aksharalipi peru leni bandham

పేరు లేని బంధం

పేరు లేని బంధం అన్ని మంచి విషయాలు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. జీవితం అంటేనే ఒడిదుడుకుల ప్రయాణం. అలాంటి సమయం లో నాకున్న ఏకైక బంధం నాన్న. నాన్న అనారోగ్య సమస్యల వల్ల ఆయన్ని కోల్పోవాల్సి వచ్చింది. నాన్న చేసేది చిన్న ఉద్యోగమే, ఆస్తులు కూడా లేవు. అమ్మకు ఇల్లు తప్ప వేరే ఏమి తెలియదు. అన్ని చూడాల్సింది నేనే. ఊర్లో ఉన్న పెద్ద మనుషులు తలా కాస్త చెయ్యి వేయడంతో నాన్న అంతక్రియలు నిర్వహించారు. ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. ఇల్లు ఎలా గడవాలి అన్నది ఆ సమస్య ఇది లేని వారికి పెద్ద సమస్య అయితే ఉన్నవారికి చాలా చిన్న సమస్య అసలు సమస్య కాదు. ఇక ఇంటిని అమ్మని చూసుకోవడానికి నేనే పెద్దదిక్కు కాబట్టి ఉన్న ఊర్లో ఆస్తులు ఏమీ లేవు ఉన్నదొక ఇల్లు అమ్మను ఒక దాన్ని వదిలి వెళ్ళలేక తనని…
Read More

పేరు లేని బంధం

పేరు లేని బంధం పేరు లేని బంధాలకు కూడా ప్రేమ అనే రుణ బంధమే! మన కోసమై వెచ్చించిన సమయం ఎదుటివారితో వేరుపడని బంధమే కదా! మరొకరితో మృదు భాషనైనా చేయు సేవ అయినా మనకు ఉపశమనమే ! కొన్ని బాధ్యతలు పేరు లేని బంధాలను మోసుకొస్తాయి పెంపుడు జంతువులు విశ్వాసనీయ సహచరులు ఏకాంతపు చీకటిలను తొలగించే సహవాసకులు ఇది పేరు లేని బంధమే! ఒంటరితనాన్ని తెలియకుండా చేసే వ్యవసాయ క్షేత్రాలు బంధమై నిలిచేను ! అణువణువు నా అభిమానాన్ని నింపుకుంటూ నివసిస్తున్న గృహం ఉత్తమమైన బంధం! నలిగే మనసుకు నాలుగు దిక్కులే తోడుగా అందించే అందమైన బంధం! కాల క్షేపం కోసం సంతోషాన్ని ఇచ్చే మీడియా సాధనాలు అన్ని బోధపడే బంధాలే! ప్రేమకు వారదులుగా నిలిచి మానవతను నింపే ప్రతిఒక్కటి మనిషి మైత్రీవనంలో పేరు లేని బంధాలుగా మిగులుతాయి.....? - జి జయ
Read More

పేరు లేని బంధం

పేరు లేని బంధం ఒంటరిగా ఉన్న నాకు తోడుగా వచ్చావు.. కన్నీటిగా మారిని నా కళ్ళకు ఆనందాన్ని పరిచయం చేశావు.. నాలోని బాధను పంచుకోగా వచ్చావు... ఎవరు లేని నాకు నేనున్నా అనే బరోసానిచ్చావు.. నీకు నేనున్నా అని నా చేయి పట్టుకుని నడిపించావు... ఎన్నో కలలు కనే నా కళ్ళకు తోడై నిలిచావు.. నాకు సంతోషాన్ని పరిచయం చేశావు.. కన్నీళ్లను తరిమేసావు.. ఒంటరిగా ఉన్న నా ఈ జీవితంలో అడుగు పెట్టిన నీకు ఏ పేరు పెట్టను..? ఏ రక్తం సంబంధం ఉందని నాకు ఇవ్వన్నీ చేశావు..? ఏ జన్మ బంధానివి నువ్వు..? ఈ జన్మకు నాకు ఇలా తోడుంటున్నవు.. నీతో ఉన్న పరిచయానికి, ఒక పేరంటూ నేను పెట్టలేను... ఏ పేరు లేని బంధంగా... నిలిచిన మన ఈ పరిచయానికి కాలమే తగిన పేరు నిర్ణయిస్తుంది అని భావిస్తున్నాను.. - వనిత రెడ్డీ
Read More