన్నం పెట్టుతున్నారు... రైతు, రైతుకుటుంబం బాగుంటే మనము బాగుంటాము.. వేరే వాళ్ళ భూమిని అద్దెకు తీసుకుని పంట పండించేవాళ్లు కూడా ఉన్నారు... పంట నష్టం వస్తే వాళ్లకి సంజాయిషీ చెప్పవలసిన అవసరం ఉంటుంది.. అలాంటి రైతుని నీరు కారిన రైతు గుండెగా మారుస్తున్నారు.. రైతు బాగుండాలనే కోరుకోవాలి.. అన్నదాత సుఖీభవ.. ⁠- మాధవి కాళ్ల
Read More

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు మా నాన్నమ్మ గారు హఠాత్తు మరణం వల్ల మాలో కలిగిన బాధ ఎప్పటికీ మర్చిపోలేనిది... మేము అశ్రువులతో నీరాజనం సమర్పించాము.. నాన్నమ్మ తో గడిపిన రోజులు గుర్తు చేసుకొని నాలో బాధ ఎక్కువ అయింది... మా నాన్న కళ్ళలో ఎప్పుడు చూడని కన్నీళ్లు నేను మొదటి సారి చూశాను... నాన్నమ్మ మా మధ్య లేదు అనే విషయం గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆగడం లేదు... మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను... కన్నీటితో వీడ్కోలు సమర్పించాము.. ⁠- మాధవి కాళ్ల
Read More

న్యాయం

న్యాయం న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టి ఏది న్యాయము ఏది అన్యాయము తెలియకుండాపోతుంది... న్యాయం కోసం ఎదురు చూస్తే వారికి న్యాయం జరగపోతే న్యాయమా నీవెక్కడ అని వాళ్ల గుండెలు పగిలేలా అరుస్తున్నారు... న్యాయ దేవతకి కళ్ళు ముసినంత మాత్రాన అందరికి అబద్ధాన్ని నిజం అని తేల్చి చెప్పుతున్నారు... న్యాయం కోసం పోరాటం చేస్తున్నంత కాలం నిజం అనేది అందరికి చెప్పడానికి ఆధారాలు, సాక్షాలు కావాలి... వాటిని సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు, సాహసాలు చేయాలి... హంతకులకు దొరికితే ప్రాణం పోయే ప్రమాదం ఉంది.. జాగ్రత్తగా ఆధారాలు, సాక్షాలు సంపాదించి దోషులను శిక్ష పడేలా చేశాను.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అనే నమ్మకం ఉంది... న్యాయం కావాలి అన్న వాళ్లకి న్యాయం జరిగింది... ⁠- మాధవి కాళ్ల
Read More

ఒకరికి ఒకరుగా

ఒకరికి ఒకరుగా ఒకరికి ఒకరు నచ్చితే పెద్దవాళ్ళు పెళ్లి చేశారు.. ఒకరి మనసు మరొకరు తెలుసుకొని ఒకరి ప్రేమని మరొకరికి పంచుకోవడం ఒకరు తప్పు చేసిన మరొకరు ఏ పరిస్థితిలో చేశారో తెలుసుకొని మందలించాలి... వాళ్ళు మధ్య గొడవ జరగకుండా ఒకరికి మరొకరు నెమ్మదిగా సర్ది చెప్పుకోవాలి... ప్రతిదానికి గొడవే పరిష్కారం కాదు అని తెలుసుకోవాలి... ఒకరు గురించి మరొకరు పూర్తి తెలుసుకొని వాళ్ళతో మెలగాలి.. ఒకరికి ఒకరు ప్రాణంగా బ్రతుకుతారు.. ప్రతి భార్య భర్తలు అర్థనారీశ్వరతత్వంతో ఉండాలి.. అలాగయితే ఏ ఇంట్లోనూ గొడవలు జరగావు.. ⁠- మాధవి కాళ్ల
Read More

ఎవరిని నమ్మకూడదు

ఎవరిని నమ్మకూడదు లోకం తెలియని చిన్నపిల్ల ఆటలు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది... చాలా ఆలస్యం అవుతుంది తను ఇంకా రాలేదు.. కొంచం కంగారుగా నేను అటు ఇటు తిరుగుతూ టైం చూస్తూనేమో నాకు కంగారు ఎక్కువ అవుతుంది.. చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళందరిని అడిగిన మాకు తెలియదు అని చెప్పారు... కొద్ది సమయంలో నా స్నేహితురాలతో తను కలిసి రావడం చూసి నా ప్రాణం లేచి వచ్చింది.. నేను ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ఆడుకోవడానికి దూరంగా వెళ్ళదు.. నన్ను క్షమించు అమ్మ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను.. తను ఆడుకుంటూ ఎవరో ఒక అతనుతో వెళ్లడం మా చెల్లి చూసి నాకు చెప్పింది.. లైంగిక దాడి చేయాలని ప్రయత్నం చేసే లోపే చుట్టూ ప్రక్కల ఉన్న జనం మేలుకున్నారు.. తనకి అర్థమయ్యేలా చెప్పాలి కానీ కోపంతో చెప్పకూడదు.. ఎవరి మాటలు నమ్మకూడదు.. ఇకనుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని…
Read More