ravi peesapaati

అక్క-కోట్ల సంపద లెక్క

అక్క-కోట్ల సంపద లెక్క నా దృష్టిలో అక్క అంటే.... మనం పుట్టిన క్షణం నుంచి తోడుండే తొలి నేస్తం తన తమ్ముణ్ని ఎవరూ ముట్టనివ్వని తియ్యటి స్వార్థం మా తమ్ముణ్ణి ఆడనిస్తేనే నేను ఆడతాను అని జట్టు కట్టగల ప్రేమ తమ్ముడి కోసం తనకు ఇష్టమైన వాటిని వదులుకోగల త్యాగం తాను ముందు నడుస్తూ మనకు దారి చూపే మార్గదర్శి మంచి, చెడులు వివరించి మంచిదారిలో నడిపించే బాధ్యత. మన బలాలు, బలహీనతలు తెలిసిన స్నేహితురాలు. మనం తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం అక్క అంటే. తప్పులు మన్నించి దగ్గరకు తీసుకునే మమకారం మన విజయాలకు పొంగిపోయే అభిమానం కష్టాల్లో నేనున్నాను అని ఆదుకొనే ధైర్యం. రాఖీ కట్టినా, యమ ద్వితీయకు భోజనం పెట్టినా తమ్ముడి క్షేమం కాంక్షించే చల్లని దీవెన. తమ్ముడి ఇంట వేడుకను అంతా తానై నడుంకట్టి జరిపించే సందడి. వదిన వచ్చాక అన్న మారిపోతాడేమో కానీ, తాను…
Read More

సామ్రాజ్యం ప్రేమలేఖ

సామ్రాజ్యం ప్రేమలేఖ ప్రేమలేఖ రాయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. పాత కాలంలో ప్రేయసీ, ప్రియులు తమ మనసు మరొకరికి తెలియచేసేందుకు ఇదొక్కటే సాధనం. అన్ని ప్రేమలేఖలు సినిమాల్లో చూపించినట్లు సాహిత్యంతో ఉంటాయని చెప్పలేం. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణను ప్రేమగా భావించి రాసే లేఖలు కొన్ని రాసే వారి అమాయకత్వాన్ని తెలియచేస్తే, కొన్ని లేఖలు హాస్యాన్ని పండిస్తాయి. అలాంటిదే మా సామ్రాజ్యం ప్రేమలేఖ. దాదాపు పాతికేళ్లకు ముందు నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటిది ఈ సంఘటన. మేమంతా మా పల్లెటూరినుంచి పక్కనే ఉండే పట్టణానికి వెళ్లి చదువుకునే వాళ్లం. పొద్దున్నే అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఒక ఇరవైమంది మా ఊరి నుంచి వెళ్లే ఒకే ఒక బస్సులో వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళం. మా గుంపులో సామ్రాజ్యం మాకన్నా ఒకటి రెండేళ్లు పెద్దది. తను పదో తరగతిలో ఉండేది. తన చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో వాళ్ల అమ్మ పొలం పనులు…
Read More

సృష్టి

సృష్టి మధువులు చిందే మధుమాసం జలజల పారే జలపాతం పువ్వుల నిండిన మకరందం ముచ్చటగొలిపే నెమలందం మహోన్నతమౌ హిమశిఖరం భీతినిగొలిపే నడి సంద్రం హాయిని నింపే సుమగంధం అంతే తెలియని ఆకాశం పక్షులు, పశువులు, వన సంపదలు తరుణి, హరిణి, పగలు, రేయి ఊహకు చాలని అందాలెన్నో సృష్టించాడు ఆ దైవం - రవి.పీసపాటి
Read More

కాలం నేర్పే పాఠాలు

కాలం నేర్పే పాఠాలు ఆకాశాన్నంటే ఆశలు, భూమిని దాటని బ్రతుకులు. చాలీ చాలని జీతాలు, అటూ ఇటూ కాని జీవితాలు.   అడుగడుగునా సమస్యలు, బయట పడని భావోద్వేగాలు. కట్టిపడేసే బాధ్యతలు, వదిలిపోని ఆత్మాభిమానాలు.   నెల నెలా వేసే చిట్టీలు, నెల చివర్లో అప్పులు   దడపుట్టించే ధరాఘాతాలు, సర్దుకుపోయే మనస్తత్వాలు. తన వారికోసం త్యాగాలు, దొరికిన దాంట్లో సర్దుబాట్లు. తాను చేరలేని గమ్యాలు, తన పిల్లలు చేరాలని ఆరాటాలు.   ఆప్యాయతలు, అనుబంధాలు, మరపుకు రాని మనోగతాలు.  రేపటి గురించి భయాలు, మనుగడ కోసం పోరాటాలు.  కాలం నేర్పే పాఠాలు, అంతే లేని ఆలోచనలు. ఎడారిలో ఎండమావులు,  ఇవే  మధ్యతరగతి మనిషి లక్షణాలు. - రవి పీసపాటి
Read More