mamidala shailaja

నిరీక్షణం

నిరీక్షణం భగవంతుడా... ఎందుకిలా చేశావ్... నేను ఇమడలేని ప్రపంచంలోకి.. నన్ను నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చి పడేసావ్.. ఈ కంటకావృతమైన మార్గంలో.. కాంతి శూన్యమైన చీకటిగుయ్యారంలో... ఏకాకిలా నేను... ఎలా పయనించాలి? నా అలుపును తీర్చి‌, చమటను తుడిచి... ఓదార్పు మాటలతో... చుట్టేసే వాళ్ళు ఎవరూ లేరు... ఈ నైరాశ్యపు నిబిడాంధకారంలో.... నీతో నేనున్నాను... అనగలిగేవాళ్లే లేరు.,. నాతో నేను యుద్ధం చేస్తూ.. గెలుపేలేని ముగింపు కానరాని... చావుపుట్టుకల నిరంతర వలయంలో.. కొట్టుకులాడుతూ... దిగంతాలలో దృష్టి సారించి.... నీ కడసారి పిలుపు కోసం ఆర్తిగా ఆర్థిస్తున్నా... వేగిరమే నా అస్తిత్వానికి .. స్వస్తి పలకమని.... - మామిడాల శైలజ
Read More

అనివార్యం

అనివార్యం కనికరం లేని కాలం... కానుకగా ఇచ్చిన... శిధిల జ్ఞాపకాలు.. నిషీధి లాంటి నా హృదిని.. ముళ్ళ పొదళ్ళా చుట్టుకొని.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా.. నిరతం నీ ధ్యాసలో... నిను చేరే క్షణం కోసం.. అనుక్షణం పరితపిస్తూ... తెగిన గాలిపటంలా... అస్థిమితమైన... మోడు లాంటి జీవితాన్ని.. ముందుకు నడిపిస్తూనే ఉన్నా... ఎందుకంటే... అప్రమేయంగా అందిన.. అనివార్యమైన... ఈ బతుకు నాటకాన్ని.... చివరికంటా... అభినయించి వెళ్లాలని.... - మామిడాల శైలజ
Read More

ఎదురుచూపు

ఎదురుచూపు వస్తున్నావా నువ్వు..? ప్రియమారా నువ్వు నా దరికి చేరే.. అపూర్వ క్షణం కోసం.. తరతరాలుగా, యుగయుగాలుగా.. కొడగట్టుకు పోతున్న ఆశలకు... కొత్త ఊపిరిలు అద్దుతూ... వేచి చూస్తున్న నాకోసం... ఆధిపత్యపు భావజాల నిగలాలను చేదించుకొని.. ఆర్తిగా హత్తుకోవడం కోసం.. ఇకనైనా వస్తున్నావా నువ్వు..? అర్ధాలు: నిగలాలు: సంకెళ్లు. ప్రియమారా: ప్రేమగా.. - మామిడాల శైలజ
Read More

లిప్తకాల జీవితం

లిప్తకాల జీవితం ఈ అనంత చరాచర సృష్టిలో.. అణువణువు నీ హస్తగతమే... అమేయమైన ఈ ప్రకృతిలో... ప్రతిపదార్థము నీ పాదక్రాంతమే... సమస్త విశ్వాన్ని గుప్పిట బంధించి.. సకల జీవకోటిని.. పోషించి ఆక్షేపించి నిర్దేశించే... జగన్నాటక సూత్రధారివి.. జగద్రచనా అధ్యక్షుడివి.. అనివార్యమైన జనన మరణ చక్రంలో... అధ్యంతాలే గోచరించని నీ అద్భుతమైన యోగ మాయలో.. నేను ఒక పాత్రధారిని. నా ప్రమేయం లేకుండానే అందిన.. ఈ చిరు ఉనికికి ఆశల పుప్పడి అద్దుకొని.. ఆత్మీయ రాగాలను ఆలపించాలని.. ఆత్రపడే గాత్రధారిని.. అలాంటి ఈ అర్బకురాలిపైన.. ఎందుకు నీ శీతకన్ను..? నీవు బిక్షగా ప్రసాదించిన లిప్తకాల జీవితంలో కూడా... ఆనందాలను విలుప్తం చేసి... నా బతుకు ఆటను ముగించాలనే.. వికృత క్రీడా వినోదం నీకేలా? - మామిడాల శైలజ
Read More

మంచు దుప్పటి

మంచు దుప్పటి ప్రచండమైన కిరణశరాలతో.... మంచు దుప్పటి మరుగున... మత్తుగా మునగదీసుకున్న... మర్త్యలోకాన్ని... మేల్కొలిపిన ఆదిత్యుడు... క్రమక్రమంగా... పగలుకు వీడ్కోలు పలికి.. సంజె సోయగాల.. అరుణిమ లోంచి... నిశ్శబ్ద నీరవంలోకి మారుతూ... సవ్వడి లేకుండా సన్నగిల్లిపోతున్న.. ఉన్న ప్రతి సాయంకాలం... ఆశ నిరాశల నిరంతర వలయంలో.. నలిగి విసిగివేసారిన నా మది... ఆత్మవలోకనం చేసుకుంటుంది. మంచు దుప్పటిని... ఛేదించుకొని వచ్చే.. రేపటి మనోజ్ఞమైన... తుహిన కిరణాల కాంతులను.. మళ్లీ చూడగలనో లేనో అని... - మామిడాల శైలజ
Read More