aksharalipi storys

కౌగిలి

కౌగిలి ఈ కరోనా ప్రపంచాన్ని ఆపింది, ఎక్కడి వారిని అక్కడే ఉండేలా చేసింది కాలాన్ని ఆపేసింది. కన్నీటికి  కారణం అయ్యింది. ఆకలి కేకలు పెట్టించింది కూలిలకు పని లేకుండా చేసింది. వేల ఉద్యోగాలను తీసింది. రైళ్ళు, బస్సులు,ప్లేన్స్ ని ఆపింది. అన్ని సరిగ్గా ఉన్నా అవిటివారిని చేసింది, కళ్ళున్నా గుడ్డి వారిని చేసింది, కూలి చేసుకుని పొట్ట పోసుకునే వారికి అది కూడా దొరక్కుండా చేసింది. ఉన్నవాడు, లేని వాడు, రాజకీయ నాయకుడు, డాక్టర్, సినిమా యాక్టర్, లాయర్, జర్నలిస్ట్, డ్రైవర్,పేద, గొప్ప అనే తేడా కనికరం ఏమి లేకుండా అందర్నీ అంటుకుని తన వారెవరో పరాయి వారెవరో తెలిసేలా చేసింది. ఎంత ఆస్తులున్నా బంగారం భూములు ఉన్నా, ఖరీదైన బట్టలు వేసుకున్నా, చినిగిన చీర కట్టుకున్నా అందరికి కావలసింది చివరికి చేరేది కాటికే అని తెలిపింది. ప్రపంచాన్ని స్థంభింప చేసింది. కాలం ఆగిపోయింది, సమయం కదలలేక పొయింది. వలస వచ్చిన…
Read More

కుక్క బతుకు పార్ట్ 2

కుక్క బతుకు పార్ట్ 2 అయ్యో అమ్మో ఈ బాధ భరించలేను, నాకే ఇది రావాలా? అయ్యో రామా నాకే ఎందుకు ఇలా జరగాలి, దేవుడా నన్ను బ్రతకనివ్వు, బతికే దారి చూపు, అమ్మో అయ్యో అదేంటి నా పైకే వస్తుంది. అయ్యో నా కళ్ళు కూడా కనిపించడం లేదే, అమ్మో ఎంత ప్రమాదం తప్పింది కస్తయితే లారి నన్ను తినేసేది, దేవుడా నువ్వు ఉన్నావయ్య నన్ను ప్రాణాలతో నిలబెట్టావు. అదే చేత్తో ఇంకా కాస్త దయ చూపయ్యా, ఈ ప్రాణాలు నిలుపుకోవాలి అంటే కాసిన్ని మెతుకులు దొరికేలా చెయ్యి... ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా ఇప్పుడు బాధ పడుతున్నా, అయ్యో ఉన్నప్పుడు తినలేక పోయాను. పెట్టిన చేతిని విదిలించి ఉంటాను . అందుకే నాకిప్పుడు ఇలా అవుతుంది. హే భగవాన్ నన్ను కాపాడు. అయ్యో ఎవరూ లేరెంటి... రోడ్ల పై ఎప్పుడూ గుంపులు గుంపులుగా ఉండే జనాలు…
Read More

కుక్క బతుకు

కుక్క బతుకు అబ్బా ఎంత బాగుందో, ఇంత అందమైన దాన్ని చూసి ఎన్ని రోజులు అయ్యింది. ఇలాంటి వాళ్ళు మనకు ఎందుకు తారస పడరో, ఇలాంటి అందగత్తెలు అవారా గాళ్ళకే పడతారు కాబోలు, అబ్బబ్బా ఎన్నెన్ని అందాలు, ఎంతో శ్రద్ధగా పెంచినట్టు, ఎంతో ముద్దుగా పెంచినట్టు ఉన్నాయి. ఇంత శ్రద్ద తీసుకొని పెంచిన అందాలను ఎవడికి ఇస్తారో కానీ ఎంత ముద్దుగా ఉన్నారో, అరే ఇదొక్కటే అనుకుంటే అదేంటి ఎన్నో సీతాకోక చిలుకలు గుంపులుగా వస్తున్నాయి. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నాయో, ఎక్కడ ఉన్నాయో అహ నా జన్మ ధన్యం అయ్యింది. ఇన్నాళ్లు ఆ మిడిల్ క్లాస్ కాలనీ లో అంతా కప్పుకుని ఉన్న అందాలను ఆ కప్పుకున్న చాటు యెత్తులెంత ఉన్నాయో ఊహిస్తూ బ్రతికేసాను. కానీ ఇప్పుడు ఇలా సగం సగం బట్టల్లో కనిపిస్తున్న ఇన్ని అందాలను చూస్తుంటే తట్టుకోలేక పోతున్నాను. ఇన్ని అందాలు అహ నా రెండు కళ్ళూ ఎంత…
Read More