uma maheshwari

ప్రకృతి కాంత

ప్రకృతి కాంత పచ్చని పరువాలను చుట్టుకున్న ప్రకృతి కాంత మార్గశిరం రాకతో వణుకుతూ గజగజల చలిగాలి చల్లని మలయమారుతంలా విసరుతూ ప్రజని ఉలిక్కిపడేలా చేస్తుంది గడగడలతో... ఆ పచ్చని పరువాలకి అలంకారంలా రేయంతా మంచుబిందువులు అల్లుకుంటే చూసే కనుదోయికి తెలియని ఆనందం నింపుతూ వెన్నెల కాంతిలో తళుకులీనుతుంది నిశీధి రేయిలో తాకగా ఝల్లున మదిని తడుతుంది ఉషోదయాన నునువెచ్చని కిరణాలు ప్రసిస్తూ భానుడు ఉదయిస్తుంటే ఆ కిరణాల తాకిడికి మరింత ప్రకాశింపచేస్తూ ఆనందం పంచుతాయి వేడెక్కిన సూర్యకిరణాలు తాకగానే జర్రున జారిపోతుంది తామరాకుపై బిందువులా మంచు దుప్పటిని తొలగించుకున్న ప్రకృతికాంత‌ - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

విషబీజాలు

విషబీజాలు లాలియనుచు జోలపాడ నిద్ర పోవు చిన్నారులు! చందురుణ్ణి పిలువగనే మురిసిపోవు చిన్నారులు! తల్లిపాలు త్రాగుచూనె రొమ్ముతోన ఆడేరుగ! తల్లితనము పూర్తిగాను మరచిపోవు చిన్నారులు! ఎదురుతిరిగి చరించుచూ ఆడేరుగ స్ర్తీలతోను! మృగాళ్ళుగా మారిపోయి కూడేరుగ స్ర్తీలతోను! ఆడదనగ మాతృసమము తెలుసుకోవు ఏనాడూ విషబీజము మదినింపుకు తిరిగేరుగ స్ర్తీలతోను! - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

కరువైన మనశ్శాంతి

కరువైన మనశ్శాంతి సంధ్య ఇలా అయితే ఎలానే... ప్రాణమంటూ పెళ్ళి చేసుకున్నావు.. ఓక్షణమైనా విడిచి ఉండలేను అన్నావు. ఇపుడేమో అసల ఆ మనిషి ముఖం చూడను అంటున్నావు. ఇలా చెప్పాపెట్టకుండా వచ్చి గుండెల్లో బుల్లెట్స్ పేల్చుతున్నావేంటే... అంటుంది తల్లి సుధ. అవునమ్మా ఇంతకు ముందులా లేడమ్మా సుధాకర్. బాగా మారిపోయాడు. ప్రతీది ప్రశ్నిస్తున్నాడు. ఇది ఎందుకు ఇలా చేసావ్.. నిన్నెవరు డ్రాప్ చేసారంటూ ఆరాలు, అనుమానాలు నావల్లవట్లేదు అమ్మా... చూడమ్మా సంధ్య భర్తన్నాక ఆ మాత్రం వివరాలు అడుగుతారు. దానికి నువ్విలా వచ్చేయడం.. తిరిగి వెళ్ళను అనడం బాలేదురా... ఒకసారి ఆలోచించు అంటుంది సుధ. కానీ సంధ్య ఇపుడేమీ ఆలోచించే స్థితిలో లేదు. సుధ భర్తకి పోన్ చేసి జరిగినది అంతా చెబుతుంది. భర్త అంతా విని సరే సాయంత్రం ఇంటికి‌వచ్చాక మాట్లాడతాను. నువ్వేమీ అనకని చెప్పి పోన్ పెట్టేస్తాడు. చేసేదేమిలేక వంటింట్లో కాఫీ కలపడానికి వెళుతుంది సుధ. సంధ్య తలస్నానం…
Read More

నగుమోము

నగుమోము ఆ నటనం ఎందరి పెదవులకో నవ్వుల వరమిస్తుంది... ఆ వదనం మరెందరి మనసులనో తేలిక పరుస్తుంది... చూడగానే హాస్యం పంచే ఆకారమది.... ఆహార్యపు ఆటలతో సంతోషం నింపునది... దాచుకున్న ముఖానికి పరదావంటిది... కన్నుల్లో దాగిన వేల నిశీధులు కానలేము... అసలు ముఖము కానక సంతసించేము... తినను తిండి లేకున్నా నవ్వించడం మరువడు... కష్టాల కడలి ఈదుతున్నా మనల్ని నిరాశ పరచడు... జోకర్ గా నవ్విస్తూ నవ్వులపాలవుతుంటాడు.... మది మెచ్చి మనసారా నవ్వించు ముఖం.... నిశీధి కడలిలో ఆతని నివాసం... నవ్విస్తూ మురిసిపోవు వృత్తి అతనిది.. ఆ నవ్వే కరువైన జీవితం వాస్తవమిది... నిజమే ప్రతి నవ్వు వెనుక ఎన్ని విషాధాలో... ఏ నవ్వులో ఏ చీకట్లు దాగున్నాయో... ఏ నగుమోములో ఎన్ని విషాధాలున్నాయో.... ఏ జీవితం వెనుక ఎన్నెన్ని కడలి అలలు ఎగసిపడుతున్నాయో.... చూసేదంతా నిజం కాదు మరి వాస్తవమింకో సత్యం... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

నీ మాయలో బంధీలమే!

నీ మాయలో బంధీలమే! చిన్న కణమే ఆయువు నింపుకుని నవమాసాల వ్యవధిలో బాహ్య ప్రపంచానికొచ్చి అనేకానేక సందర్భాలకి తగినట్లుగా ఎదిగి సుఖం దుఃఖం‌ అనే ఛట్రంలో పడి తిరుగుతూ బంధాలలో బంధీలయిపోతూనే మరుక్షణం ఒంటరులయిపోతూనే నీవాడే చదరంగంలో పావులమైపోతాము ప్రేమానురాగాలను పెనవేసుకుని ఆనందించేలోపు దూరంచేసే ప్రేమలకి అలవాటుపడలేక ఏడుస్తుంటాము కష్టాల కడలిని‌ ఈదలేక ఈదుతూ దరికి‌చేరేలోగా సృష్టించే ఆటంకాలకకి జడిసి మధ్యలో కథ ముగించుకుంటుంటాము ఇంకొన్నిసార్లు కసిగా పోరాడి ఫలితం‌పొంది ఆనందిస్తాము అంతలోనే ఏదోక నష్టాన్నిచ్చి నవ్వేస్తుంటావు ఇలా నీవాడే చదరంగంలో పావులుగా... కపట నాటక సూత్రధారివైన నీ మాయలో బంధీలమై బంధిఖానా వంటి‌ ఈ శరీరంలో చిక్కుకుని అనేకానేక అవస్థలలో పుడుతూ చస్తూ ఉంటాము జీవులుగా శాంతిలేక చస్తూనే పుడుతుంటాము నీ మాయలు తెలియ తరమా లీలా మానసచోరా! - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

సార్ధకత చేకూరిన క్షణం

సార్ధకత చేకూరిన క్షణం నిత్యం చేసే జీవనయానంలో తారసపడే అమానవీయ ఘటనలెన్నెన్నో రోజూ చదివే దినపత్రికలు మోసుకొచ్చే అఘాయిత్యాల అకృత్యాలెన్నో ఇంటి నుండి బయటకి రాగానే తారసపడే ఆకలికై అలమటిస్తూన్న అభాగ్యులెందరో కారణాలేవైనా నడిరోడ్డున పడ్డ మధ్యతరగతి జీవితాల చేదు అనుభవాల సంఘటనలెన్నెన్నో కులమనీ మతమనీ ప్రాంతమనీ వేర్పాటువాదుల విధ్వంస చిత్రణలెన్నో చుట్టూ సభ్యసమాజంలో కనులముందే జరిగినా నాకెందుకనుకునే మనుషుల నడుమ అనాధల ఆర్తనాధాలని మనసుతో వింటూ చేయూతనిచ్చు స్థోమత లేకున్నా సాయం చేస్తూ ఉన్నంతలో పక్కమనిషికి సాయమందించిన క్షణంలో మనసున కలిగే ఆనందం అనుభవైకవేధ్యమే అపుడు ఆ క్షణాన మనిషి జన్మకు సార్ధకత లభించినట్లే... నీ జన్మకు పరమార్ధం చేకూరినట్లే... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ఆమని మనదే సుమా!

ఆమని మనదే సుమా! నిత్యం కనుల కుహరాన నెలవై ఉంటావు అడుగడుగునా నాకై తపిస్తుంటావు ఎంత వెదికినా అందాలకి కొదవ రానంటావు ఇలకు దిగిన వెండి‌చందమామ నంటావు నెచ్చెలీ! ఏనాటి పుణ్యమో నీ సఖుడనైతినిగా... అనుక్షణం తపించే నా తపనను కానరావా నీకై పరితపించే నీ సఖుని‌ బాధ మాన్పగ రావా ఎడారి గుండెలోన కలలే ఫలించి అలమటించే నా హృది వేదన తీర్చగ రావా ప్రాణ సఖీ! నీ నాధుడ నేనంటిని‌విగా.... సఖా.! నే నీ నెచ్చెలినే వేచియుంటి గత స్మృతుల తలపులే ప్రాణముగా నిను చేరి సుఖించు క్షణాలు లెక్కిస్తూ కోరివచ్చె కొమ్మ దరిచేరి ఏలుకోమ్మ నీ ముంగిట చేరి మైమరచిపోయెద సఖా! ఎడబాటులెరుగని కాలాలు మనవవగా కలతలెరుగని అనుబంధమవగా తరలి వచ్చిన నీ హృదయేశ్వరిని ఏలుకొని సుఖమయ జీవనమున తరియించెదము చెలికాడా ఆరు ఋతువులేకమైన ఆమని మనదే సుమా - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

పగబూనకే….!

పగబూనకే....! ఎంతజాణవే నెరజాణవే... ఎంతని చెప్పను ఆగడాలను... ఎవరికి చెప్పను నీ బండారాన్ని... మనుషుల్లో మృగాలైన‌ మగాళ్ళైతే.... ఆడా పెచ్చుమీరిపోతున్నారు హవ్వ... ఎంత శుభ్రం చేసినా ఏమూలన దాగుంటావే వగలాడి... కంటికి కానక ఒళ్ళంతా తూట్లు పొడుస్తావు... కుట్టి‌కుట్టి‌ కందిపోయేలా వేసి దురదపుట్టిస్తావు... నీవొకచోటుంటూ దురదింకోచోట పుట్టిస్తూ... దోబూచులాటలేమిటే నంగనాచీ... కమ్మని కలలో నేనుంటే గుయ్యని నీ సంగీతాలేమిటే... చెవిలో నసపెట్టి కలలన్నీ కల్లలు చేస్తావు... నీకోసమని కాయిల్ వెలిగిస్తే అత్తరువాసనలా ఎంజాయ్ చేస్తావు... మాకేమో దగ్గులని బహుమానాలిస్తావా.... బుద్ధిలేదటే నీకు కుయుక్తుల కుంకా... ఎంతని‌ వేచి చూడను నీ ఆగడాలను... ఆకతాయిగా అల్లరులు చేస్తుంటే... నావల్లకాక టప్పున కొట్టానంతేనే... చటుక్కునచచ్చావు నాపై పగతీర్చుకోబోకు.... నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తానే‌.... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

శ్రమైక జీవన సౌందర్యం

శ్రమైక జీవన సౌందర్యం ఉదయ రవికిరణాలు భూమిని తాకకు మునుపే నిద్దురలేచి పరుగులు పెట్టే కూలీలు పట్టెడన్నమే పరమాన్నంగా పచ్చడిమెతుకులతో ఉరుకులు పరుగులు పెట్టుతు సాగిపోతారు పంట పండిస్తూ ఎండనక వాననక చీడపీడల ఈతిబాధలకు కృంగిపోక స్వేదం కరీదు కట్టే షరాబులేని లొకంలో ఆడుతు పాడుతు సాగిపోయేరు కర్షకులు సైరన్ కూత వినబడగానే పట్టెడు మెతుకులతో ఇంట ఇంతి అగచాట్లను వినకుండానే నిత్యం ఉండే స్తోత్రమేనంటూ సాగిపోయేవు ఒళ్ళొంచి దినమంతా కష్టించేందుకు హుషారుగా పాటలు పాడుతు సాగిపోతూ.... దినమొక గండముగా గడిచినా వెరవడతడు రోజు గడచుట కష్టమైనా చింతించడు కష్టమే తన శ్వాసగా ఆస్తిగా సాగిపోయేడు నిత్య కూలీగా మేస్త్రీగా బ్రతికేడు ఖార్ఖానాలో...ఓడ రేవులో... గనిలో...బడిలో... సమ్మెట పోటుల చెమటల్లోనా కరిగే కండల కాయకష్టంలోనా సౌందర్యమే వెతకి సాగిపోయేడు శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడంటూ....   - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

నీ నవ్వుకి సరితూగదు 

నీ నవ్వుకి సరితూగదు  నల్లని‌ దుప్పటి పరచుకుని అనంతమైన తారల తళుకుల్తో కాంతులు చిందించే నీలాకాశం ఎంత నీ వర్చస్సు ముందు! భయంకరంగా మెరుపులు మెరుస్తున్నా ఉరుములు ఉరుముతున్నా వెరవక సాగే నీ జీవనం ముందు చిన్నబోదా ఆ తారాలోకం! ఎగసి ఎగసి పడుతున్న అలలకి తడిసి తమకమున మునిగిన శిలలైనా కరగవా నవ్వే మోము వెనుక దాగిన కష్టాల కడలి ఆటుపోట్లకి! నిత్యవసరాలు లేకనే పూట గడవడం కష్టమైనా నిన్ను నీవు నమ్ముకున్న ధైర్యంచూసి నమ్మకమే నిశ్చేష్టితవక మానదుగా! వినీలాకాసపు పందిరి కింద లక్షల తారల తళుకుల వెలుగులో ధరిత్రి పీఠం‌మీద ఉనగనంతలో రాజసంగా బ్రతికేస్తున్న నీముందు ధనమే తలవంచదా! లేదని‌ చింతిస్తూ దుఃఖించకనే.. అత్యాసల కలలతో సతమతమవకనే దినము గడిచిన చాలు తృప్తి పడు నీ ముందు ఏదేమైనా పూట గడిచినది చాలను నీ ఆత్మస్థైర్యం ముందు చెదరక‌ విడువక నీ అధరాలకిచ్చిన నవ్వను కానుక ముందు వీధి…
Read More