aksharalipi tanuvu

తనువు

తనువు తనువుకు చాలని తన్మయత్వం గుప్పెడంత గుండెకు ఆకారం స్పందనలన్నీ తనువే చేయాలి పులకించినా జలదరించినా మనసు భాషల ఊసులు తనువు తరచి చెబుతుంది శ్వాస ధ్యాసల రూపమే విడదీయని బంధమే తనువు పెనవేసిన తనువు మనువుల సమ్మిలతమే ప్రతిసృష్టికి మూలమే కదా ఈ జగతి ....? - జి జయ
Read More

తనువు

తనువు తనువు తనువు ఏకమై పూల పోదరింటిలో కాపురముంటూ నీ ప్రేమలో మమేకమై పోతూ మనింటికి యజమానినవుతూ ఇద్దరం ఒక్కటిగా మారుతూ ఒకరినొకరం అర్దం చేసుకుంటూ ప్రేమ లో మునిగితేలుతూ బాధ్యతలను పంచుకుంటూ ఓదార్పునై నీ ఇంటి ఇల్లాలునై నీ కంటి పాపగా మారి వంశాన్ని వృద్ది చేసిన క్షణానా నా తనువు మనసు పులకరించి పోతూ ఆనందాన్ని పంచుకొంటూ కొత్త బాసలు చేసుకుంటూ జీవన పయనం సాగిద్దాం.... - భవ్య చారు
Read More