vaneetha reddy

జై జావాన్

జై జావాన్ ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో నీ చేయి పట్టుకుని నీతో ఏడడుగులు వేసి నీ ఇంట్లో అడుగు పెట్టాను.. అనుకోలేదు ఏనాడు ఇంత మంచి మనసు కల వాడు నాజీవితం లోకి వస్తాడు అని.. నాతో నా చేయి పట్టుకుని నడిపించేవాడు అవుతాడని.. ఎంతో ఎదురు చూసాను.. నీ లాంటి ఒక మంచి తోడు నాకు రావాలని.. కానీ ఇంటిని ఆలిని వదిలి.. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. దేశ రక్షణే.. నీ ధ్యేయంగా.. దేశ గౌరవమే నీ లక్ష్యంగా... దేశం కోసం మాకు ఎక్కడో దూరంగా నీ ప్రాణాలు పణంగా పెట్టీ బతుకు తున్నావు .  నువ్వు క్షేమంగా ఇల్లు చేరాలని నీ కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నీ కోసం ఎదురు చూస్తున్న నీ భార్య... దేశం కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఇల్లు ఆలి పిల్లలు అని లెక్క చేయకుండా తన…
Read More

చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు.. ఎంతో ప్రేమతో.ఆనందం తో అసలు ఒకరి మీద ఒకరికి కోపం అనేది ఎలా ఉంటుందో కూడా తెలీదు... అందరికీ వారు ఆదర్శం లా కనిపించేవారు.. ఇలా ఉండాలి భార్య భర్తలు అంటే అనేలా ఉండేవారు. అలాంటి వారి దాంపత్యం లోకి ఒక వ్యక్తి అనుకోకుండా వచ్చాడు. ఎంతో ప్రేమగా ఉన్న వారి మధ్య దూరం పెంచాలని.. ఎవరి కన్ను పడిందో కానీ.. ఏనాడు..మొహం కూడా చిన్నబుచుకోని .ఆ దంపతులు కన్నీట మునిగారు... ఆ వ్యక్తి ఎలా అంటే వీరిద్దరి మధ్య వీరికి తెలియకుండా.. ఓ అనుమానం అనే పెనుబూతన్ని సృష్టించాడు.. ఆమె అందరితో కలవిడిగా ఉండేది.. అందరూ నా వాళ్ళే అనే స్వభావం కలది.. అందరినీ సోదర భావం తో చూసి కలిసి పోయేది.. దాన్ని ఈ మూడో వ్యక్తి తన భర్తకి చెడుగా సృష్టించి చెప్పేవాడు.. ఉన్నది ఉన్నట్లు కాకుండా…
Read More

నా ప్రియమైన ప్రేమ – అందమైన శత్రువు

నా ప్రియమైన ప్రేమ - అందమైన శత్రువు ఎవరో తెలీదు ఎక్కడుంటావో తెలీదు... కానీ చాలా ప్రశాతంగా ఉన్న నా జీవితం లోకి ఓ తూఫాన్ లా వచ్చావు... ఎన్నో అలజడులు సృష్టించి నావు... నువ్వు చూపించే ప్రేమ, నా మీద నీకున్న బాధ్యత... నువ్వు కనపడకుండా నన్ను నాకు దూరం చేసి. నీ ఆలోచనలతో నింపేసావు.. నువ్వు నేను ఎప్పటికీ కలవని ఇరు ప్రేమికులం... నువ్వకడ నేనిక్కడ.. నేను నేను అందను అని తెలిసిన ఎందుకు నా మీద నీకు ఇంత ప్రేమ... ఇంత ప్రేమ చూపించే నీకు ఎందుకు దూరంగా ఉన్న అంటే? నా దగ్గర సమాధానం లేదు... నన్ను నాకు కాకుండా చేసి. నిన్నే నింపుకునేల చేసిన నువు ఎప్పటికీ అయిన "అందమైన శత్రువు"వే... అందుకే నువ్వంటే నాకిష్టం.. నా ప్రాణమే నువ్వు అయినపుడు.. నేను నాలో ఎలా ఉంటా నా పిచ్చి కాకపోతే నా ప్రియమైన…
Read More

ఓం నమో వేంకటేశాయ…

ఓం నమో వేంకటేశాయ... ఆపదమొక్కుల వాడా.. అనాదరక్షక... అని అందరూ నిన్ను పిలుస్తారు.. ఆపద ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు అండగా ఉంటావనా.. అనాదలకు రక్షగా ఉంటావనా... నువ్వు ఎక్కడున్నవో తెలీదు ఎలా ఉంటావో తెలీదు... ఒక బొమ్మకు రూపానిచ్చి.. దానికి నీ నామాన్ని చేర్చి నిన్ను కోలుస్తున్నాము.. కానీ మా బాధలు నీకు కనపడటం లేదా.. కాపాడడానికి రావడం లేదు... అనాదల గోడు నీకు వినపడటం లేదా.. రక్షణ ఇవ్వటం లేదు... ఈ భూమ్మీద పాపాలు పెరిగాయి.. కానీ అందరూ పాపాత్ములు కాదుగా... పాపం అనే వారికన్నా చేసేవారే ఎక్కువయ్యారు... కన్నీళ్లు తుడిచేవరికన్న ... పెట్టేవారు ఎక్కువయ్యారు... రక్షణ ఇచ్చేవరికన్నా ...ఆపదలో తీసేవారు ఎక్కువయ్యారు... నువ్వు కూడా స్వామి🙏🙏 మమ్మల్ని కాపాడడం మానేసి మా పాపాల్ని లెక్కపెట్టడం లో మునిగిపోయారు .... మనుషులు ఎలాగో మారరు.. మీరు అయిన పాప పుణ్యాలను... మంచి చెడులను చూసి.. కాస్త దయచుపండి స్వామి..🙏🙏…
Read More

చిగురాశ

చిగురాశ ఒకరోజు... అలా సూర్యోదయం వేళ.. అటుగా నడుచుకుంటూ వెళ్తున్న నాకు ఒక్కసారిగా సూర్యుడు ఎందుకో చిన్నబోయాడు అనిపించింది... కానీ వెలుగు ఏ మాత్రం తగ్గలేదు.... ఎందుకో తెలుసా...? ఆ సూర్యుడి వెలుగు నీ మొహం లో అందంగా కనిపిస్తుంది.. నిన్ను చూసిన ఆ క్షణం ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని అలజడి... నీ నవ్వు చూడడం కోసం నా కళ్ళు ఎంతో ఆరాటపడుతున్నాయి. పదే పదె నిన్నే రూపాన్ని తలపిస్తున్నాయి.... ఎందుకో తెలీదు అడుగు ముందుకు పడటం లేదు.. బహుశా నువ్వు దూరం అవుతావు అనేమో... కను రెప్ప వేయడం లేదు నువు మాయం అవుతావు అనేమొ... కానీ ఆ రోజు ఆ క్షణం నాలో చిగురించిన ఆశ నీతో కలకలం ఉండాలని జీవితాంతం బ్రతకాలని... నేటికీ నిజం అయిన వేళ నా కళ్ళ ముందు నా ఆశ నెరవేరిన వేళ నీకే జన్మ దాసోహం అయిన వేళ ఈ…
Read More

కలగంటి

కలగంటి నీ కోసం ఎదురు చూసే నా కళ్ళు కలగంటున్నయి.. నీతో జీవితాంతం సంతోషంగా ఉండాలని.. నీకై వేసే నా ప్రతి అడుగు.. నీతో ఏడడుగులు వేయాలని కలగంటున్నాయి... నీకోసం, నీ జత కోసం వేచి చూస్తూ ఆకాశం లోని చంద్రుడిని నేల మీద ఎప్పుడు చూస్తానా... నా చేయి పట్టుకునే రారాజు ఎప్పుడూ వస్తాడా అని నా మనసు ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసి పడుతూ వేయి కళ్ళతో నా కనులు కలగంటున్నాయీ.. ఎక్కడ ఉన్నావు ప్రియతమా.. ఎప్పుడూ వస్తావు నా దరికి.. నేస్తమా.. నా కలలను ఎప్పుడు నిజం చేస్తావు... నా ప్రాణమా... - వనిత రెడ్డీ
Read More

అమ్మ- అమ్మాయి

అమ్మ- అమ్మాయి తల్లి గర్భంలో పురుడు పోసుకుని.... తల్లికి మరుజన్మ నిచ్చి భూమ్మీద పడ్డ పసిబిడ్డ... తల్లి రక్తపు చుక్కలతో తయారయిన చనుబాలను తాగి... తల్లి ఎద పైన తన్నిన ఆ తల్లి ప్రేమగా బిడ్డ పాదాలను ముద్దాడుతుంది.... అలా చిన్నప్పుడే తల్లి ఎద పైన తన్ని ఎదుగుతూ వచ్చాక ఆ తల్లి గుండెలపై తన్నుతున్నాడు... తనకి కడుపు నింపిన ఆ స్థానాలను.. ఇంకో అమ్మాయిలో కామంగా చూస్తున్నాడు... మగాడు అది వాడికి అవసరంగా అవకాశంగా చూస్తున్నాడు... ప్రాణాలను సైతం తీస్తున్నాడు... ఒక్కసారి తను ఆలోచించగలిగితే బాగుండు... నీ తల్లి దగ్గర కడుపు నింపిన అవయవం... ఇంకో తల్లి దగ్గర ఎందుకు అది ఇంకోలా కనపడుతుంది.... నీ తల్లి దగ్గర లేనిది కనిపించే బయటి ఆడదాని దగ్గర ఏముంది... ఆలోచించు ఒక్కసారి మానవా... కనిపించే అమ్మాయిలో ఒక అమ్మను చూడు.. ఒకటి పురుడు పోస్తే... ఇంకోటి నీ కడుపు నింపింది. దయచేసి…
Read More