aakali

ఆకలి

ఆకలి ఆటవెలది పద్యము బక్క చిక్కి నట్టి బాలున్ని ఆకలి వెంటబడి తరుమగ వేదనాయె దీనవదనుడయ్యి దిక్కెవ్వరూలేక చేయి చాపి అడిగె చేతగాక - కోట
Read More

ఆకలి

ఆకలి ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖం ఎరుగదు అంటారు పెద్దలు ఆకలి తీర్చేది అన్నం అది పెట్టే వాడు రైతు ఇప్పటి రోజుల్లో అన్నం పెట్టే రైతే ఆకలి అంటున్నాడు ఆకలి భాద తెలిసిన వాడు జీవితంలో పాఠాలు నేర్చుకుంటాడు ఆకలికి మందు లేదు ఇప్పటికీ అది వుంటే జగమంతా శూన్యం ఆఆకలి తీరని ఆ క్షణం రగులుతోంది మనసు బాధతో ఆకలి చావులు లేని దేశమే సుసంపన్నం అప్పుడే ప్రారంభం అవుతుంది నవ శకం మన అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాతకు వందనం పాదాభివందనం. - జి.జయ
Read More

ఆకలి

ఆకలి మధ్యతరగతి వారికి గౌరవం... దిగువ మధ్యతరగతి వారికి పేదరికం... మనిషికి విలువను నేర్పించే గొప్ప ఆయుధం... మనిషి తిరుగుబాటును సూచించే సంకేతం... వ్యయప్రయాసాల మధ్య సామాన్యుని జీవనం... అల్లరిమూకల సమూహంలో యువతి రక్షణ... మనిషిని మనిషిగా గుర్తించేది... మనిషిని సమూహానికి దగ్గర చేసేది మరియు దూరంగా విసిరేసేది... మనిషి మరో మెట్టుకీ దిగజార్చేది... మనిషిని మరో మెట్టు ఎక్కించేది... - గోగుల నారాయణ
Read More