bhavya charu

కాలతీతo

కాలతీతo జీవితంలో బాల్యం ఒక మధుర జ్ఞాపకం. ఆ వయసులో ఏం చేస్తున్నామో తెలియదు. ఏం చేసినా అందరికీ ముద్దుగా బాగుంటుంది అందరూ దగ్గరికి తీసుకుని ముద్దులాడతారు. ఆ తర్వాత మెళ్లిగా బాల్యం కరుగుతూ, జరుగుతూ పాఠశాలలోకి మారుతుంది. అక్కడా సంతోషమే. తోటిపిల్లలతో పాటు ఆడుకోవడం. కొత్త పరిచయాలు. కొత్త తరగతులు. ఒక్కో తరగతులు మారుతూ ఒక్కో విషయాలను ఒక్కో రకమైన జీవితాన్ని చూస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటాం. అక్కడ కొన్ని రోజుల వరకు మనమేం చేసినా ఎవరూ ఏమి అనరు ఎందుకంటే పసి వాళ్ళు తెలియదు అనే ఆలోచనతో, ఒక్కో తరగతి పెరుగుతూ ఉంటే అప్పుడు అంటుంటారు ఇంకా చిన్నపిల్లాడివా? ఆ మాత్రం తెలియదా అంటూ మొదలు పెడతారు. అప్పుడు కూడా ఏమి పట్టించుకోము. ఆలోచన లేదని వేరే పెద్దలు సర్ది చెప్తారు. తెలియనివి తల్లి తండ్రి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. వాటిని ఆకళింపు చేసుకొని ముందుకు వెళ్తాం.…
Read More

గణతంత్ర దినోత్సవం నీవెక్కడ

గణతంత్ర దినోత్సవం నీవెక్కడ స్వతంత్రమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా మా ఇష్టం వచ్చినట్టు జీవోలు రాసేస్తాం, మాకు నచ్చినట్టు పరిపాలించుకుంటాం. మా చుట్టాలకు, పక్కాలకే సీట్లు ఇచ్చుకుంటాం, పదవులు ఇచ్చుకుంటాం, వేలు విడిచినా చుట్టాలకు తోడు, పలికిన పక్కాలకి అధికారాలన్నీ అంటగట్టేస్తాం. లేనిపోని పదవులన్నీ సృష్టిస్తాం ఏవేవో పథకాలు అంటూ టెండర్లేసి డబ్బులు నొక్కేస్తాం, ఓటు వేసిన మనిషి నెత్తినె మొత్తుతాం, పెళ్ళాల పేరిట పదవులు కొట్టేస్తాం, వాళ్ల నెత్తిన ముసుగేసి మూలకు కూర్చోబెెట్టేసి అధికారానంత దుర్వినియోగం చేసేస్తాం, జనాల కళ్ళల్లో వాళ్ళ వేలితో వారినే పోడుచుకునేలా చేసేస్తాం, స్వతంత్రమా క్షమించుమా మాకు నీతో పని ఏమీ లేదమ్మా... పెద్ద పెద్ద ప్రాజెక్టు అంటూ డిజనులన్నీ మార్చేస్తాం గంట గంటకు మాటలన్నీ మారుస్తూ అప్పులు ఎన్నో చేసేస్తాం ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ పన్నుల బాటలో ధరలన్నీ పెంచేసి, ప్రజల వద్దనే వసూలు చేసి నిధులు ఏవీ లేవంటూ…
Read More

పట్టపగలు వెండి పూలతోటలో

పట్టపగలు వెండి పూలతోటలో పాఠశాల విద్యార్థులతో పాటుగా ఎవరైనా టీచర్స్ కూడా వెళ్ళాలి అంటూ పాఠశాల లో ప్రధాన ఆచార్యుల వారు చెప్పడం వల్ల ఎప్పుడూ ఆ ఊరు దాటి వెళ్ళని నేను వాళ్ళతో వెళ్తానంటూ చెప్పాను. కానీ వెళ్లడానికి ఇంట్లో పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. వద్దని, నీకేం తెలియదు అని ఇంట్లో వాళ్ళు అంటే, నేనెప్పుడూ వెళ్ళలేదు వెళ్తాను అంటూ నేను గొడవపడడం, చివరికి నా మాటే నెగ్గి వెళ్లడానికి సిద్ధం అయ్యాను. తోటి వారితో కలిసి మరొక కొత్త ప్రదేశానికి వెళ్ళడం, అది ఒక రోజంతా వేరే కొత్త ప్రదేశాలు చూడడం ఒక రకమైన మజాగా వుంటుంది కాబట్టి తినడానికి తలో రకం చేసుకు వస్తాము అన్నారు మిగిలిన వారు. మరి నేనేం చేయాలి అన్నాను. మీకెందుకు లెండి మాతో వస్తె చాలు. మీ మనసు కాస్త కుదుటపడుతుంది అంటూ నేస్తాలు, నా గురించి అన్నీ తెలిసిన…
Read More

ఒక చీకటి రాత్రి

ఒక చీకటి రాత్రి నాన్నగారి సంవత్సరికం వస్తూ ఉండటం వలన ఊర్లో ఉన్న ఇంటికి వెళ్లి బాగు చేయించాలని రెండు నెలల ముందే అన్ని సర్దుకుని వెళ్ళాం అమ్మ, నేను, బాబు, అటు నుండి అమ్మమ్మ కూడా వచ్చింది. ఇద్దరు తమ్ముళ్ళు వారి ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. పొద్దున్నే లేవడం, వంట చేయడం పక్కకు పెట్టుకోవడం ఆ తర్వాత వచ్చిన కూలీలతో పని చేయించడం వాళ్లకి మధ్య మధ్యలో టీ పెట్టి ఇస్తూ ఉంటే వాళ్లు బాగా పని చేస్తారని అనుకుంటూ అది పెంకుటిల్లే కాబట్టి గుణపింకలు కొనుక్కు రావడం అవి పగలకుండా జాగ్రత్తగా ఓ పక్కకు పెట్టడం ఓ పక్కకు బాగు చేయిస్తూ మరో పక్కన మేము ఉండడం జరిగింది. ఇల్లంతా బాగా అయిపోయింది. ఇంకా సంవత్సరికానికి 15 రోజులు ఏమో ఉంది రావలసిన వాళ్ళందరికీ ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్లు చేసి…
Read More

నరక యాతన

నరక యాతన ఒక పట్టణంలోని కాలేజీలో ఫేర్ వెల్ పార్టీ జరుగుతుంది. పిల్లలందరూ చాలా బాగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కోలాహలం మధ్యలో చైత్ర చాలా హడావుడిగానూ, అందంగానూ తిరుగుతూ ఉంటుంటే కుర్రకారు ఆమె అందాలని చూస్తూ గుటకలు వేస్తూ ఉన్నారు. చైత్ర చాలా అందమైనది అన్నిటిలో చురుకుగా పాల్గొంటుంది. చదువులో కూడా ముందు ఉంటుంది. చాలా మంది కుర్రకారుకి అమెంటే చాలా ఇష్టం ఎన్నో ప్రేమలేఖలు వచ్చినా తను చాలా లైట్ గా తీసుకుంది తప్ప ఎవరికీ ఏమీ చెప్పలేదు. కొన్నాళ్ళు ఎదురు చూసిన తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ అయ్యి, ఎవరి చదువులో వాళ్ళు పడిపోయారు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా, అవునే చాలా బాగా జరిగింది. ఇంత బాగా జరుగుతుందని అసలు అనుకోలేదు. అంటూ చైత్ర తన ఫ్రెండ్ ఆనంది ఇద్దరూ నడుచుకుంటూ కాలేజ్ గేటు బయటకు వచ్చారు అప్పుడే వచ్చిన ఆనంది తండ్రి…
Read More

ఒక దివ్య కథ

ఒక దివ్య కథ మొన్న ఒక కథ చెప్పాను గుర్తుందా సరే లేకపోతే నేనే గుర్తు చేస్తాను లెండి. కథ పేరు నిజానికి నిందలెక్కువ అని, గుర్తుందా లేకపోతే మళ్లీ లింక్ ఇస్తాను చదవండి. దానికి మరో కొనసాగింపు గా ఈ కథ ను చదవండి. అందులో ఇద్దరూ మిత్రులు మరో ఆవిడ గురించి చెప్పాను కదా ఇది ఇంకో రకమైన కథ.. మరి ఆ కథలోకి వెళ్దాము... అందమైన కుటుంబం భార్య, భర్త తన చిన్న పిల్లలతో హాయిగా సంతోషంగా ఒక చిన్న పల్లెటూర్లో కాపురం చేస్తోంది దివ్య. తను బాగానే చదువుకుంది అయినా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తన భర్త తన ఇష్టా ఇష్టాలను గౌరవిస్తాను అని మాట ఇవ్వడంతో అలాగే తనకు పల్లెటూర్లో ఉండడం అంటే చాలా ఇష్టం అవడం వల్ల ఈ పెళ్లికి ఒప్పుకుంది. దివ్య అత్తమామలు కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళకి నలుగురు…
Read More

ధీర వనితలు

ధీర వనితలు స్వాతంత్ర్య భారత దేశంలో మహిళలకు ఇచ్చే విలువ తక్కువే అయినా, కొందరు మహిళలు వాటిని అధిగమించి బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మొల్ల నుండి నేటి తమిళ సై గారి వరకు పోరాడుతూ వచ్చిన వారే.... అయితే వారు ఈనాడు ఈ స్థానంలో ఉండడానికి చేసిన త్యాగాలు, ఎదుటివారు దాడి చేసినా తట్టుకుని నిలబడి మరీ తాము అనుకున్నది చేస్తూ, యువతులకు యువతకు ఆదర్శంగా నిలిచారు, నిలుస్తున్నారు. ఒక్క వీరే కాదు మన ఇళ్ళలో ఉన్న అమ్మమ్మ, నాయనమ్మ నుండి అందరూ తమ హక్కుల కోసం పోరాడుతున్నవారే, ఇప్పటికీ కూడా ఇంట్లో మహిళల నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేది బహిరంగ రహస్యం. కేవలం కాగితాలతో రాస్తున్నారు తప్ప నిజంగా ఏ ఇంట్లో ఏ మహిళకు గౌరవం లేదన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అసలు విషయానికి వస్తే భారత దేశంలో మహిళలకు ఇచ్చే విలువ, గౌరవం, స్వేచ్చ…
Read More

రైతు గొప్పతనం

రైతు గొప్పతనం తనకంటూ ఏమి మిగల్చకుండా ఉన్నదంతా భూమి తల్లిని నమ్ముకుని భూ తల్లే తనని కాపాడుతుందని నమ్ముకుని పంట వేస్తాడు రైతు, ఎండనక, వానానక ఆ భూమి లో ఉన్న పంటను కంటికి రెప్పలా కాపడుకుంటాడు. ఎన్నో మందులు వేస్తూ, కలుపు తీస్తూ, కన్నబిడ్డలా చూసుకుంటాడు అదే సమయంలో వాన దేవుడికి కోపం వచ్చి పొట్టకొన్నచ్చిన పంటను పాడు చేసినా ఆదరక, బెదరక ఉన్నదాన్ని కాపాడుతూ తాను ధైర్యంగా ఉంటూ నలుగురికి ధైర్యం చెప్తూ, ఆ కాస్త పంటను మిల్లుకు తీసుకుని వెళ్తాడు. అక్కడ తన వంతు వచ్చేవరకు చలిలో మగ్గుతూ, ఓ పూట తిని, ఓ పూట తినక , ఒప్పిగ్గా ఎదురుచూస్తారు. తనవంతు రాగానే పంటను మిల్లులో సగం రేటు కైనా అమ్మేసి తిరుగు ప్రయాణం అవుతాడు. ఆ మిగిలిన డబ్బుతో పస్తులు ఉన్నా చేసిన అప్పు తీర్చేసి, మళ్లీ ఆశగా భూ మాతను నమ్ముకుని మళ్లీ…
Read More

భారతదేశ గొప్పదనం

భారతదేశ గొప్పదనం సర్వ మతాలు, సర్వ ప్రాంతాలు, సర్వ కులాలు, సర్వదేవతలు, సకల ప్రాంతాల వర్గాల వారు బ్రతకగలిగే ఏకైక దేశం మన భారతదేశం. భారతదేశం అన్ని మతాలను అన్ని కులాలను అన్ని వర్గాలను ప్రాంతీయ బేదం లేకుండా ఆదుకునే, అన్నం పెట్టే ఒక అన్నపూర్ణ బ్రతకలేని వానికి పని ఇచ్చి వాడికి జీవితాన్ని చూపించగలిగే గొప్ప దేశం మన భారతదేశం శత్రువైన అతిధి దేవోభవ అని అంటూ శరణు వచ్చిన వారికి అవేమిచ్చే కల్పవృక్షం మన భారతదేశం. ఎన్నో మతాలవారు, ఎన్నో కులాల వారు ఇక్కడ బ్రతకగలుగుతున్నారు అంటే అది మన దేశ గొప్పతనం ఎవరైనా మనుషులే అంటూ సాటి మనిషికి గౌరవం ఇచ్చేది మన భారతదేశం ఒక్కటే. పేద, గొప్ప తేడా లేనిది బీద, బిక్కి చూడనిది మనుషులకు విలువ నిచ్చేది వారిని అన్నివేళలా కాపాడుకునేది భారతదేశం. రాజుల కాలం నుంచి ఈనాటి రాజకీయ నాయకుల వరకు ఎవరైనా సరే…
Read More

ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు ఏవండీ నేనో మాట్లాడగనా అందావిడ. ఆలస్యం ఎందుకు అడుగు అన్నాడు అతడు. ప్రకృతి అంటే ఏంటండి అవి ఎలా ఉంటాయి కాస్త నాకు విడమరిచి చెప్తారా అందావిడ గోముగా దానికి ఏం భాగ్యం చెప్తాను ఎందుకు చెప్పను విను మరి... ప్రకృతి అచ్చం నీలా ఉంటుంది అంటూ ఒక్క ముక్కలో చెప్పాడు అతడు. మీరు మరీను నేను ఎలా ఉంటానో నాకు ఎలా తెలుస్తుంది చెప్తేనే కదా తెలిసేది అంటూ మూతి ముడుచుకుంది. నిలువెత్తు నీ రూపం ప్రకృతి గుండ్రటి నీ ముఖం ప్రకృతి వెడల్పాటి నీ నుదురే మైదానం పెద్దగా ఉన్న నీ కళ్ళలో అప్పుడప్పుడు ప్రవహించేదే సాగరం, రెపరెపలాడే నీ కను రేప్పలే ఆల్చిప్పలు ఆ ఆల్చిప్పల కింద సంపెంగ తోట ఆ తోటలో ఎన్నో సంపెంగ పూలు కోపంలో ఎరుపు, విషాదంలో నలుపు శాంతంలో తెలుపు, ప్రేమలో అరుణారుణర్ణాలకాంతులెన్నో... ఆ కాంతులన్నీ నీ మోములో…
Read More