Month: November 2025

చిరునవ్వే ఆభరణం

చిరునవ్వే ఆభరణం

చిరునవ్వే ఆభరణం మంచి ఉదయం వెలుగులో, సముద్రతీరంపై తేమతో మెరిసిన గాలి ఆమె జుట్టులో ఆడుతోంది. ఆ నవ్వు — ఒక్కసారిగా మనసులోని మబ్బుల్ని కరిగించే సూర్యకిరణం లాంటిది. ఎవరో ఆమెను చూడగానే సంతోషించిపోతారు, కాని ఆ నవ్వు వెనుక దాగిన కథను మాత్రం ఎవ్వరూ ఊహించరు. అమృత ఆ రోజు కూడా తీరానికి వచ్చింది. చేతిలో ఒక పాత డైరీ, కళ్లలో ఓ అంతులేని శాంతి. “జీవితం నవ్వుతో మొదలవుతుందేమో కానీ, ప్రతి నవ్వుకూ ఓ కన్నీటి పుట్టు ఉంటుందే…” — అని తన డైరీలో రాసింది. ఒకప్పుడు ఆమె నవ్వు నిజమైనది. కానీ ఆ నవ్వు వెనుక ఒక విరిగిన హృదయం దాక్కుంది. ప్రేమించిన మనిషి వెళ్లిపోయిన రోజు నుంచి, ఆమె కన్నీళ్లు రాళ్లైపోయాయి. అయినా, ప్రపంచం ముందు నవ్వటమే ఆమె ధర్మమని భావించింది. “ఎందుకు అంత నవ్వుతావు?” అని చాలామంది అడిగేవారు. ఆమె మాత్రం మృదువుగా, “ఎందుకంటే…
Read More
అప్పుడే సమాజం బాగుపడుతుంది

అప్పుడే సమాజం బాగుపడుతుంది

అప్పుడే సమాజం బాగుపడుతుంది పిల్లల పెంపకంలో ఆధునిక తల్లి తండ్రుల పాత్ర..నిజంగా ఈ కాలంలో నేటి సమాజంలో పిల్లలను పెంచడం చాలా కష్టంగానే ఉంటుంది..దానికిఒకరిద్దరినే కనడం ఓ కారణమైతే నేటి ఆధునిక సాంకేతికత ఓ కారణమవుతుంది..పిల్లలు అన్ని రకాల ఫోన్లు అన్ని రకాల సామాజిక మాధ్యమాలు వాడుతూ చెడి పోతున్నారు అది మానసికంగా శారీరకంగా కూడా!వావి వరుసలు మరచి పోతున్నారు దానికి తల్లి తండ్రులు కూడా ప్రోత్సాహమిస్తున్నారే తప్ప దండించడం లేదు ఎందుకంటే ఎక్కడ పిల్లలు ఏ అఘాయిత్యాలు చేసుకుంటారోనని భయపడి..కానీ ముందు నుండే గారాబం అతిగా చేయకుండా క్రమ శిక్షణ తో పిల్లలను పెంచగలిగితే బాగుంటుంది..వారి జీవితం తప్పు దారిన పడకుండా ఉంటుంది.ఆ బాధ్యతను తల్లి తండ్రులు గురువులు తీసుకోవాలి!అప్పుడే సమాజం బాగుపడుతుంది… - ఉమాదేవి ఎర్రం
Read More
పిల్లల పెంపకం లో ఆధునిక తల్లిదండ్రుల పాత్ర

పిల్లల పెంపకం లో ఆధునిక తల్లిదండ్రుల పాత్ర

పిల్లల పెంపకం లో ఆధునిక తల్లిదండ్రుల పాత్ర సమాజం వేగంగా మారుతున్న ఈ తరుణంలో, పిల్లల పెంపకం అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు! ఒక పెద్ద సవాలుగా మారింది. గతంలో తల్లిదండ్రులు అనుసరించిన సంప్రదాయ పద్ధతుల కంటే, నేటి ఆధునిక తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచడంలో విభిన్నమైన, సంక్లిష్టమైన పాత్రను పోషించవలసి వస్తోంది. సాంకేతికత, ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న సామాజిక విలువలుసంప్రదాయ పెంపకంలో తల్లిదండ్రులు నియంత్రణ ప్రధానంగా వ్యవహరించేవారు. కానీ, ఆధునిక తల్లిదండ్రులు తమ పాత్రను మార్చుకోవాలి. వారు పిల్లలపై అధికారాన్ని రుద్దకుండా, సరైన మార్గాన్ని చూపించే మార్గదర్శకులుగా, స్నేహితులుగా వ్యవహరించాలి.ఏ నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక ఉన్న హేతువును పిల్లలకు వివరించాలి. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలి, తద్వారా పిల్లలు సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. నేటి పిల్లల జీవితంలో సాంకేతికత అనేది ఒక అంతర్భాగం. ఇది ఆధునిక తల్లిదండ్రులపై అతిపెద్ద ఒత్తిడి.టెక్నాలజీని పూర్తిగా దూరం చేయకుండా, దానిని…
Read More
ఆమె

ఆమె

ఆమె ఆమె సహనానికి నిలువుటద్దంఓపికకు మారుపేరు ఆమెఆమె విలువలు నేర్పుతుందిఆమె సంస్కారం నేర్పిస్తుందిఎలా ఉండాలో నేర్పుతుందిఎలా మాట్లాడాలో తెలుపుతుందిఎలా ఉండకూడదో నేర్పిస్తుందిఎక్కడ నవ్వులపాలు కాకూడదో తెలుపుతుందిఎలా ధైర్యం గా ఉండాలో నేర్పుతుందిఎలా బెలగా ఉండకూడదు తెలుపుతుందిఆమె ప్రశ్నించడం నేర్పుతుందిఏమైనా తట్టుకునే శక్తిని ఇస్తుందిఎలా మాట్లాడకూడదో నేర్పుతుందిఎలా పొదుపుగా ఉండాలో తెలుపుతుందిఎలా ఖర్చులు చేయకూడదో నేర్పుతుందిఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుపుతుందిఇంటికి పెద్దగా ఎలా ఉండాలో నేర్పిస్తుందిఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుందిఎలా ఉండకూడదో తెలుపుతుందిఎలా సహాయం చేయాలో, చేయకూడదో నేర్పిస్తుందిఇన్ని నేర్పిన ఆమె….మాత్రం మమకారానికి లొంగిపోతుందిమాటలకు కరిగిపోతుందిప్రేమ, ఆప్యాయతానురాగాలను పంచుతుందిబంధాలను తెగిపోకుండా కాపాడుతుందిచివరికి ఆమె ఆ బంధాల నడుమ చిక్కిపోతుందిఅంతా నావారే అనుకున్న ఆమెబాధ్యతకు లొంగిపోతుందితాను నేర్పిన బాటే ముళ్ల కంపగా మారితననే చిల్చుతూ ఉన్నా…..కరిగిపోతూ, కాలిపోతుందిఆమె అమ్మ… మనందరి తల్లిప్రతి అమ్మ కథే ఇది, ఇంతే ఆమె జీవితంఆమె లేనిదీ నువ్వు లేవు, నేను లేనుసృష్టిలో తియ్యనిది, మాయనిదిమోసం, ద్వేషం, స్వార్థం, కల్లాకపటం…
Read More
చేతులు

చేతులు

చేతులు విప్పారిన ఆ చిట్టి చేతులు నేలను ముద్దాడుతాయిఆ చిన్ని చేతులు చెంబుని మోస్తాయిఆ చిన్ని చేతులు చీపురుతో నేలను ఉడుస్తాయిఆ చిన్ని చేతులు గిన్నెలు కడుగుతాయిఆ చిట్టి చేతులు నొప్పులు ఆపుకుంటాయిఆ చేతులు మరో చిన్నారిని ఆడుముకుంటాయిఆ చేతిలు గోరుముద్దలు తినిపిస్తాయిఆ చిన్ని చేతులు ఓదారస్తాయిఆ చిన్ని చేతులు మగాణ్ణి హృదిలో అలసట తీరుస్తాయిఆ చిట్టి చేతులు బిడ్డలను సాకుతాయిఆ చిన్ని చేతులు ఇంటికి వన్నె తెస్తాయిఅవసరం ఆ చేతులని ఎన్నో చోట్ల తిప్పుతాయిఆ చేతులు వంటల్లో ప్రావిన్యాం సంపాదిస్తాయిఆ చేతులు నలుగురి కడుపు నింపుతాయిఆ చేతులు కంప్యూటర్ పై నాట్యమాడతాయిఆ చేతులు కారు నడుపుతాయిఆ చేతులు విమనాలు నడిపిస్తాయిఆ చిన్నారి చేతులు అంతరిక్ష యానాలు చేస్తుంటాయిఆ చేతులు నృత్య ప్రదర్శనలో అరితేరతాయిఆ చిట్టి చేతులు టెన్నిస్ ఆడతాయిఆ చిన్నారి చేతులు తుపాకీ పట్టుకొనితీవ్రవాదులను అంతం చేయడంలో ముందుంటాయిఆ చిట్టీ చేతులే బ్యాట్ పట్టుకొనిభారతదేశం పేరుని నిలబెడతాయిఅందుకే అందుకే ఆ…
Read More
కత్తిమీదసాము

కత్తిమీదసాము

కత్తిమీదసాము ఆ శనివారం సాయంత్రం.రవి ఇంటి బాల్కనీలో కాఫీ కప్పుతో కూర్చుని ఉన్నాడు. ఫోన్ స్క్రీన్‌ మీద అతని కుమార్తె "మీరు రీల్‌లో ట్యాగ్ చేయబడ్డారు!" అనే నోటిఫికేషన్‌ మెరిసింది. నవ్వాడు. కానీ ఆ నవ్వు ఆలోచనల్లో మునిగిపోయింది. అతని చిన్నతనం గుర్తొచ్చింది — తండ్రి చేతిలో దెబ్బ తిన్నా ప్రేమతో మెలిగిన రోజులు, తల్లి గోధుమ రంగు దీపపు కాంతిలో తన హోమ్‌వర్క్‌ చెక్‌ చేసిన క్షణాలు."ఇప్పుడు నా పిల్లను నేనెలా పెంచుతున్నాను?" అని తాను తాను ప్రశ్నించుకున్నాడు. ఇప్పటి తల్లిదండ్రులు ప్రేమిస్తారు… కానీ ఆ ప్రేమలో భయముండదు.సౌకర్యాల కోసం, సమయాన్ని కొల్పోతూ, పిల్లలతో ఉండాల్సిన మాటలు ఇప్పుడు చాట్‌ మెసేజ్‌లుగా మారిపోయాయి.అదే సాంకేతిక యుగం — తల్లిదండ్రుల చేతిలో మొబైల్‌, పిల్లల చేతిలో ట్యాబ్‌.కానీ, కళ్లల్లో అనుబంధం తగ్గిపోతోంది. రవి తన కుమార్తె మిహిక దగ్గరికి వెళ్లాడు."ఏం చేస్తున్నావ్‌ బంగారం?" అన్నాడు."ఒక వీడియో చేస్తా నాన్న!" అంటూ ఫోన్‌…
Read More
ఈ జీవన ప్రయాణం ఎందాకో,,,,!

ఈ జీవన ప్రయాణం ఎందాకో,,,,!

ఈ జీవన ప్రయాణం ఎందాకో,,,,! ఒకప్పుడు నారుపోసిన వాడు నీరుపోయడా అనిదంపతులు ఏడెనిమిది మంది నుండి డజను మంది దాకా సంతానం కనేవారు,,,,,,అప్పుడు కరువు కాటకాలు ఆకలి బాధలు,రోగాలు దేశంలో పెచ్చరిల్లుతున్న రోజులుజనాభ హద్దులు మీరి పెరుగుతున్న దినాలు,,,,,,,పందొమ్మిది వందల డెబ్భై ఐదు దశకంలోప్రభుత్వం తేరుకుని బలవంతంగా కుటుంబ నియంత్రణ సర్జరీలు ముఖ్యంగా మగవాళ్ళకు చేసింది,,,,,,ఇద్దరు లేక ముగ్గురు సంతానం చాలు అని సామాజిక మీడియాల్లో విస్తృత ప్రచారం చేసింది,,,,,,,కొన్నాళ్ళకు జనజీవితాల్లో కనువిప్పు కలిగి మహోజ్వల మార్పు వచ్చింది ఆ రోజుల్లో,,,,,అదే మార్పు తర్వాత తర్వాత ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అనే నైజం మనుష్యుల్లో సమూల మార్పుకు దోహదం చేసింది,,,,,,,నవీన యువత భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు, ఊడిగాలు బిజీబిజీగా చేస్తున్న రోజులివి,,,,,పిల్లల పెంపకం భారంగా మారిన రోజులివి, మహిళలు పిల్లలు కనే ఓపిక, సహనం నశించిపోయింది,,,,,జపాన్, చైనాలోలా అసలే వద్దు ,ఒక్కరు ముద్దు అనే నానుడి మన దేశంలో పొడచూపుతోంది,,,,,,కాని…
Read More
జీవవైవిద్యము

జీవవైవిద్యము

జీవవైవిద్యము "ఏమండీ రేపటి ప్రోగ్రాం గుర్తుంది కదా!" పడుకునే ముందు ఉమాపతికి గుర్తు చేసింది భార్య జయంతి. "అన్నీ మనం అనుకున్నట్లే జరగాలి. నాకు బాగానే గుర్తుంది. నువ్వు మాత్రం మర్చిపోకు. తెల్లవారుజామునే లేవాలి. పిల్లలిద్దరినీ లేపి తయారు చేయాలి. అలారం పెట్టాను. నువ్వు నిద్రపో." భార్యకు అన్ని వివరంగా చెప్పి నిద్రకుపక్రమించాడు ఉమాపతి. ఉమాపతి ఆర్ అండ్ బి లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య జయంతి గృహిణి. ఆమె డిగ్రీ వరకు చదివింది. వారి అన్యోన్య దాంపత్యానికి వారసులుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. పది సంవత్సరాల బాబు పేరు అజిత్. వాడు ఐదవ తరగతి చదువుతున్నాడు. ఎనిమిది సంవత్సరాల పాప పేరు అపర్ణ. ఆమె మూడవ తరగతి చదువుతుంది. చురుకైన పిల్లలు. వారం రోజుల క్రితం అజిత పుట్టినరోజు వేడుకను చేశారు. ఆ వేడుకలో ఉమాపతి కొడుకుకి చేసిన వాగ్దానం ప్రకారం ఒక రోజంతా జూ…
Read More
తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి.

తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి.

తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి. నేటి సమాజంలో పిల్లలపరివర్తనలో చాలా మార్పులు వచ్చాయి.తమ చుట్టూ ఉన్నపరిస్థితుల వల్లనేవారి ప్రవర్తనలోమార్పులు వచ్చాయి.ప్రతీ విషయానికీపంతాలకు పోయితల్లిదండ్రుల మాటవినటం మానేసారు.ఇందులో తల్లిదండ్రులతప్పు కూడా ఉంది.పిల్లలను అతి గారాబంగాపెంచుతున్నారు. పిల్లలుఅడిగితే కొండమీద కోతినికూడా తెచ్చి ఇస్తున్నారు.దీనివలన పిల్లలకు వస్తువులవిలువ తెలియటం లేదు.ఏది అడిగినా సరే తల్లిదండ్రులు తమకుతెచ్చి ఇస్తారు అనిభావిస్తూ ఉంటారు.అలా తెచ్చి ఇవ్వక పోతేఅలుగుతూ ఉంటారు.తల్లిదండ్రులతో గొడవపెట్టుకుంటూ ఉంటారు.పెద్దలను గౌరవించటంమన సాంప్రదాయం. అయితే నేటి పిల్లలు తమ పెద్దలను గౌరవించటం మానేసారు.దీనికి ప్రధాన కారణంతల్లిదండ్రులే. పిల్లల మనసుల్లో పెద్దలకుసరైన గౌరవం ఇవ్వాలిఅనే భావన కలిగించేవిషయంలో వారువిఫలం అవుతున్నారు.ఈ విషయంలో పిల్లలతప్పు కూడా ఏమీ లేదు.సహజంగా పిల్లలు తమతల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. వారు తమ పెద్దలను గౌరవించకపోతేపిల్లలు కూడా పెద్దలనుగౌరవించరు. ఇంకొకముఖ్యమైన విషయంఏమిటంటే పిల్లలు తమఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. గెలుపుఓటములు దైవాధీనాలు.ఓడిపోయామని, పరీక్షల్లోతప్పామని ఆత్మహత్యలకుపాల్పడే పిల్లలు ఎందరో.ఈ విషయంలో తల్లిదండ్రులేతమ పిల్లలకు ధైర్యం చెప్పేప్రయత్నం చెయ్యాలి. ఓటమిని తట్టుకుని…
Read More
ఆమ్మాయే నవ్వితే,,,,!!

ఆమ్మాయే నవ్వితే,,,,!!

ఆమ్మాయే నవ్వితే,,,,!! వెన్నెలలు గుప్పించే చంద్రవదనీనవ్వులు పూవుల్లా నక్షత్రాల చమక్కుల్లానగవులు విరబూసిన మల్లియలుపలువరుస తెల్లని చేమంతులు విరబూసిన చందంనింగిలో చంద్రుని పక్క చంద్రవదనివా,,,,,,నీ చిరునవ్వులతో కుర్రకారు మతులు పోగొట్టే కలువపూవు సౌందర్యంఆ ఆనందాల సోయగాలలో ఓ స్వేతజాతి చకోరితెలుపు నూగునూగు వెంట్రుకలు విరబోసుకునితెల్లని సన్నజాజులు విరబూసినట్లు దరహాసములుఏ దివినుండి భువికి దిగివచ్చిన అప్సరసవోమతిపోగొట్టే నగవులతో శిల్పి తన కళతో తీర్చిదిద్దిన సజీవ శిల్పానివా,,,,,,,ఏమి ఆ సురుచిర సౌందర్య సురభామినితేనెలూరు ఆ కళ్ళు మచ్చికచేసిన చిరుత కళ్ళలానిజంగా ముగ్దమనోహర సౌందర్యం గాంచినంతనేకుర్రకారు మతులు తప్పి మూర్చనలుబోవుట ఖాయం,,,,,,,మనోహరీ నగవుల నయాగర జలపాతం నురగల్లో జలకాలాడే స్వెతజాతి పుష్పమా ,,,,,,,,,,,నీ అందాల నగుమోముకు ఇదే నా సెల్యూట్ - అపరాజిత్
Read More