Month: November 2025

నవంబర్ 06 ప్రత్యేకతలు :⁠-

నవంబర్ 06 ప్రత్యేకతలు :⁠-

✒1860: అబ్రహం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ✒1913: దక్షిణాఫ్రికాలో భారతీయ గనికార్మికులతో ప్రదర్శన జరపగా, మహాత్మా గాంధీ అరెస్టయ్యాడు. ఆయనకు 9 నెలల జైలుశిక్ష వేశారు. ✒1923: వారానికి ఐదు రోజులతో రష్యా ప్రయోగాత్మక కాలమాన పద్ధతిని ప్రవేశపెట్టింది. ✒1937: భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ భారత ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా జననం. ✒1941: నౌఖాలీ ఊచకోత జరిగిన ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు. ✒1943: అండమాన్ నికోబార్ దీవులను జపాన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు అప్పగించింది. ఆయన వాటికి షహీద్, స్వరాజ్య అని నామకరణం చేసాడు. మాధవి కాళ్లసేకరణ
Read More

మరో వేమన మన కృష్ణారెడ్డి

మరో వేమన మన కృష్ణారెడ్డి ఒక పరిశీలన ***** అక్షర లిపి సమూహ మిత్రులకు నమస్కారములు.యాజమాన్యమునకుప్రత్యేక వందనములు.మన సమూహసభ్యులందరూ సాహిత్యములోని అన్ని ప్రక్రియల్లో ప్రావీణ్యం సంపాదించి మంచి రచనలు చేస్తూ అక్షర లిపికి వన్నె తేవాలనే తాపత్రయముతో అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు. సంగీత సాహిత్యాలు సరస్వతి స్తనద్వయం అంటారు.సంగీతం--ఆపాత మధురం, సాహిత్యం--ఆలోచనామృతం. మనలో సాహిత్య పరంగానేగాక లలిత కళల్లో. ఏదో ఒక కళలో కొంతమందికి అదనపు కళ వరించింది.భవ్యగారు-నాట్యంలో,శ్యామాచార్యగారికి --లలిత సంగీతంలో డిప్లొమా.మిగతా....భరద్వాజగారు,అపరాజిత్ గారు, రాంబాబు గారు,మాధవి గారు,శారదగారు ఇలా....అనేకమిత్రులు గద్య ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు.అందుకు కావలసింది ముఖ్యముగా ఆసక్తి.ఇంకా కోరికతోపాటు తీరిక,తపన,సాధన,సమాజ పరిశీలన, ప్రతిభ కూడా అవసరం. పై వాటితో పాటు పద్యరచన చేసేవారికి అదనంగా ఛందస్సులో కూడా పరిజ్ఞానం ఉండాలి.ఛందస్సు తెలియనివారు పద్య రచన చేయలేరు. పద్యములలో అనేక రకములుంటాయి.వాటిలో ఆటవెలది, తేటగీతి, ఉత్పలమాల, చంపకమాల,సీసం,కందం మొదలైనవి.వీటిలో కందం రాసినవాడే కవి.పందిని పొడిచిన వాడే…
Read More
అమ్మాయి నవ్వు

అమ్మాయి నవ్వు

అమ్మాయి నవ్వులోఎన్నో ఎన్నెన్నో అందాలుఅది కొంత కాలమే!ఇక తన జీవితానికి ముడిపడిన బంధాలతో ప్రపంచమేకనపడదు తనది అదో లోకమేఆ తరువాత బల పడిన బంధాలతో జీవితమంతా నవ్వులు మాయమే!కష్టాల కడలి లో ఓలలాడాలిఏదీ తనది కాదు ఏ ఆస్తులూ తనవి కావు ఏ ప్రేమలూ తనకు పంచరు ఏదో కొందరి అధృష్టం బాగుంటే దొరుకుతుంది కొంత ప్రేమ!ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చినా ఎన్ని ఇళ్లులు మారినా ఏ ఇళ్లూ తనది కాదు ఏ నవ్వులూ తన స్వంతం కాదు చివరకు చితే తన స్వంతిల్లు! ఆడవాల్లను ఎందుకు సృష్టించాడో ఆ దేవుడు?ఆ ఆడది లేకుంటే సృష్టే లేదు అంత మందిన సృష్టించిన స్త్రీ మాత్రం తనకంటూ ఏదీ లేకుండానే తనువు చాలించాలి! ఉమాదేవి ఎర్రం.. ఈ రచన నా స్వంతమే!
Read More
కం!!💐💐💐

కం!!💐💐💐

నూరిన పచ్చడిలోననుకారము లేదంచు సుతుడు గట్టిగ గూయన్సారా ద్రావిన వేళనుకారము లేనట్టి కూర కాంతుడు మెచ్చెన్ గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More
వెన్నెల పూజిత

వెన్నెల పూజిత

వెన్నెల పూజిత ఈ వెన్నెల ఈ జాబిలి ఈ రేయిఈ పూల పరిమళాల అవనీతనయికఈ పూదోటలో భామినీ లలామసొగసుపూల మరుమల్లియల సుందరివసంతాల వెలుగుల సౌందర్యరాశిజాజిపూలతో జలకాలాడే మయూరమాహృదయం నిండా లేతగులాబీల సుగంధాలువిరసిత పూబోణీ నయనానందకర నర్తినీనీ ముఖారవిందం విరసిత బంగరు దీపికవెండిపూలు జారుతున్నట్లు తెల్లని వస్త్రాలురంగు రంగుల పూవుల కుండీలన్నీ సుగంధాల రంగులొలకబోస్తూవిరసిత మోముపై వెండి వన్నెల కిరీటంలేతఆకుపచ్చని వనాల మద్య అప్సరస లలామినీయవ్వనం పూసిన పౌర్ణమి రాత్రి వేళ వెండితెరపై నటీమణి నీవేఆకాశం నుండి తొంగిచూసే వేకువజాము ఉషస్సువోరాగాల లేఖలో వ్రాసిన అక్షరాల వాక్యాలలో సందేశానివి నీవేనా రూపసీ,,,,,,,,,చూపుల సురుచిర కనుబాసల సరయూనదీ సంపెంగ పూవువావిశాల గగణంలో విరిసిన సరసి తార చంద్రునికై తహ తహఉరికే గోదారి సుడిగుండాల మయమైనా సాగిపోయే వయ్యారి నాట్య సురభామినివా ఏమి ఆ అందం,,,,,మనస్సు పూసిన కలువ పూవుల మైమరపించే వేగుచుక్క సొగసు దానాపూవుల రాణి గుభాళించిన గులాబీ రంగు వర్ఛస్సుకుగులాములెందరో - అపరాజిత్
Read More
ఈ ఉషా కిరణాలు,,,,,,,!!

ఈ ఉషా కిరణాలు,,,,,,,!!

ఈ ఉషా కిరణాలు,,,,,,,!! ఈ సింధూరం పసుపు వర్ణాలు సమ్మిళిత కాంతులతోగోరువెచ్చని కాంతులు చిమ్ముతూ తూర్పున ఉదయిస్తున్నాడదిగో ,,,,,,,,,,ఓ గృహిణి వెచ్చని చాయ్ తయారుచేసి తాగమని పెట్టింది ఎవరికో,,,,,,,,,,మనిషనే వాడికి చాయ్ తాగనిదే పొద్దుపోదు పొద్దుపొద్దున్నే,,,,,,,,సూర్యుని తొలిపొద్దు అందాలు ప్రదర్శించే, ఆ వెలుగుల సౌందర్యం ఎవ్వరికీ అక్కర్లేదు,,,,,,,,,,కాని ప్రకృతి ఆరాధకులు కొందరు చాయ్ చప్పరిస్తూ సుందర సృష్టి అందాల్లో తేలిపోతుంటారు,,,,,,,,,ఉదయ సంధ్య మిరుమిట్లలో ఇహలోకాన్ని మైమరపించే చాయ్ లో సుందర లోకాల్లోకి తేలిపోతూ అలవిగాని ఆనందాన్ని చవిచూస్తారు,,,,,,,,,,,పొద్దున్నే సున్నితంగా తాకే సూరీడే మధ్యాహ్నానికి భగభగల నిప్పులు కురుస్తాడు,,,,,,,,ప్రభాత సౌందర్యం ముందు ప్రపంచంలో ఏదీ సాటిరాదు నిర్మలమైన అవని ఆకాశం కలబోసి తీసిన ఋతుచక్రం సూర్యుడే మూలం,,,,,,,,,నీ మోజులలో చాయ్ లు, సరదా కబుర్లలో హృదయాలు విప్పలేని దౌర్భాగ్యం నిప్పుల సెగలైనా ఒప్పే నీకు,,,,,,,,,ఆ ప్రభాతంలో అలా అలా ఊరవతల దాకా వెళ్ళి భళ్ళున తెల్లవారిందాకా గడిపి వచ్చి చాయ్ త్రాగు,,,,, ఎంత…
Read More
వ్యసనము – పతనము

వ్యసనము – పతనము

వ్యసనము - పతనము *పల్లవి * తాగకురన్నా ….. తాగి ఊగకురన్నా "2 వ" తాగి ఊగినావంటె తాగుబోతువంటారు పని చేయక తాగుతుంటె పనికి రాడంటారు తాగకురన్నా….. తాగి ఊగకురన్నా "2 "చరణం పిల్లలంత నిన్నుజూచి పిచ్చోడని అంటారు పెద్దలెన్ని చెప్పినా లెక్క చేయకుంటావు బ్రతిమిలాడిన భార్యను విదిలించుకుంటావు ఆకలేసి అడిగినా పిల్లల బెదిరించుతావు తాగకురన్నా తాగి ఊగకురన్నాచరణం పనులు చేయకుండానె పైసలెట్ల వస్తాయి ఇంట వంట గిన్నెలమ్మి మందు తాగుతుంటావు పెండ్లామును బెదిరించి కూలిడబ్బు లాక్కుంటవు బారుకెళ్ళి మందుతాగి నేలబడి పొర్లుతావు తాగకురన్నా తాగి ఊగకురన్నాచరణం పనికెళ్ళక పడుకుంటవు పస్తులుంచి ఏడ్పిస్తవు బడికంపక పిల్లలను వీధి బాలలను జేస్తవు ఆలి,పిల్ల లాకలేసి అల్లాడుతు ఉంటారు ఎంగిలిస్తరాకు లన్ని ఏరుకొని తింటారు తాగకురన్నా తాగి తాగి ఊగకురన్నాచరణం ఆకలి భరించలేక దొంగలుగా మారుతారు పోలీసులు పట్టుకొని నేరస్తులుగా కట్టి ఇంటినుండి ఈడ్చుకెళ్ళి జైలునందు వేస్తారు బాధ్యత లేని తండ్రి వల్ల బాధలు…
Read More
ఆ నవ్వు

ఆ నవ్వు

ఆ నవ్వు మల్లెలు జలజల రాలుతున్నట్లు , స్వేచ్ఛ పావురం ఎగురుతున్నట్లు చల్లని సమీరం , తాకుతున్నట్లు వెన్నెల పుష్పం వికసించినట్లుంది ఆ మోము . చైతన్యానికి నాంది పలుకుతూ ఆ నవ్వు స్వాగతం పలుకుతుంది చిరునవ్వుతో మొదలెడితే లేదు అపజయం అన్నది ఆ నవ్వు సంకేతం ఉత్తేజాన్ని నింపాలని ఊసుల కడలి నింపాలని ఉవ్వెత్తున ఎగసిపడే ఆ నవ్వుల సిరిగంగ ఆశయం నెరవేదితే చేరే ఉత్సాహానికి నాందిలా దివ్యకాంతి తేజోమయమై ఆ నగవులు వెలిగె దివ్య కాంతులు. ఎదుటివారి మానసాన్ని దోచుకునేందుకు సిరి నవ్వుల తేనెల మధువులు ఆ ముఖారవిందం గమకాలు. తన వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపుకునే వారధి ! కలుపుగోలుతనం నిండిన మమతల వల్లరి పూసిన ఆ నవ్వుల జావళి. కూర్చును మోమున సంబరం అంబరాన్ని తాకిన ఆనందపు సవ్వడి పులకింతల పూబోణి హృదయ గంధపు పరిమళం ఆ హాసం. - ఆలపాటి సత్యవతి
Read More
యువతులు ఎగిరే గాలిపటాలు,,,,,,,!!

యువతులు ఎగిరే గాలిపటాలు,,,,,,,!!

యువతులు ఎగిరే గాలిపటాలు,,,,,,,!! యవ్వన ప్రాంగణంలో ఉన్న యువతులుకలల పూతోటలో విహరిస్తూ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారుయువతులు తమకున్న ప్రతిభ జ్ఞానాన్ని తమకున్న కుటుంబ సమస్యల రీత్యా స్వేచ్ఛను కోల్పోయి అమలుకు నోచుకోక తమలో తామే ఎవరికి తెలియకుండా కుమిలిపోతారు,,,,,,,,ప్రతి విషయానికి తెచ్చిపెట్టుకున్న నవ్వు నటనలతో జీవన మాధుర్యాన్ని కోల్పోతారు,,,,,,,ఒకవేళ పెళ్ళైన యువుతులైతే తమ భాగస్వాములతో తెచ్చిపెట్టుకున్న హావభావాలు ప్రదర్శిస్తూ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు,,,,,,,,,ఉద్యోగులైన యువుతులైతే జీవనం కంటకభూయిష్టమే కాన్పులనీ పిల్లల పెంపకం వాళ్ళ చదువులు బాధరాబందీ అంతా తమ భుజస్కంధాలపై నుండి కదలిపోవడమే,,,,,,,,,భర్త అనేవాడు ఎలావున్నా ఏంచేసినా భార్య అనే మహిళ సర్దుకుపోతూ కుటుంబం బాగోగులు చూసుకునే అజ్ఞాత యజమాని,,,,,,,తప్పంటూ జరిగితే సమాజానికి మొదట మహిళే కళ్ళ ముందు అగుపడే ముద్దాయి,,,,,,మగాడు పనికిమాలిన వెధవైనా మహిళను తన చెప్పుచేతుల్లో ఉంచుకుని వినకపోతే చిత్రహింసలు పెట్టె పిచ్చివేదవ,,,,,,మహిళకు గర్భధారణ అనేది ఉండడం వల్ల ఆమె మగతోడు సంకెళ్ళ మధ్య బిగుసుకుపోయింది,,,,,,,,,మహిళలు ఖాళీ సమయంలో సామాజిక…
Read More
మనస్సు తనది కాకపోతే,,,,,,,!!

మనస్సు తనది కాకపోతే,,,,,,,!!

మనస్సు తనది కాకపోతే,,,,,,,!! వ్యక్తి నిగూఢ లోతుల్లోనిగతంలో ఎప్పటివో చేదు అనుభవాలుజ్ఞాపకాలలోనివి అభూతకల్పనలు కొన్నిచుట్టుముట్టి మనస్సు పొరలలోఅతి సూక్ష్మంగా మెదడులో రసాయనిక సమ్మేళనాలుగతులు తప్పడం వల్ల నిద్రలేమితోతీవ్ర మానసిక సంఘర్షణలకు లోనైగతకాలపు దుఃఖభూయిష్టమైన సంఘటనలుమనిషి మనస్సు నిండా రివరివమంటూఆలోచనలు చుట్టుముట్టి ఏపనులలోనైనాఆసక్తి సన్నగిల్లి మనిషి తనువు మెదడునుకృంగదీసి దినచర్యలు కూడా చేసుకోనివ్వని వేదనలుచదువు పట్లగాని, చేసే ఉద్యోగాల్లో గానిఆసక్తి సన్నగిల్లి తమకు తాము ఒంటరిగా ఉంటారుతమను ఎవరో వెంటాడుతున్న భయంతమ మనస్సు ఎవరో తెలియని వారిఆధీనంలో పనిచేస్తుందని బ్రమల్లో బ్రతుకు దైనందినంనరకతుల్య ఆలోచనలతో దిక్కుతోచని స్థితిమనస్సులోని అంధకార బంధుర ఆలోచనల ఊహలుఅవే నిజమని నిర్ధారించుకునిఎదుటి వ్యక్తులను దూషిస్తూ ఒక్కోసారి దాడిచేస్తారుమనిషి తనపై అదుపు కోల్పోతారువైద్యపరిభాషలో డిప్రెషన్ లేదా మనోమంథనం అంటారువీళ్ళను సైకోలని సమాజం దూషిస్తుందిఅలాకాకుండా వీళ్ళను సరియైన సైక్రియాటిష్టుకు చూపించాలిలేదా మానసిక ఆసుపత్రిలో చేర్పించాలి తప్పకొట్టడం,దూషించడం చెయ్యకూడదుఆలోచనలు స్థిమితం తప్పి తమను తాముఏ అఘాయిత్యానికైనా చనిపోయేందుకైనా వెనుకాడరు,,,,,,,,కనుక మొదట్లోనే వీరి ప్రవర్తన…
Read More