hanumantha

సూర్యుడు

సూర్యుడు నీ రాక తోనే మొదలయ్యేనుగా నా జీవితం నీవు స్పర్శించనిదే నేను వికసించను నీకై ప్రతీ ఉదయం వేచిచూస్తూనే ఉన్నా నీ వేడిని తట్టుకో లేకపోయినా నీ కిరణం ముద్దాడాలని వేచిచూస్తున్న నీవులేనిదే ఏ జీవి జీవించజాలదు అలా అని నీతోపాటు ఉండనూలేము నీ అస్తమయం నాకు అంధకారము నీ ఉదయం నాకు ఉత్సాహం నీతో పోటిపడాలని నిత్యం కలగంటూ.. నీకై ఎదురు చూసే నీ నేను - హనుమంత
Read More

ఆశ

ఆశ నిశీధిని చీల్చుకొంటూ ఆటంకాలను ఎదుర్కొంటూ జనం కోరిన వెలుగవ్వర ఎరుపెక్కిన ఉదయమల్లే నీ రాక కొరకు ఎదురుచూసే పూలల్లే ఈ జగమంతా కిరణాలను ప్రసరించర ఎరుపెక్కిన ఉదయమల్లే ముందే పసిగట్టేనుగా గువ్వలు, కాకులు ఎరుపెక్కిన ఉదయం కోసమే తమ తపనంతా అని నిద్దురపోయిన జీవితాలకు మరో వెలుగవ్వాలి నీ గమ్యం ఇంకొంత భలం కూర్చర ఎరుపెక్కిన ఉధయమల్లే ఓడిపోయిన బతుకులకు మరొక్క అవకాశం అంటూ గెలిచే దారి చూపరా ఎరుపెక్కిన ఉధయమల్లె విప్లవ జ్యోతిలా క్రీడా కాగడలా దేవుని దీపంలా ఎరుపెక్కే ఉదయం - హనుమంత
Read More

క్రిస్టమస్

క్రిస్టమస్ నకిలీపురం నుండి నా చెల్లెలు "నీ కూతురిని చూడాలనిపించింది తీసుకునిరా అన్నయ్యా అని కబురుపెడితే”. నేను, నా ముద్దుల కూతురు ఇద్దరము వెళ్ళాము. బస్టాండు నుండి ఒక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళింటికి. పాపని భుజాలమీద ఎక్కించుకొని బయలుదేరాను. వీది నిండా లైట్లు, భక్తి పాటలు, ప్రార్థనలతో హోరెత్తుతోంది. పాప ఆ పండుగను చూసి ఎంతో ఆతృతగా ప్రశ్నలు అడుగుతోంది. ఎండ ఎక్కువుగా ఉండటం వల్ల నేను ఏమీ చెప్పలేక పోయా. అక్కడున్న ఐస్క్రీమ్, బాంబే మిఠాయి తింటూ శాంటాక్లాస్, క్రిస్మస్ ట్రీ, మొదలగువాటిని ఆస్వాదిస్తూ నిద్రపోయింది. ఇంటికి వచ్చి అందర్నీ పలకరించి, చుట్టాలు ఇంటికి పోయివచ్చినా గానీ పాప ఇంకా లేవలేదు. టైమ్ 5 గంటలయింది పాపని నిద్ర లేపి స్నానం చేయించి, వంటా వార్పు కార్యక్రమాలు చేసేటప్పటికి 7:30 నిమిషాలయింది మా చెల్లికి. ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేసి ఆరుబయట నులక మంచ మేసుకొనో…
Read More

అన్న

అన్న నా పేరు హరిత. నేను Z.P.H.S లో ఏడవ తరగతి చదువుతున్నా. నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్తాను. వెళ్ళే దారిలో ఒక చిన్న గుడిసె, అక్కడ ప్రతిరోజూ గొడవ జరుగుతూనే వుండేది ఎందుకిలా గొడవ పడతారు అని నా స్నేహితులను అడిగా “వాళ్ళింట్లో మొత్తం ముగ్గురున్నారు ఆ అన్న పేరు హరీష్. అతను ఇంటర్మీడియేట్ పాస్ అయ్యాడు. వాళ్ల అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది అప్పటి నుండి మద్యం, ధూమపానం, అమ్మానాన్నల దగ్గర ఉన్న డబ్బును లాక్కొని వృథాచేయడం వంటివి చేస్తున్నాడు” అని చెప్పారు. సరేలే అని బడికి వెళ్ళాము. డిసెంబర్ నెల కాబట్టి నూతన సంవత్సరం వస్తుంది కదా! అందరూ ఏం చేయాలని అనుకుంటున్నారు అని టీచర్ అడిగింది. కొంతమంది కొత్తబట్టలు, కొంతమంది ఊరికి, గుడికి వెళ్ళాలి అని చెప్పారు. నేను కూడా ఎదో…
Read More

కల

కల హమ్మయ్య ఆఫీస్ టైమ్ అయిపోయింది ఇంటికెళ్ళి అన్నం వండుకుని తిని కమ్మగా నిద్రపోవాలి. అబ్బా! ఈ మగవెధవలు ఒకటి రోడ్డు నిండా వాళ్ళే ఉంటారు. ఏది చూడాలన్న, ఎవర్ని చూడాలన్నా భయంగా ఉంటుంది అప్పుడే పక్కింటి పంకజం గారు బజారుకు కూరగాయలు తిసుకోవడానికి వెళ్ళి ఇటుగా వచ్చారు. ఏమిటి సీత ఇంతసేపు ఆఫీసులో ఉన్నావా?! నమ్మబుద్ధి కావట్లేదు. ఈ కాలం ఆడపిల్లలు మరీ చెడిపోతున్నారు అని గొణుక్కుంటూ... ఇదిగో సావిత్రి అక్కా ఈ అమ్మాయే మా ఇంటి పక్కన ఉండేది చాలా మంచిది. అన్నట్టూ నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా! ఇంట్లో ఏమైనా సంబంధాలు చూస్తున్నారా!? ఆ ఊరికే అడిగా మా చుట్టాలబ్బాయి ఉన్నాడు అందుకని అడిగా. “ఆ చూస్తున్నారు పంకజం గారు.... సరే మీ ఇల్లు వచ్చింది నేను వెళ్తాను. అదేంటి ఇంట్లోకి రాకుండా వెళ్తావా, సరేలే నేనే చక్కెర కోసం నీ గదికి వస్తాను. అంటూ…
Read More

శ్రీనివాస

శ్రీనివాస ఏడుకొండల్లోన వెలసిన శ్రీలక్ష్మిసమేతుడ వైన నా మొర నీవు వినవ నా భాద నీవు ఎరగవ నీ సేవయే నా ఊపిరి నీ దర్శనమే నా ఆఖరి కాలినడకన నీ కొండకి మార్గముంటే సూపవ వడ్డికాసుల లెక్కలేనా లక్ష్మితోడై ఉయ్యాలలేనా… శేష పాన్పుపై నిధురెనా ఇరుబార్యలతో కబురులేనా…. గుండె గుడిలోన కొలువైన నిన్ను గుండె ఆగే వరకు కొలిచేదము పంచభక్ష్యములతో ఆరాధిం చేదము ఆదుకోవయ్యా శ్రీ శ్రీనివాస - హనుమంత
Read More

ఉద్యమం

ఉద్యమం ఉద్యమం మెరుపు వంటిది ఎక్కడో ఆకాశాన మొదలై భూమండలమంతా ఉలిక్కిపడేలా గర్జిస్తుంది. అది ఎవరికి వెలుగునిస్తుందో ఎవరికి నిశను మిగుల్చుతుందో పిడుగుపాటు కన్నా అత్యంత ప్రమాదకరమైంది ఉద్యమం. అయినా గొప్ప సంకల్పం కలది, భహుషా మనుషుల్ని మెల్కొల్పేది ఉద్యమమే నేమో.... ఉద్యమభావాలు రగల్చని హృదయం అంటూ ఉండదేమో...! సమస్త భూమండలంలో రగిలిన ఉద్యమాలెన్నో, ఉద్యమకారులెందరో? ఉద్యమాల దాహం ఎప్పటికీ తిరదేమో! అపుడపుడు ఉపవాసం ఉంటుంది అంతే బలహీనుల భలమే ఉద్యమం ఎంతటి సామ్రాజ్యాన్నైనా కూల్చగల బలగం ఉద్యమం. ఉద్యమకారులకు నినాదాలే ఆయువు నినాదాలున్నంత వరకు ఉద్యమకారులుంటారు ఉద్యమం గెలుస్తుందని చెప్పలేం గానీ తన ఉనికిని కచ్చితంగా తెలుపుతుంది. రాజ్యాలకోసం జరిగేవి యుద్ధాలు కానీ రాజ్యంలోని బలమైన శక్తిపై జరిపే పోరాటమే ఉద్యమం - హనుమంత
Read More

జండా

జండా తాత ఈరోజు డిసెంబర్ 01 కదా! అవును ఎందుకు బాబు? ఈరోజు ”సరిహద్దు భద్రతా దళ దినోత్సవo” సందర్భంగా కవిత రాయమన్నరు ఎం రాద్దాం తాత? ఎదురొచ్చే తుపాకి గుండుకు ఎదురునిల్చే గుండెరా వాడిది... మువ్వన్నెల జెండాను మురిపించే గుండెరా వాడిది... భరతమాత ముద్దు బిడ్డై భారతావనికి వన్నె తెచ్చేనురా... దేశప్రజల కన్నులలో నిధురై తన కంట్లో నిప్పులు చరిగేనురా... గర్వంగా ముద్దాడిన జండాను నేలకొరిగి కప్పుకొనేర జండాను... కోట్లమంది భారతీయుల అండగ నిలువెత్తున ఎగరవేయగ జండా... - హనుమంత
Read More

కొత్తదారి

కొత్తదారి అనుకోని పరిస్థితుల్లో పుడుతుందోక కొత్తదారి విసిగిన ప్రతి క్షణమున కలిగెను మరోదారి... అవసరానికో దారి అనవసరానికో దారి నీదారిన నువ్వు నాదారిన నేను అక్షరలిపిది మరోదారి... దారులు ఎన్నున్న నీకై వుంది మరోదారి ప్రతిదారిన నీవే అడుగులు.. - హనుమంత
Read More

వ్యధ

వ్యధ కలగంటినే.... బడుగుజీవుల రాత మారెనని అనాధ బతుకులు చెదిరెనని రైతుల పాలిట ప్రభుత్వం దైవమని కార్మికుల శ్రమ వృథాకాదని స్త్రీమూర్తి కిర్తింప బడునని ఆలయమున దైవం కలదని నరపీడిత సమాజం నలిగేనని భువిపై స్వర్గం కొలువైనదని సంద్రమునైనా ఈదేదనని చీకట్లో వెలుగు నింపేనని తెగిన రెక్కలు కూర్చేదనని నింగినినైనా తాకేదనని కలమున సిరానై పారేదనని కవిత్వమున కవిత్రయమని కళలు వెలుగొందే నలువైపులని అజ్ఞానమనే అందకారం తోలిగేనని కరిగెనే కలలు కన్నీటి కార్చిచ్చుకు కలలు కంటినే కార్యము తలపెట్టక. - హనుమంత
Read More