ప్రేమ
ప్రేమ ప్రేమ ఎప్పుడూ ఎలా ఎవరికీ పుడుతుందో తెలియకపోవచ్చు కానీ ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ అందంగానే కనిపిస్తాయి. తప్పులన్నీ ఒప్పులుగా, ఒప్పులన్నీ సరదాగా సాగుతాయి. కొన్నాళ్ళు గడిచాక అసలు రూపాలు బయట పడతాయి. తప్పులు ఎంచుతూ ఒప్పులని కూడా తప్పుగా చూపిస్తూ ద్వేషం పెంచుకుంటూ, ఒకరికొకరు ఆకర్షణ అనే మోజు నుండి బయటకు వచ్చి నిజాలను గ్రహించే లోపు జరగాల్సింది అంతా జరిగిపోతుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా శూన్యమే తప్ప ఇంకేమీ కనిపించదు. నిజమైన ప్రేమకు ఇవేవీ అడ్డు రావు. - భవ్యచారు