rambabu

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి అండగ నిలిచేవాడిని ఏమని మే కోరెదెము కొండలపై ఉన్నవాడిని ఎంతని మే వేడెదెము చరణం దారే తెలియని వారము నిను చేరాలని వేచెదము నీవుంటే మాకు వేడుక అనుమానము లేనే లేదిక చరణం లేనివారికి నీవేగా ఉన్నవారికీ నీవేగా నీకృపనే కోరేవారికి ఇంకెవరు లేరుగా చరణం మాలోనే నీవుంటే ఏ భయము చేరదుగా గోవిందా అని పలికితిమా నీవే మమ్ము వెతికేవు చరణం నీ తలపే సాక్షిగా నిను చూసే భాగ్యానికి కన్నులు కాయలు కాచినవి కాలము పరిగెడుచున్నది -సి.యస్.రాంబాబు
Read More

అవని లో…. ఆమె

అవని లో.... ఆమె నా అవని అంతా....ఆమే నా అనుక్షణం.... ఆమే నా ఆద్యంతం....ఆమే నా ఆంతర్యం....ఆమే నా ఆలోచన... ఆమే నా వెలుగు....ఆమే నా భవిత.... ఆమే నా ఆశా... ఆమే నా శ్వాసా .... ఆమే నా అనుక్షణం... ఆమే నా ప్రతీ క్షణం... ఆమే.. నా మరో క్షణం... ఆమే.. నా బంగారం...ఆమే నా సింగారం...ఆమే నా అరవిరిసిన మందారం... ఆమే నా కలల ప్రపంచం అంతా ఆమె.. ఆమె.. ఆమె..ఆమె..ఆమే.. జగత్తు లోని మహిళా మణులందరికీ ఇవే నా హృదయ పూర్వక పాదాభివందనాలు.   - కిరీటి పుత్ర రాంబాబు రామకూరి
Read More

ఆశల పల్లవి – గేయం

ఆశల పల్లవి - గేయం పల్లవి స్త్రీ అంటే మమతని స్త్రీ అంటే కరుణని  తెలుసుకో మనిషీ  తెలిసి మసలుకో మనిషీ చరణం చైతన్యమూర్తియై కాపాడును తాను తనులేని జగతిని ఊహించలేము  చీకటిలో నీవుంటే నీవెలుగే తాను కదా నీ కంటిపాపయై లాలించు దేవతగా చరణం ఆడపిల్ల ఉన్నచోట ఆశదెంత సంబరము నింగిలో సగమైనా ఇంటికో పూర్ణత్వం విడనాడి మూర్ఖత్వం ముందడుగే  వేయిద్దాం  సమానతను సాధించే అవకాశం తనకిద్దాం చరణం తనపట్ల హింసనే గర్హించుదామండీ తల్లడిల్లు హృదయానికి నీడనిచ్చుదాము జగతిలోన స్త్రీ శక్తి లేకుంటే అధోగతే  తప్పునే దిద్దుకుంటే సుఖశాంతులు మనఇంట మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో - సి.యస్.రాంబాబు
Read More

ఘోష

ఘోష ఆకలి చావుల ప్రపంచంలో  ఇప్పుడు మరో మరణమృదంగం తాండవమాడుతోంది  మనిషికి మతం ఉన్మాదమిస్తే  దేశాలది విస్తరణ కాంక్ష  శకలాలు శకలాలుగా రాలిపోతూ భవనాలు, కుటుంబాలు ! ప్రపంచం కుగ్రామమయిందంటాం కానీ ప్రపంచం మళ్ళీ కుంగిపోతోంది ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ! విశ్వ రహస్యాలను ఛేదించే మనిషి  విస్తరణ కాంక్ష అనే అయస్కాంతానికి దేశాలతుక్కుపోతుంటే నివారించలేని అచేతనుడయ్యాడు ! రణం మొదలవటానికి కారణమక్కర్లేదు  సాకు మాత్రమే చాలని చరిత్ర చెబుతూనే ఉంటుంది ! కాలం కరుకైనదంటాం  కాదు  దేశాలమధ్య రగిలే కాంక్షలు కరాళనృత్యమై  ఉషోదయాల ఉసురుతీసి  అనిశ్చితి ఊబిలో నెట్టేస్తాయి ! నిట్టూర్చే గొంతులనూ నొక్కేసే నెగళ్ళు రాజుకుంటుంటే రెక్కలు తెగిన శాంతికపోతాల రుథిరం నిస్సహాయతకు సంకేతమై  జాలిగా ఘోషిస్తుంటుంది ! - సి.యస్.రాంబాబు
Read More

పలుకుతేనెల వ్యాసార్ధం

పలుకుతేనెల వ్యాసార్ధం   కొన్ని పుస్తకాలు ఒక భావపరిమళాన్ని మనలో వ్యాపింపచేస్తాయి. ఎంచుకున్న అంశాలు... ఆ అంశాలను ఆవిష్కరించిన తీరు మనలను ముగ్ధుల్నిచేస్తాయి. మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. కథో, నవలో అయితే కొంత కాల్పనికత బరువును మోస్తాయి. అయితే పుస్తకమో వ్యాససంకలనమయినప్పుడు అది వ్యాసార్ధమై రచయిత హృదయ వైశాల్యాన్ని ఆవిష్కరించే వెన్నెల జాబిలి కావొచ్చు. అసలు వ్యాసమంటే వచనం కదా. వచనం రాసి మెప్పించటం అంత సులువు కాదు. వ్యాసం అందంగా ఆకట్టుకోవాలంటే పదాల కూర్పు, పొహళింపు వ్యాసానికి మరింత అవసరం అని గుర్తించాలి. అందుకే చాలా వ్యాసాలు భారంగా సాగుతూ చదువరిని ఆకట్టుకోవు.... అందుకు భిన్నం వోలేటి పార్వతీశంగారి వ్యాస సంకలనం "వ్యాసార్థం". ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రయోక్తగా నాలుగు దశాబ్దాల అనుభవం, స్వరమాంత్రికుడిగా అనేక సభలలో ఆశువుగా మాటలను అల్లేనేర్పు, రచనా వారసత్వం ఇవన్నీ కలిసి ఈ పుస్తకాన్ని అక్షర పరిమళంతో నింపేశాయి. సౌకుమర్యాన్ని పరవశంతో పరిచాయి. అందుకే ఈ…
Read More

తీరం

తీరం శిశిరమైతేనేమి ఆకురాలినచోటే పూలు తలూపుతుంటాయి విప్పుకునే జ్ఞాపకాల వెనకే తప్పుకునే వ్యాపకాలుంటాయి తలపులను తడుముతుంటే మనసు తలుపులు తెరచి స్వాగతగీతాన్ని పాడుతుంది గతుకుల గతాన్ని పూడ్చమంటుంది పరుగులు తీసే కాలం కరవాలం కనుగొనాలని తాపత్రయపడతాం వేటుపడక మానదుకదా కాలంతో వేరుపడే ఆలోచనెందుకు మట్టిపరిమళం చుట్టేయాలంటే మట్టితో మమేకమవ్వాలిగా మమతలన్ని పెనవేస్తేనే మనుషులంతా అర్థమయ్యేది సుఖదుఖాలు రాగద్వేషాల వలయంలో శ్రుతిలయలు స్థిరంగా తిష్ఠవేసుకుంటే చీకట్లనుమోసే జీవితం తీరమెన్నడు చేరెనో ! - సి.యస్.రాంబాబు
Read More