పేరు లేని బంధం
పేరు లేని బంధం అన్ని మంచి విషయాలు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. జీవితం అంటేనే ఒడిదుడుకుల ప్రయాణం. అలాంటి సమయం లో నాకున్న ఏకైక బంధం నాన్న. నాన్న అనారోగ్య సమస్యల వల్ల ఆయన్ని కోల్పోవాల్సి వచ్చింది. నాన్న చేసేది చిన్న ఉద్యోగమే, ఆస్తులు కూడా లేవు. అమ్మకు ఇల్లు తప్ప వేరే ఏమి తెలియదు. అన్ని చూడాల్సింది నేనే. ఊర్లో ఉన్న పెద్ద మనుషులు తలా కాస్త చెయ్యి వేయడంతో నాన్న అంతక్రియలు నిర్వహించారు. ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. ఇల్లు ఎలా గడవాలి అన్నది ఆ సమస్య ఇది లేని వారికి పెద్ద సమస్య అయితే ఉన్నవారికి చాలా చిన్న సమస్య అసలు సమస్య కాదు. ఇక ఇంటిని అమ్మని చూసుకోవడానికి నేనే పెద్దదిక్కు కాబట్టి ఉన్న ఊర్లో ఆస్తులు ఏమీ లేవు ఉన్నదొక ఇల్లు అమ్మను ఒక దాన్ని వదిలి వెళ్ళలేక తనని…