స్నేహం ఏవో ఊసులాడి ఎన్నో పంచుకొని ఏదో హాయినిచ్చే స్నేహాన్ని తెలుపగలమా అప్రయత్నంగా. అనుకోని దారిన కలిసి నిస్వార్థంగా. ఆపదలో సాయం చేసే స్నేహాన్ని తెలుపగలమా అపార్థ భావనలకు ఈర్ష, ద్వేషాలకు చోటివ్వని దారిలోని స్నేహాన్ని తెలుపగలమా సంతోషం. భరువనిపించే భాదలో అడగకుండానే జత కట్టే అడుగుల్లోని స్నేహాన్ని తెలుపగలమా ధనిక, పేద కులము, మతము భాషా, వేషాలనే గతుకుల్లేని వంతెన స్నేహం. - హనుమంత
స్నేహం
స్నేహం స్నేహం చెరగనిబంధం విశ్వాసానికి నాంది సంతోషాల సారం స్వార్థానికి తావులేనిది కష్టాలను కడతేర్చేది కన్నీటిని తుడిచి పెట్టేది ఆలోచనలు పంచుకునేది అంతరంగానికి అర్థమయ్యేది అనుమానానికి తావులేనిది దాపరికానికి దారిలేనిది కులమతాలకతీతమైనది ఆపదలో నిలబడేది మనసువిప్పి మాట్లాడుకునేది ఆటంకాలను అధికమించేది అవసరాలను గుర్తించేది ఇష్టాలను తెలుసుకునేది జ్ఞాపకాలను దాచుకునేది ఫలితాన్ని ఆశించనిది నిజాయితీని రుజువుచేసేది అందరిని ఆకర్షించేది ఆనందాలను అందించేది మోసానికి చోటు లేనిది బలహీనతలను భద్రపరిచేది బలాన్ని నిరూపించేది సహాయానికి వెనకాడనిది అంతరంగాన్ని అర్థం చేసుకునేది ఇష్టాలను తెలుసుకునేది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేది చిరునవ్వుకు చిరునామాగా నిలిచి నిన్ను నిన్నుగా గుర్తించేది స్నేహమే చెరిగిపోని బంధానికి మధురమైన అనుభూతి....... - జి జయ
స్నేహం
స్నేహం ఎక్కడ పుట్టమో తెలీదు.. ఎలా పెరిగమో తెలీదు.. కానీ ఒక రోజు ఇద్దరం కలిసాము.. నువ్వు నాకు పరిచయం అయిన క్షణం నుండి ఈ రోజు వరకు... నా వెన్నంటే ఉండి నాకు అన్ని విధాలుగా అన్ని వేళలా మంచి, చెడులో నాకు తోడుగా ఉన్నావు.. ఇలాగే ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలి.. నన్ను విడిచి వెళ్ళకూడదు.. అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ఏ స్వార్దం లేకుండా.. ఏ రక్త బంధం లేకుండా.. మన మంచి కోరుకునేది ఓకే ఒక్క బంధం స్నేహ బంధం.. అలాంటి బంధం దొరికితే ఎవరైనా అదృష్ట వంతులే.. మనల్ని కన్న వారితో కూడా అన్ని పంచుకొలేము.. తోడ పుట్టిన వాళ్ళతో అన్ని చెప్పుకోలేని... కానీ మన జీవితంలోకి వచ్చే స్నేహితులకి మాత్రం అన్ని పంచుకుంటాం... అదే స్నేహం యొక్క గొప్ప తనము.. కానీ ఇలాంటి స్నేహాన్ని.. కొందరు స్వార్దం కోసం ఉపయోగించుకుంటున్నారు.. అవసరాల కోసం…