నీ కోసమే ఓ సఖీ
నీ కోసమే ఓ సఖీ గతించిన వసంతం మరలా వస్తుందని.. పూలను రాల్చిన చెట్టు మరలా చిగురిస్తుందని.. పచ్చని చిలుక చెలిమి కోసం.. కొమ్మల మధ్యన నే వేచి ఉన్నా.. ఒంటరి గోరింకనై ఇన్నేళ్లుగా.. నీ కోసమే ఓ సఖీ. ఎన్నటికీ రావని తెలియక.. ఇన్నాళ్లూ ఆశలు సజీవంగానే ఉన్నా.. ఇప్పుడెందుకో గుండెను ఏదో వేదన గుచ్చుతున్నట్టుంది.. స్వచ్ఛమైన నా మనసు నువ్విలా కష్టపెడుతుంటే తట్టుకోలేనంటోంది... నువ్ నాతో ఉన్నప్పుడు నీ ప్రేమను నిలపుకోలేకపోయా ఇప్పుడు నువ్ నాక్కాకుండా పోతుంటే ఆపలేకపోతున్నా.. ఈ శిక్షకు నన్ను నేనే నిందించుకోవడం తప్ప నిన్నేమనగలను. ఏళ్ల క్రితం ఇంకిపోయిన కన్నీరెందుకో రెప్పల మాటున దాగలేక మరలా ఉబికివస్తోంది.. ఇదే నిజమైన ప్రేమని ఆ ధారలు చెబుతున్నా.. వాటి మౌన ఘోష వినేందుకు నా సఖి సిద్ధంగా లేనంటే.. నే నేం చేయగలను. ఇది కవిత్వమో..లేక నా రచనా నైపుణ్యమో కాదురా.. ప్రతి అక్షరం మనసు…