love quotes

इंतजार

इंतजार टूट के चाहा है आपको यु ही चाहते रहेंगे... आपके आने का इंतजार यु ही करते रहेंगे.... - Your Love
Read More

వస్తున్నా

వస్తున్నా వస్తున్నా చెలి వస్తున్నా ఆరిపోతున్న నా జీవన వెలుగును.. జీవన జ్యోతి లా వెలిగించావు వస్తున్నా చెలి వస్తున్నా.. నీ చల్లని మాటలతో నీ కరుణమైన చూపులతో శిలగా వున్న నన్ను శిల్పంగా మార్చావు.. వస్తున్నా చెలి వస్తున్నా నీ యెదలో సేద తీరేందుకు.. - అంకుష్
Read More

మనసా

మనసా   మనసా నువ్వు చెప్పేది నేను వినేసా ఎన్నాల్లీ రభస ఇకనైనా ఇవ్వవా భరోసా నీ ఆజ్ఞాపనే నాకు శ్వాస - అర్జున్
Read More

అవని లో…. ఆమె

అవని లో.... ఆమె నా అవని అంతా....ఆమే నా అనుక్షణం.... ఆమే నా ఆద్యంతం....ఆమే నా ఆంతర్యం....ఆమే నా ఆలోచన... ఆమే నా వెలుగు....ఆమే నా భవిత.... ఆమే నా ఆశా... ఆమే నా శ్వాసా .... ఆమే నా అనుక్షణం... ఆమే నా ప్రతీ క్షణం... ఆమే.. నా మరో క్షణం... ఆమే.. నా బంగారం...ఆమే నా సింగారం...ఆమే నా అరవిరిసిన మందారం... ఆమే నా కలల ప్రపంచం అంతా ఆమె.. ఆమె.. ఆమె..ఆమె..ఆమే.. జగత్తు లోని మహిళా మణులందరికీ ఇవే నా హృదయ పూర్వక పాదాభివందనాలు.   - కిరీటి పుత్ర రాంబాబు రామకూరి
Read More

వేలు విలువ!!

వేలు విలువ!! నీ వేలు స్పర్శ కి మైమరచి మైళ్లు నడిచా....! దాన్ని బూని నా దారి మరిచా......! నిన్ను అనుసరించా....! బుడి బుడి నడకలు కావు నావి. బుసకొట్టే వయసు నాది. బుజ్జగిస్తే బోల్తా పడను. అలలు తడిపిన ఇసుకలో నీ పాదముద్రలాయెను నా గుండెలో ప్రేమ ముద్రలు. నా నడక గుడ్డి దాయె .....! నా కన్నులు నీతో నిండి పాయె. పూరెక్క లాంటి నీ చేరెక్క నాకు ఇచ్చె స్థానం నీ పక్క......! పూదోట లాంటిది నీ మనసు, నాకు తెలుసు నీ గమ్యం అదే.....! నీ వేలు స్పర్శకి మైమరిచి మైళ్లు నడిచా.................! దాన్ని బూని నా దారి మరిచా........! నా పయనం ఇక నీతోనే...............! - వాసు
Read More

ఓయ్

ఓయ్ ఓయ్!!! నువ్వలా నవ్వి నా గుండెను కవిస్తే నాలోని అణువణువు నిను ఆకర్షించే నా పెదాలు దాటే పదాలు మొదలు పాదాలు సైతం నీ వైపే పయనమాయే అల్లుకోవా నీ వాడిలా నీ వెన్నెల కౌగిట్లో ! ఓయ్!!! ఎప్పుడో రాసిపెట్టుకున్నా అడగ్గానే నన్ను నీకిద్దామని హ్మ్మ్! నీకో సంగతి తెలుసా నాలోని వెలుగు నువు పంచిన భానుతేజమే నీకెలా ఉందో గానీ నాకు మాత్రం నీ ఊపిరి ఊయల్లో ఊగుతున్న సంబరమే నను మురిపిస్తున్నది అందుకేనోయ్... నా పెదాల నీ పెదాలకిచ్చి నీకై నేనెప్పుడో పయనమయ్యా నీవే నా లోకమని నీతో ఏకమవ హత్తుకో...నీ వెచ్చని కౌగిట్లో -అమృతరాజ్
Read More