madhavi kalla

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి... ఎందరో చిద్రమైన బ్రతుకులు నాశనం అయిపోయాయి.. వాళ్ళకి తోడుగా ఎవరి అండ లేదు..  వాళ్ళు పిల్లలతో ఎన్నో బాధ పడ్డారు.. తీవ్రమైన వడగాల్పులు, చలిగాలులను ప్రకృతి విపత్తులుగా భావించి నష్టపరిహారం ఇచ్చే అవకాశంలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.. ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం. అయితే వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది. అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగాల బారిన పడతాయి... కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం అప్రమత్తంగా ఉండడంతోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు, ఆహార పదార్థాలు సేకరించి పంపడం, సేవాక్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేయాలి... ⁠- మాధవి కాళ్ల
Read More

నాలాగా కాకూడదు

నాలాగా కాకూడదు ప్రేమిస్తున్నాను అని చెప్తే చాలు అది నిజమో అబద్దమో తెలుసుకోకుండా వాళ్ళని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకోవడం తర్వాత వాడి నిజస్వరూపాన్ని తెలిసి అవాక్కయ్యాను.. ఎవరి మాటలు వినకుండా నమ్మి మోసపోయాను. ఇప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరు కోసం నేను ఉండాలి? నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతకాలి.. పిల్లలు కోసం ఉండాలి.. వాళ్ళని బాగా చూసుకొని మురిసిపోతూ వాళ్లకి మంచి బాటలు వేయాలి.. ప్రతి అమ్మాయి జీవితమే నాలా కాకూడదు.. నాలాగా ఏ అమ్మాయి జీవితం పాడు చేసుకోకూడదు. ⁠- మాధవి కాళ్ల
Read More

ప్రియురాలు ఆలిగితే

ప్రియురాలు ఆలిగితే నువ్వు నా మీద కోపంతో వెళ్ళిపోతుండగా నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తూతుంటే నిన్ను పదిలంగా చూసుకోవాలని అనుకుంటూ నిన్ను ఎన్నో రకాలగా బుజ్జగించాను.. నువ్వు నా మాట వినకుండా అలా అలిగితే నువ్వు వెళ్లిపోతే నేను ఏదో సరదాగా చెప్పాను... నువ్వు మాట్లాడకపోతే నాకు ఏమి తోచదే ప్లీజ్ బంగారం నీ అలక వదిలి నాతో మాట్లాడు... నీ మౌనంతో నాకు నరకం కనిపిస్తుంది.. నీ మౌనం అనే సంద్రంలో నేను కొట్టుకుపోతున్నా నీ అలక అనే పానుపు మీద నువ్వు నిద్రపోతున్నావు... నా ప్రియురాలు అలగ ఎప్పుడు వదులుతుందో నా ప్రియురాలు అలిగితే బుజ్జగించడం నా వల్ల కావడం లేదు.. ⁠- మాధవి కాళ్ల
Read More

నాలో మార్పు

నాలో మార్పు ఎన్నో ఆశలు మరిఎన్నో కోరికలు కాలం అనే గడియారంలో నేను ఎటు వైపు వెళుతున్నానో నాకే అర్దం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు కథలు చదవడానికి ఇష్టం పెంచుకున్న అదే సమయంలో కొత్త వాళ్లతో పరిచయాలు అయ్యాయి... ఇంట్లో జరిగే మొదటి శుభకార్యానికి నేను వెళ్ళలేకపోతున్నా అనే బాధలో ఉండగా బాధ తెలియకుండా నన్ను ఆనందంగా ఉండేలా చేశారు... వాళ్ళతో గడిపిన రోజులను నేను ఎప్పటికీ మర్చిపోలేను... కథలు రాయమని ప్రోత్సహించారు.. నేను కూడా అందరిలా రోజు మొత్తం బిజీగా ఉండేదాన్ని... బాధ, సంతోషం, గొడవలు అన్ని రకాలు అనుభవించాను... నాలో మార్పు కారణం చాలా మంది ఉన్నారు.. నన్ను కొన్ని విషయాలలో వెనక్కి తగ్గేలా చేశారు.. ఎంత బాధ పడినా ఒదార్పి లేని మనిషిగా మిగిలిపోయాను... ఇప్పుడిప్పుడే భవిష్యత్తు మీద నమ్మకం కలుగుతుంది.. నాలో మార్పు కారణం ఒకటి అని చెప్పలేను... చాలా ఉన్నాయి.. చిరునవ్వుతూ కొత్త సంవత్సరానికి…
Read More

మనసుకి బాధ

మనసుకి బాధ మనసుకి బాధ అనిపించిన్నప్పుడు కన్నీళ్లు ఉప్పొంగిన గోదారి లా ఆగకుండా ఉప్పొంగుతుంటాయి.. మనసుకి బాధ కలగకుండా ఉండేందుకు నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏదో ఒక సందర్భంలో మనసు బాధ పడేలా జరుగుతుంది.. కానీ ఒకటి నిజం మనసుకి నచ్చిన వాళ్ళతో ఉండే ఆ బాధన్ని మర్చిపోయే మార్గం ఒక్కటే.. మనసుకి బాధ కలిగితే ఉప్పొంగిన గోదారి లా వస్తే మాత్రం అప్పుకోవడం చాలా కష్టం ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి.. ⁠- మాధవి కాళ్ల
Read More

మార్పు

మార్పు ఇంకా ఎన్ని ఏళ్లు దాటిన వారిలో మార్పు వస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు నిన్ను వాళ్ళకి నచ్చినట్టు ఇబ్బంది పెడుతున్నారు.. నీలో ఎప్పుడు మార్పు వస్తుందో నాకు మాత్రం అర్దం కావడం లేదు.. వాళ్ళలో మార్పు రావాలంటే ముందు నీలో చైతన్యం రావాలి అని నేను తనకి చెప్పాను.. ఒక రోజు తనలో చైతన్యం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.. తనలో చైతన్యం రావడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను.. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి నాకు ముందే బుద్ది చెప్పింది.. ⁠- మాధవి కాళ్ల
Read More

నీ రాక

నీ రాక నిన్ను ప్రేమించే ఒక మనిషి ఇక్కడ ఉంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావా... నీ రాక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా.. మనం కలిసి ఉన్నంత కాలం గొడవలు పడుతూ కాలాన్ని మార్చిపోయాము.. కారణాలు ఏవి అయిన నువ్వు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు.. నీకై నా ఎదురు చూసే నీ నేను గా నీ జీవితంలో మిగిలిపోతాను... ⁠- మాధవి కాళ్ల
Read More

కోపం

కోపం ఆవేశంతో ఉన్న మనిషి చూసి నేను తట్టుకోలేను.. మండే ఎండల్లో ఉండే బాగా చెమటలు పట్టాయి... అలాగే కోపం, ఆవేశంలో ఉన్న మనిషి జీవితంలో కూడా అంతే.. కోపంలో ఉంటే సరిగ్గా ఆలోచించలేము ఆవేశంలో ఎన్నో పొరపాట్లు చేస్తాము.. ఎప్పుడు ఎరుపెక్కిన ఉదయంలా ఉండకూడదు.. ⁠- మాధవి కాళ్ల
Read More

పరువు హత్య

పరువు హత్య పరువు పరువు అని దాన్ని కోసం పాకులాడుతూ పరువు పోతే ప్రాణాలు తీసుకోవడం ఎంత వరకు న్యాయం... కూతురు ఎవరిని ప్రేమించిన ఆ ప్రేమని ఒప్పుకోలేదు అని వాడితో వెళ్లిపోయిందని కోపంతో రగిలిపోతూ కన్న కూతురు అని చూడకుండా హత్య చేసేశారు.. తెలిసిన వాళ్ళ దగ్గర తన పరువు పోయిందని కూతురి మీద పగ పెంచుకొని వాళ్ళని అతి దారుణంగా చంపేశారు.. ప్రేమకి కులం, మతం, ప్రాంతం అసలు ఎందుకు చూస్తున్నారో నాకు మాత్రం అర్దం కావడం లేదు... వాళ్ళని చంపి కడుపు కోత మిల్చుకుంటున్నారు... పరువు హత్యలు చేస్తున్నారు.. ⁠- మాధవి కాళ్ల
Read More

మోసం చేశాడు

మోసం చేశాడు నేను ఇష్టం అని చెప్పి నన్ను ప్రేమించున్నాను అని చెప్పి నేను నీ మాటలు అన్నీ నమ్మి నీ గురించి ఎవరు ఏం చెప్పినా వినకుండా నిన్నే గుడ్డిగా నమ్మిన్నాను. చివరికి అందరిని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ నీకు ఇంతకముందే పెళ్లి అయ్యిందని నేను తెలుసుకొని ఎంతో బాధ పడ్డాను. నువ్వు నన్ను మోసం చేశాడు అని తెలుసుకున్నప్పటికీ నేను వాళ్ళ దగ్గర నమ్మకం కోల్పోయాను. ఇప్పుడు నా జీవితం తెగిన గాలిపటంలా ఉంది. నీ వల్ల నా గమ్యం కూడా మర్చిపోయాను. నా వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇప్పుడు నా గమ్యానికి చేరుకున్నాను. ⁠- మాధవి కాళ్ల
Read More