తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి జగతికి వెలుగువి నీవే మా జీవనగతివీ నీవే ఏడుకొండలను దాటి మా హృదయకోవెలను చూడు చరణం కలియుగమందున వెలసీ కష్టాలన్నీ తీర్చీ బతుకే కానుక చేసి బాధ్యత మాకు నేర్పే బంధువు నీవేనయ్యా చరణం చిరునవ్వుతో మములను చూసి వింతలు వంకలు చూపి తోడుగ మాకు నిలిచే సుందర రూపము నీదే చరణం కలలే లేని మాకు కలతలు మాత్రం మిగిలె కొండల రాయుడు ఉంటే సకల శుభములు కలుగు చరణం నిను చూసే భాగ్యము లేక తపియించితిమయ్యా మేము కన్నీరే చిందగ మేము పిల్లలమైతిమి స్వామి నిను చూసే భాగ్యం కోసం నీ జాడను వెతికేమయ్యా - సి.యస్.రాంబాబు