ramakuri

భారమైన బాల్యం

భారమైన బాల్యం అల్లారుముద్దుగా పెరగాల్సిన బాల్యం.. అజరామరంగా అలరించాల్సిన బాల్యం.. కష్టసుఖాల కడలిలో ఈదుతున్న బాల్యం.. శ్రమకు ఆహరమైన బాల్యం.. అన్నపానీయాలు నోచని బాల్యం. చేయూత కు కరువైన బాల్యం.. భారమైన బరువుకు బలైన బాల్యం. రాళ్ళు రప్ప ల మధ్య నలిగిపోతున్న బాల్యం.. కర్మాగారాల పాలైన బాల్యం. ఇంతలా భావి భారతాన్ని హరిస్తున్న ఈ బూటకపు సమాజం తప్పక చెల్లించును మూల్యం.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

సంతృప్తి

సంతృప్తి ఏది సంతృప్తి..... ఎక్కడ సంతృప్తి.. సనాతన వైదిక భారతంలో నవయువ నూతన భారతంలో వజ్రోత్సవాల నవీన భారతంలో ఏది సంతృప్తి.... ఎక్కడ సంతృప్తి.. అన్నింటా వర్గాలు పెరిగిపోయాయి.. అందరూ అన్నిరకాలుగా విడిపోయారు. భారతీయతను బంధీ చేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని.. చిన్నాభిన్నం చేశారు ఏది సంతృప్తి.... ఎక్కడ సంతృప్తి... ఓ పక్క కులాల కుమ్ములాట.. మరోపక్క మతాల ముసుగులాట ఇంకోపక్క ప్రాంతాల పీకులాట.‌ ఏది సంతృప్తి... ఎక్కడ సంతృప్తి.. ఆ రంగం..ఈ రంగం..ఏ రంగమైనా.. మావాడు.. మీ వాడు..ఎవరివాడైనా సరే.. తన మన భావజాలం మరచిననాడు. స్వార్ధాన్ని మరచి దేశాన్ని ప్రేమించిన నాడు.. నిజమైన సంతృప్తి... అసలైన సంతృప్తి.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

ఓటు – నీవెటు

ఓటు - నీవెటు మానవుడు వేసే అతి పవిత్రమైన ఓటు.. అరాచక రాజకీయాలకు వేయాలి వేటు.. నిరంకుశ పాలకులకు అది పేదవాని కాటు.. అప్రజాస్వామ్యానికది సాధారణ మానవుని బల్లెం పోటు.. క్షణికావేశంలో, అస్పస్టతతో వేసే ఓటు.. కుల మత వర్గ స్వార్ధాలతో వేసే ఓటు.. మద్యం మత్తులో, ధన దాహంలో వేసే ఓటు.. వేయునా. మన బ్రతుకు గండికి మాటు.. అది తీర్చునా సమస్యల పరిష్కారాల లోటు.. అందుకే..ఆలోచించు రవ్వంతపాటు.. మంచి నాయకుణ్ణి చేయండీ ఈ సమ సమాజానికి సామ్రాట్టు.. అందుకనే అందరం వేయాలి ఓటు.. మన కలల తీరేట్టు.. భావి భారతం బాగు పడేటట్టు.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

ఓ యువతి.. అందుకో నా అక్షర హారతి..

ఓ యువతి.. అందుకో నా అక్షర హారతి.. ఎవరికోసమా చూపులు.. వినిపించాయా నీ లోలోపలి పిలుపులు.. తెరచుకున్నాయా నీ ప్రియవారల హృదయ తలుపులు.. నీ మనసులోని మౌనరేఖలు.. కనబడుతున్నాయి నీలోని రహస్య ఛాయలు. ఆపై అర్థమవున్నాయి నీ భావనలు.. నీ మోముపై నవ్వు చూడాలి.. నా మనసు కుదుట పడాలి.. నీవనుకున్నది నీకు కలగాలి.. నేననుకున్నది నాకు కలగాలి.. ఆపై ఇద్దరం ఈ జగాన్ని మరవాలి... నిజం చెప్పు... నా కోసమేనా నీ వెతుకులాట... లేక.. అందని నేటి శ్రీరామనవమి పానకం కోసమా..?? - కిరీటి పుత్ర రామకూరి
Read More

బాల కార్మికులు

బాల కార్మికులు బంగారు జీవితం..బొగ్గులమయం పసి హృదయాలు.. వెట్టిచాకిరి కి నిలయాలు వికసించని లేలేత మొగ్గలు.. పూర్తిగా ప్రకాశింపని రవి కిరణాలు ఆపన్నహస్తాలకై గగ్గోలు.. ఏ ఆపద్భాందవుడైనా చెవి యొగ్గేనా.. సరస్వతి కటాక్షం కరువై.. కుటుంబ జీవితం బరువై.. బానిసత్వం శాపమై.. ముక్కుపచ్చలారని మల్లె వంటి జీవితం నిరంతర శ్రామికవాడలకు అయ్యింది అంకితం.. బంగారు పాపలు.. రేపటి దేశపు వెలుగులు. నేడు శ్రమలో కాలుతూ.. తమ కుటుంబానికి వెలుగునిస్తూ ఆద్యంతం నలిగి రగులుతున్న బాల్యం.. ప్రశ్నార్థకమైంది దేశ భవిష్యత్తు.. ఎప్పటికి మారేనో ఈ జగత్తు.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

భాద్యత

భాద్యత బాధ్యత అనగానే వెంటనే వచ్చేవి.. మన మదిని పలు విధముల తొలిచేవి... ఏమిటి బాధ్యత....??? ఎవరికి బాధ్యత....??? ఎందుకు బాధ్యత....??? ఎలా ఈ బాధ్యత....??? అవసరమా బాధ్యత....??? ఎక్కడ దొరుకుతుంది ఇది ఎంతకు దొరుకుతుంది ఇది అందుకని... సహృదయంతో ఇలా ... ఓ అమ్మని అడుగుదామా... ఓ నాన్నని అడుగుదామా... ఓ గురువు ని అడుగుదామా... ఓ నాయకుడిని అడుగుదామా... ఓ సంఘసంస్కర్త ని అడుగుదామా... ఓ దేశ పౌరుడి ని అడుగుదామా... చివరిగా ఓ సిపాయి ని అడుగుదామా... అన్నింటికీ మించి ఓసారి మనల్ని మనం అడుగుదామా.. ఎందుకంటే.. బాధ్యత అనేది అందరి బాధ్యత... ఏ ఒక్కరు తమ బాధ్యత లను విస్మరించినను అంతా భస్మమగును.. ఆపై జీవితం సమాప్తమగును... - కిరీటి పుత్ర రామకూరి 
Read More