మా వోడు
మా వోడు నేను అంటే మాలచ్చ ని ఇక్కడ నాలుగు ఇళ్లలో పని చేసుకుంటూ నాకున్న ఒక్కగానొక్క కొడుకును సాదుకుంటు ఉన్నాను. ఇదిగో ఈ అమ్మ నా కథ ఎదో రాస్తా అంటే ఆ అమ్మకు నా ఈవరం చెప్తున్న, మా వోడు అదే నా బిడ్డ తండ్రి నాకు మొగుడు నారడు, ఆడి పేరు నరయ్య కానీ అందరూ అన్ని నారాన్ని సేశారు, నను అలాగే పిలుత్తా అన్ని అప్పుడప్పుడు అంటే మీకు తెలిసి పోయిoది కదా అప్పుడే మా వోడు కాస్త నా మాట ఇనుకుంటూ ఉంటాడు... అప్పుడే కదా మగాడు పెళ్ళాం మాట వినేది, నన్ను అలా పిలవమని కూడా అంటాడు. నేను అలా పిలిస్తే వాడికి ఇష్టం అని అంటూ ఉంటాడు ఆ సమయానికి వాడికి ఏదీ తోస్తే అది మాట్లాడుతూ ఉంటాడు, వాడి నోరు, వాడి ఇష్టం ఆ రాత్రికి వాడు చెప్పింది వింటూ,…