తను నవ్వింది
తను నవ్వింది హైదరాబాద్: పాతబస్తీ ...ఎప్పటిలాగే రద్దీగా ఉంది.....వచ్చిపోయే జనాలతో.... ఏ ఒక్కరైనా రాకపోరు ...అని చూస్తున్నాడు అతను.... చిన్న చెక్కపెట్టే....నీడనిచ్చే చిల్లుల గొడుగు అతని వారసత్వపు ఆస్తి..... భయ్యా ...ఈ బ్యాగ్ కాస్త కుట్టిపెట్టు ...మేం షాపింగ్ చేసి వస్తాం అన్నది...వచ్చిన ఇద్దరిలో ఒక అమ్మాయి.... అలాగేనమ్మ ...మీరెళ్ళిరండి...నేనిక్కడే ఉంటా....అన్నాడు సైదులు 26 ఏళ్ల వయస్సు ...బలిష్టంగా ఉన్న శరీరం చూస్తే...ఒక్కమాటు పోలీస్ లాగా కనిపిస్తాడు ....ఏపుగా పెరిగిన గడ్డం.... పిచ్చుక గూడు లాంటి జుట్టు....వెనక్కి తోస్తూ...ఒక గొడుగు కింద కూచొని చెప్పులు కొట్టుకుంటూ బతుకుతున్నాడు.... ఉండేది మురికివాడలో ....తనని చేరదీసిన అవ్వ తాత లతో..వారి రేకుల షెడ్డులోనే ఉంటున్నాడు.... తన పుట్టుకకి కారణం ఆడ మగ అని మాత్రమే తెలుసు....పుట్టి బుద్ధేరిగాక....తను పడుకునేది రోడ్డు పైన ...తినేది పెంటకుప్పలలో ...దొరికిందే విందుభోజనం...తన లాంటి వాళ్ళు ఎంత మందో....అక్కడ.... పెళ్లిళ్లు ...ఫంక్షన్లు...చివరికి చావు భోజనాలకు పిలవని అతిథులుగా వెళ్ళి దొరికింది…