shramaika jeevitham aksharalipi

శ్రమైక జీవితం

శ్రమైక జీవితం శ్రమలోనే ఆనందం వెతికినా శ్రమ శక్తికి విలువకట్ట గలమా! శ్రమజీవులవెతలు తీరేదెప్పుడు మట్టి అంటినచేతులకు తెలుసు శ్రమ శక్తి సామర్ధ్యం ఏమిటని పరిశ్రమలైనా ప్రాజెక్టులైనా వ్యవసాయమైనా చేతివృత్తు లైనా శ్రమను ధారపోయడమే కూలీ నాలీ చేసేది కుటుంబ పోషణకు మాత్రమే శ్రమ జీవుల చేతులు కదిలితేనే అందరి అవసరాలు తీరేది కష్టజీవుల చమట చిందనిదే సమాజపు పురోగతి లేదు ఆకలిభాదనుఅదికమించడానికి కరువు కాలమైనాకష్టకాలమైనా పెట్టుబడి మాత్రం శరీర శ్రమే కలలు కూడా కదులుతూనే వేతనానికి అవసరాలకు మధ్యన యుద్దమే అనునిత్యం ప్రతీరోజూ ప్రపంచము ముందు ఎప్పటికీ మరమ్మత్తు లేని యంత్రం శ్రమజీవులే మరి.....? - జి జయ
Read More

శ్రెమైక జీవితం

శ్రెమైక జీవితం బతుకంతా భారంగా మారుతుంటే బండరాళ్లలో రక్తం ఇంకి పోతుంటే చేతులని బండ బారుతుంటే డోక్కలన్ని ఎగసి పడుతుంటే ఆయాసం తో గూల్లు ఎగురుతుంటే సూర్యుడు నడి నెత్తిన నిప్పులు చెరుగుతుంటే కడుపు లో పేగులన్ని ఉండ చుట్టుకుపోతుంటే ఏముకలు తేలిన చేతులతో బరువైన సుత్తి చేబట్టి గంజీ నీళ్లయినా దొరుకుతాయని ఆశతో, ఎడారిలో పక్షిలా ఎదురు చూస్తున్నా ఆశ తో.... - భవ్యచారు
Read More