ram bantu

చావు

చావు చావు ప్రామిసరి పత్రం కాదు తీర్చలేని బాకీ జన్మను అప్పిచినవాడు మృత్యువును పంపాడు మిత్తిని తీసుకరమ్మని వడ్డీ కడుతూ బతుకును ఎంత లాగినా అసలు మట్టికి కట్టాల్సిందే ఎగొట్టలేని ఋణం ఎన్నాల్లకైనా , ఎక్కడున్నా పంచభూతాలకు చెల్లించాల్సిందే కుదువ పెట్టుకోకుండా ఊపిరిని నీ ఖాతాలో జమ చేశాడు గడువు ముగిసింది ఇచ్చేయాల్సిందే. - రాంబంటు
Read More

అ – నువ్వు

అ - నువ్వు పాల తరగలి, నురగుల ని నవ్వు. నీలి మబ్బుల అలకనంద నువ్వు. నీటి బిందువు అణువుల అందం నువ్వు. నూరు వరహాల బోమ్మవి నువ్వు . కోటి శతకాల అర్ధం నువ్వు .. తామరాకుపై తెంపర నువ్వు.. గాలిలోని సుమగంధం నువ్వు.. మండు వేసవి చల్లదనం నువ్వు . అంతరంగలోని అద్దం నువ్వు. అర్ధరాత్రి చీకటి నువ్వు .. విశ్వమంత వెన్నెల నువ్వు .. పాపాయి నిదురలోని రాగమాలిక నువ్వు. - రాంబంటు
Read More

జీవిత కాలం

జీవిత కాలం వీరెవరికీ, తెలియని, వినపడని, కనపడని ఎవరో వ్రాసిన కథలోని పాత్రలు వీరు ఎవరో ఆడుతున్న చదరంగంలో పావులు వీరు! తెలియని తెలుసుకోలేడు జీవితకాలంలో మనిషి ఆ కధ రాసింది ఎవరు ఆ ఆడించేదేవరు ఎవరిదీ మాయ ఏమిటి ఈ మాయలోకం చేదించటానికి సరిపోదు మనిషి జీవితకాలం -రాం బంటు
Read More

జన్మ

జన్మ అమ్మ బిక్ష ఈ జన్మ అమ్మ త్యాగం ఫలం ఈ జీవితం అమ్మ ఆశీర్వాదం ఈ ప్రగతి ప్రస్థానం అమ్మ రెండక్షరాల పదం అమ్మ నిస్వార్థ ప్రేమకు నిర్వచనం అమ్మ పసిగుడ్డుగా గర్భంలో బాధించినా ఎదిగాక అజ్ఞానంతో ఎదిరించినా చిరునవ్వుతో ఓర్చుకునే సహనశీలి అమ్మ కన్న బిడ్డ పుస్తకాలు కోసం స్ట్రీకి ప్రాణప్రదం అయిన పుస్తెలు అమ్మడానికి సైతం సిద్ధం అమ్మ ప్రేమని మించింది అవని పై లేదు అమ్మ అనురాగం నిరుపమానం అమ్మ త్యాగం అనితర సాధ్యం రామకోటి కంటే అమ్మ కోటి వ్రాయడం గుడిలో విగ్రహం కంటే ఇంట్లో అమ్మను పూజించడం శ్రేష్టం అలా చేయడం అమ్మ ఇచ్చిన జన్మకు కొంతైనా సార్ధకత ప్రాప్తిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం! - రాం బంటు  
Read More

నేటి సమాజం

నేటి సమాజం పుట్టింట్లో తానో బంగారుబొమ్మ అత్తారింటికి చేరగానే అయింది ఆటబొమ్మ ఎన్నో ఆశలతో కావాలనుకున్న జీవితం బ్రతుకంతా అయింది విషాదం ఎవరికి చెప్పుకోలేక.. ఏమి చేయలేక.. తనలో దాచుకోలేక.. గుండెల్లో కన్నీటి సంద్రాన్ని దాస్తూ.. పెదాలపై ప్లాస్టిక్ నవ్వులు పూయించే అతివలెందరో నేటి సమాజంలో! - రాం బంటు
Read More