nalo nenu

నాలో నేను

నాలో నేను 1) వృద్ధ గురువులంత ఒకచోట చేరగా     పాత జ్ఞాపకాలు పరిమళించె     అయ్యవారలంత ఆయురారోగ్యాల     సాగవలయు శాంతి సౌఖ్యములతొ 2) ఉగ్రవాదమింత ఉగ్రరూపము దాల్చి      బడుగు వర్గములను బలిని గోరె      బడుగుజీవులనిల బాంబు పేలుళ్లతో      ప్రాణములనుదీయ పాడియగునె 3) పండుగ దినమందు పస్తులుండాలేక      కూలిడబ్బుతోటి కొట్టుకెళ్ళి      ఉప్పు.పప్పునుకొని ఉల్లిపాయడిగితే      ఆకసమునకేగి హాస్య మాడె 4) చెప్పు మాట యొకటి చేసేది వేరగు      నాయకులను నమ్మి నాశ మవకు      గొర్రెమంద రీతి గోతిలపడబోకు      ఎసరు వచ్చినంక ఏడ్చుటేల? - కోట
Read More

నాలో నేను

నాలో నేను నాలో నేను తెలుసు కున్నది రవ్వంత తెలుసు కోలేనిది కొండంత ప్రతిరోజూ అంతరంగాన్ని ప్రశ్నించుకో నీవంటేనీకు తెలుస్తుంది మరి ఎద లోపలి గది తలుపులు తీసి చూస్తే మనసు మౌన గీతమై పాడుతుంది కనుల కాంతుల కు తెలుసు నిజమేదో అని ఊగిసల ఊహలు ఆపుకో నిన్ను నీవుగా తీర్చి దిద్దుకో కాలం రంగుల రాట్నం అని తెలుసుకో మాటనుమంత్రంగా మార్చకో అవకాశాల హర్మ్యాలు కట్టుకో సమస్యల సంఘర్షణ చూసుకో ఆశించని ఆరాధన నేర్చుకో ఆశల హద్దులు రాసుకో అనుభవాల సాంగత్యం పట్టుకో నీతిని నీ అండన ఉంచుకో పరిమళాల విరజాజులు చుట్టుకో అందని ఆవేదన తగ్గించుకో అందినన్ని అద్భుతాలు సృష్టించుకో ఒంటరి భాటసారి గా ప్రేమ ప్రయాణం తేలిక అనునిత్యం ఆత్మానందం పొందుతూ నాలో నేనుగా రా రాజుగా బ్రతకడం వుందిగా మరి ... - జి జయ
Read More