the pen

సంధ్యా సూర్యుడు

సంధ్యా సూర్యుడు తూరుపు సూరీడు మా ఊరి కొచ్చాడు మేఘాల చెలిమితో రోజంతా వెలిగాడు ప్రకృతి సరస్సులో ప్రణయ జలకాలాడి సంధ్య వేళకు అలసిన సింధూర భానుడు ఆకాశ వీధిని వదిలి మా‌ ఇంట వాలాడు‌.! - ది పెన్
Read More

కలగంటే సరిపోదు.!

కలగంటే సరిపోదు.! పచ్చని ప్రకృతి నడుమ చిరిగిన నిక్కరు మెడలో కండువా వేసుకుని పశువులను మేపుతున్న ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు.. ఒకరోజు పొలంలో ఆకాశం వైపు చూస్తూ పరిగెడుతున్నాడు.. గుట్టలు ఎక్కుతూ గట్లను దాటుతూ.. పడుతూ, లేస్తూ, ముందు ఏముందో చూడకుండా పరిగెట్టడానికి కారణం ఆ పిల్లాడికి నింగిలో శబ్దం చేస్తూ పక్షిలా దూసుకుపోతున్న ఓ విమానం... వాడికి ఎందుకో దానిని చూస్తే పట్టరాని ఆనందం. అది ఆకాశంలో మబ్బుల మాటున దాగి ముందుకు పోతుంటే సాధ్యమైనంత దూరం పరిగెడుతూ దాన్ని సాగనంపడం వాడికి ఓ సరదా... ఎప్పుడో ఒకసారి ఆకాశంలో అలా చిన్నగా కనిపించే విమానాన్ని చూడడం ఎంతో గొప్పగా భావిస్తుంటాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.. తండ్రి సంపాదనపైనే ఇంటిల్లపాది గడపాల్సిన పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆ పిల్లాడికి అంతకన్నా పెద్దపెద్ద ఆశలు ఏముంటాయిలే అనుకోవడం సహజం.... కానీ వాడలా అనుకోలేదు.…
Read More

ప్రణయ పూల వాన

ప్రణయ పూల వాన నీలి గగనాలలో నిండు చందురుడు.. నీలాకాశ వీధుల్లో నీకై వేచిన తారకలు.. నీలిమేఘాల పానుపువేసిన మెరుపులు.. పారిజాత సుగంధ పుష్ప పరిమళాలు.. నీ రాకకోసం ఎదురుచూస్తున్నాయి కృష్ణా.. నీల మోహనా..నీ రాధ మొర వినరా.. ప్రణయ పూల వానలో నిను అభిషేకించెదరా.. ముగ్ద మనోహరరూపా నన్ను‌ బ్రోవగ రారా.. ముకుందా..నీవులేని నా బతుకే చీకటి రా.. మాధవ..నీవే నా లోకంగా జీవిస్తున్నానురా.! - ది పెన్
Read More

మాటిస్తున్నా.!

మాటిస్తున్నా.! నిశీధిలో నా నీడైనా నాతో ఉండదేమోగానీ నీ తలపులను విడువను నిద్రలో శ్వాసనైనా ఆపుతానేమోగాని, నీ ఆలోచనను వదలను వేకువనే నీ రూపం కళ్ల ఎదుట ఉందనే ఊహతోనే మేల్కొంటాను నాతో నువ్ లేకున్నా నీకోసం నిత్యం ప్రేమతో కన్నీరొలుకుతుంటాను నువ్ నాతో ఉంటే చాలు దేన్నయినా ఎదిరించగలననే ధైర్యం నాదంటాను నీతో మాట్లాడితే చాలు ఆనందంలో ఎగిరిగంతేస్తుంటాను నీతో గడిపే ప్రతి నిమిషం అలా కరిగిపోకుండా ఆగిపోవాలని కోరుకుంటాను కలల తీరం దాటని నా ఈ కన్నీటి ప్రేమను నీకు చెప్పాలనుకుంటాను ఇలా కలలు కనే నా కళ్లు జీవితమంతా నీ కోసం ఎదురుచూస్తుంటాయని మాటిస్తున్నాను.! - ది పెన్
Read More

కసాయిగా మారకు ఓ నేస్తం

కసాయిగా మారకు ఓ నేస్తం ప్రతి జననం ఒక యుద్ధం.. అమ్మలే అందులోని సైన్యం నవమాసాలు కంటికి రెప్పలా కాచుకున్న పసిగుడ్డు.. పొట్టలోనే కాలితో తన్నుతున్నా ఏ జనని నొప్పి అనదు బాధ్యతల భారం ఎంతున్నా బిడ్డ బరువును కాదనదు కడుపున మోసి.. పేగు బందాన్ని ముడివేసి.. తన ఊపిరినే ఆయువుగా పోసి.. బిడ్డకు జన్మనిస్తుంది బతుకు సమరంలో నిత్యం పస్తులుంటున్నా.. తన‌ రక్తాన్నే పాలగా మార్చి కన్నవాళ్ల ఆకలి తీరుస్తుంది పుడుతూనే పొట్ట చీల్చి.. పెరిగి పెద్దయి పాలు తాగిన రొమ్మునే గుద్దే నీచులుగా మారుతున్నారు మృగాళ్లు.. తల్లి ఒడిలో పెరిగింది మరచి పడతి ప్రాణం తీస్తూ.. సృష్టికి మూలమైన స్త్రీ శీలాన్ని దోస్తున్నారీ దుర్మార్గులు కనిపించే ప్రతి ఆడది మన అమ్మకు ప్రతిరూపం నీలాగే మరో మగవాడిని పుట్టించే మాతృస్థానం కసాయిగా మారకు ఓ నేస్తం.. గుర్తించు ఈ సత్యం లోకంలో 'ఆమె' ను మించి కనిపించదు మనకు…
Read More

నిను చేరని నా లేఖ.!

నిను చేరని నా లేఖ.!   నీ చూపు చాలు నాకదే వందేళ్ల‌ వరమనుకున్నా.! నీ మాట‌ వింటూ నేను ఇన్నేళ్లుగా బతికేస్తున్నా.! నీ తోడు లేక ప్రతిరోజూ..ప్రతిక్షణం మరణిస్తున్నా.! నీ ప్రేమకి..నీ మనసుకి..నే బానిసనవుతున్నా.! నీ మదిలో నా స్థానాన్ని తిరిగి పొందాలని తపిస్తున్నా.! నీ గుండెల్లో నా స్థానం కోసం మళ్లీ కొత్తగా ప్రేమిస్తున్నా! నీ నుంచి ఇక జీవితంలో దూరం కానని మాటిస్తున్నా.! నీ ఎదురుపడలేక నిను చేరని ఈ లేఖను నే రాస్తున్నా‌.! - ది పెన్
Read More

శ్రీదేవి.. రైలు.!

శ్రీదేవి.. రైలు.! ఒక‌ ఊరిలో ఓ ఆసామి ఉన్నాడు..అతనికి హీరోయిన్ శ్రీదేవి అంటే పిచ్చి‌ అభిమానం..ఒక‌ రోజు ఆమె సినిమా చూడ్డానికి పట్నానికి వెళ్లాడు..ఒక‌ సీన్ లో శ్రీదేవి స్నానం చేయడానికి వెళుతుంటుంది..రైలు పట్టాలకు ఆవల తడికలతో కట్టిన స్నానాల‌గది ఉంది.. ఆ చిల్లుల నుంచి ఆమె అందాలు కనిపిస్తాయేమోనని కళ్లు బాగా పెద్దవి వేసుకుని‌ బల్లమీద కొంచెం ముందుకు జరిగి ఆత్రంగా చూస్తున్నాడు..సరిగ్గా శ్రీదేవి చీర విప్పే సమయానికి పట్టాల మీద రైలు వచ్చేసింది..వీడేమో రైలు పట్టాలకు ఇవతల.. శ్రేదేవి అవతల ఉండిపోయారు..రైలు వెళ్లే సరికి శ్రీదేవి స్నానం కూడా అయిపోయింది.. "ఛా వెధవ రైలు సరిగ్గా ఇప్పుడే రావాలా..బంగారం లాంటి ఛాన్స్ ను మిస్ చేసేసింది"..అని తిట్టుకుంటూ ఇంటికెళ్లిపోయాడు. మర్నాడు మళ్లీ అదే సినిమాకు వచ్చాడు..ఇప్పుడూ అదే ఆత్రం..పక్కవాడు పలకరిస్తే వాడిపై అరుపులు కేకలు.."మూసుకుని సినిమా చూడరా" అని..ఈ రోజు ఎలాగైనా శ్రీదేవిని అలా చూసేయాల్సిందేనని‌ గట్టి పట్టుదలతో…
Read More

ఏ రాయైతేనేం.!

ఏ రాయైతేనేం.! మా తాతకి ఒక నమ్మకం ఉండేది.. నేను మందులు తీసుకెళ్లి ఇవ్వగానే.. ఎంతరా.. అనే వాడు.. ఖరీదు చెప్పగానే.. ఆ మందు పనిచేస్తుందా.. లేదా అనేది తేల్చేసేవాడు.. నేనప్పుడు ఆశ్చర్యంగా చూసేవాడిని.. ఈయనేదో పెద్ద డాక్టర్ అయినట్టు.. అన్నీ తెలిసినట్టు చెప్పేస్తాడేంటో.. నన్ను ఆడుకోనివ్వకుండా.. అని తిట్టుకున్న సందర్బాలు కూడా చాలానే ఉన్నాయి..  డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మా‌ నుంచి దూరమై ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలతో ఏడిపిస్తూనే ఉంటారు. కొద్దిరోజుల క్రితమే మా సోదరి ఆడపడుచుకి అనారోగ్యం అంటే.. రిపోర్టులు తెప్పించుకుని తెలిసిన వైద్యులకు చూపించాను.. నాలుగు పదుల వయసు దాటిన ఆమెకు వచ్చింది ప్రాణాంతక వ్యాధి‌లా ఉందని సందేహపడి వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురమ్మారు.. అక్కడైతే ఆధునిక సామాగ్రి ఉందని, వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేస్తారని.. మనం‌ మాట్లాడి మరింత మెరుగైన వైద్యం అందించేలా చూడవచ్చని వారు చెప్పింది యథాతథంగా మా బావకు, ఆయన…
Read More

బండనెత్తిన బాల్యం.!

బండనెత్తిన బాల్యం.! రెక్కడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టి అమ్మానాన్నలకు భారం‌ కాకూడదని బరువెత్తావా బండబారిన ఈ మనుషుల మధ్య రాతిబండను పట్టి లేలేత నీ చేతులు నలిగిపోతున్నా నవ్వుతున్నావా మసిబారిన నీ మోము చూసి కన్నీరొలకని కళ్లుంటాయా కోట్లు ధారబోస్తున్న ప్రభుత్వాలకు నీ శ్రమ కనపడదు పదవికై పరుగెత్తే నేతలకు నీ స్వేదం‌ విలువ తెలియదు ఓ పాలబుగ్గల‌ పసిపాపా..నీకెంత కష్టం వచ్చిందమ్మా నీ తల్లిదండ్రుల ఒడిలో ఒక్క క్షణమైనా సేదదీరేవా?? నేర్చుకోదా గుణపాఠం నినుచూసైనా ఈ సభ్యసమాజం ఆటపాటలతో తోటి పిల్లలు ఆనందంగా గడుపుతుంటే ఎండనకా వాననకా నువ్వీరాళ్లలో అలసిపోతున్నావు బడికెళ్లి పాఠాలు నేర్వాల్సిన ఈ చిరు ప్రాయాన్ని అక్షరాలు‌ దిద్దే స్థోమత లేక మట్టిపాలు చేస్తున్నావు నీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేని‌ మేమమ్మా పేదలం.! - ది పెన్
Read More

ఎలా పెరిగాం.. ఎలా‌ పెంచుతున్నాం.!

ఎలా పెరిగాం.. ఎలా‌ పెంచుతున్నాం.! "అమ్మా.. చెప్పులు అరిగిపోయి అస్తమానూ తెగిపోతున్నాయే.. కొత్త చెప్పులు కొనుక్కుంటాను డబ్బులియ్యవా.! అంటున్న కొడుకుతో.. "ఒరేయ్ నాయనా.. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకునే నాటికి మన ఊరిలో పాత ప్రెసిడెంట్ దగ్గర పశువుల కాపరిగా ఉండేవాడు. పాలేరుగా ఇంటిపని, పొలంపని, పశువుల కాపు అంటూ రాత్రీ పగలూ నిద్ర లేకుండా పనిచేసేవాడు. ఆరోజు ఆయన కాలికి చెప్పులేసుకోలేదు.. నీ అక్కలు పుట్టాక వ్యాపారం మొదలెట్టాడు.. సైకిల్ మీద రోజూ ఊరూరా తిరిగేవాడు.. అప్పుడూ ఆయన కాళ్లకు చెప్పులు లేవు.. కొంతకాలానికి నువ్ పుట్టావ్.. ఆయన వ్యాపారంతో పాటు పొలాన్నీ చూసుకోవడం మొదలుపెట్టారు.. రాత్రిళ్లు చేనుకు నీళ్లు పెట్టడానికి వెళ్లినప్పుడు కూడా చెప్పులు వేసుకోలేదు.. రాళ్లు, ముళ్లు గుచ్చుకుంటాయని, విష పురుగులు కాటేస్తాయని భయమున్నా చెప్పులేసుకోలేదు. ఎందుకో తెలుసా? చెప్పులతో చేలో పనిచేయలేమని కాదు, సైకిల్ తొక్కలేక కాదు.. వాటిని కొనే డబ్బులను కూడా మిగిల్చి…
Read More