gatham story

గతం

గతం గతమే గతిని నిర్దేశించేది. జ్ఞాపకంలా గుర్తుండిపోయేది. అనుభవాల సారమిది. అనుభూతులు మిగిల్చేది. వర్తమానానికి దిక్సూచిది. భవిష్యత్తుకు నిఘంటువిది. గతమనేది జీవిత కాలపు గుర్తు. గతమే లేని జీవితం లేదు. గతంలోనే జీవనం సాగిస్తే, వర్తమానానికి జీవం వుండదు. భవిష్యత్తు జీవితం వుండదు. -బి రాధిక
Read More

గతం

గతం గతం నిన్ను నడిపే దిక్సూచి కావాలి గతాన్ని నెమరవేసుంటూ గమనాన్ని గుర్తుపెట్టుకొని గతం చేసిన గాయాన్ని మదిలో తలచుకొని వేసే ప్రతిఅడుగు నిర్దిష్టమైన ప్రణాళికతో గమ్యం వైపుకి వెళ్లే ప్రయాణాన్ని గట్టిగా ప్రయత్నించి చేరాలి - హిమ
Read More

గతం

గతం గతమంతా ఒక పిడ కలగా గడిచిన రోజులు ఒక అనుభవంగా గడిపిన గడ్డు కాలం ఒక గుణ పాఠంగా గడిచిన జ్ఞ్యాపకాలు విషాదాలుగా గతం ఒక మారుతున్న కాలానికి గుర్తుగా అనుభవాల పాఠాలుగా బాధల మయంగా బ్రతుకుతున్నప్పుడు గుర్తుకు తెచ్చుకోలేని గురుతులుగా మారి భవిష్యత్తును భయపెడుతున్నప్పుడు రాబోయే కాలంలో అయినా ... గతం పడగ నీడ పడకూడదు అని గత పీడ కలలన్నీ మర్చిపోయి మారుతున్న కాలంతో పాటు కాస్తయినా సంతోషాన్ని వెతుక్కోవాలి అని ఉరుకులు పరుగులు పెడుతూ, ఉవ్విళ్లూరుతున్న కోరికలతో...... కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని కోరుకోని దేవ్వరు. భవిష్యత్తు అయినా బంగారు మయం అవ్వాలని అన్ని బాధలు పోయి, పీడ కలలన్నీ కలలే అని కొత్త కలలతో కొత్త జీవితాన్ని కోరుకుందాం... కొత్తగా ఉందాం.... - భవ్యచారు
Read More