రైతు గొప్పదనం
రైతు గొప్పదనం "నా దగ్గర ఈ డబ్బే ఉంది మిగతాది నా పంట పండిన తర్వాత కడతాను" అని రిక్వెస్ట్ గా అడుగుతాడు బ్యాంక్ మేనేజర్ ని రైతు. "లోన్ తీసుకున్నప్పుడు లేని బాధ బ్యాంక్ కి ఎందుకు తక్కువ సమయంలో కట్టకపోతున్నారు" అని కోపంగా అడుగుతాడు. "ఈ ఏడాది పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే టైంకి డబ్బులు కట్టలేకపోయను" అని చెప్పాడు రైతు. "ఎందుకు ఋణం తీసుకొని పంట పండిస్తున్నారు. ప్రపంచం మారుతుంది. మీరు ఎప్పుడు మారతారు" అని చులకన భావంతో మాట్లాడతాడు. "మీ వల్లే దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని ఇంకా ఎన్నో మాటలు మాట్లాడాడు." అప్పుడే మేనేజర్ పై ఆఫీసర్ వచ్చి "మీరు చేస్తుంది ఏమైనా న్యాయంగా ఉందా?" అని అడిగారు మేడం. కొంచం కంగారుగా తడపడుతూ "అది మేడం పంట పండించడం కోసం మా బ్యాంక్ లో ఋణం తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఒకసారైనా…